Ads
రామ్ చరణ్… లోపల ఎన్ని ఆలోచనలు సంఘర్షణలు ఉన్నా బయటకు కనిపించకుండా అగ్ని పర్వతం లా ఉంటాడు. తండ్రిలాగే వినేయ విధేయత కలవాడు. ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తం. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా అంతే నిరంతరం అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తానొక జంతు ప్రేమికురాలని అనేక ఇంటర్వ్యూ లలో చెప్పింది ఉపాసన. హైద్రాబద్ జూ పార్క్ లోని అనేక జంతువుల సంరక్షణ ఉపాసన స్వయంగా చూసుకుంటున్నారు. వాటికయ్యే ఖర్చును కూడా ఈమె స్వయంగా భరిస్తున్నారు.
Video Advertisement
ఉపాసన అనేక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన సంఘటనలను తరచూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారామె. ఉపాసన 200 వృద్ధ, అనాథ ఆశ్రమాలను దత్తత తీసుకుని వాటి ఆలనా పాలనా చూస్తున్నారు. ఒకవైపు ప్రతీష్టాత్మక అపోలో హాస్పిటల్ ఎక్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా ఉంటూ మరో వైపు రామ్ చరణ్ కు చెందిన పలు వ్యాపారాలను కూడా ఆమె చూసుకుంటుంటారు. అయితే ఆమె ఏడాది సంపాన ఎంత ? అని సహజంగానే చాలా మందికి డౌట్ వస్తుంటుంది. మరి దానికి సమాధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఉపాసన వాళ్ళది కామారెడ్డి జిల్లాలోని దోమకొండ. తెలంగాణలోని అతి పెద్ద సంస్థానాలలో ఒకటి. భూస్వాముల కుటుంబం. తరతరాల ఆస్తి వాళ్ళ సొంతం. పైగా అపోలో హాస్పిటల్స్, అపోలో ఫార్మసీ లాంటి బిజినెస్ లతో బాగానే సంపాదిస్తుంది. కొణిదెల ఉపాసన ఏడాదికి దాదాపుగా రూ.30 కోట్లను సంపాదిస్తారని సమాచారం. కానీ సామాజిక సేవా కార్యక్రమాలకే ఎక్కువగా ఆమె ఖర్చు చేస్తుంటారు. దీంతో ఆమె అందరి ప్రశంసలను పొందుతుంటారు.
End of Article