ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గారి రేంజ్ ఏంటో తెలుసా.? ఒక పబ్, రేంజ్ రోవర్ కారు..!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గారి రేంజ్ ఏంటో తెలుసా.? ఒక పబ్, రేంజ్ రోవర్ కారు..!

by kavitha

Ads

వేణు స్వామి, ఈ జ్యోతిష్యుడి పేరు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో చాలా ఫేమస్. సినీ సెలబ్రెటీల జాతకాలు చెప్పడం ద్వారా వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు. సెలబ్రెటీల జాతకాలే కాకుండా ఎప్పుడు మరణిస్తారో కూడా చెప్తుంటారు. ముఖ్యంగా సినీ ప్రముఖుల విడాకుల గురించి ముందే చెప్తుంటారు.

Video Advertisement

వేణు స్వామి ముందే చెప్పినట్టు నాగ చైతన్య, సమంత విడిపోయారు. దాంతో ఆయన పేరు మీడియాలో మారు మ్రోగిపోయింది. ఆ తరువాత యంగ్ హీరో మరణం గురించి చెప్పగా తారకరత్న విషయంలో జరగడంతో వేణు స్వామి మరింత పాపులర్ అయ్యారు. అయితే ఆయన ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పడు చూద్దాం..
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి ఉన్న పాపులారిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. వేణు స్వామి చెప్పిన విషయాలను మొదట్లో అంతగా ఎవరు పట్టించుకోలేదు. నాగ చైతన్య, సమంతల విడాకులు, మెగా డాటర్ నిహారిక డైవర్స్ వేణు స్వామి చెప్పినట్టుగానే జరిగాయి. హీరో ప్రభాస్ గురించి కూడా వేణు స్వామి చెప్పినట్టే జరిగింది.  అయ్యాయి. సలార్ రిలీజ్ ముందు కూడా ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి చెప్పారు. కానీ ఆ మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ట్రోల్ చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో కొందరు వేణు స్వామికి నిజంగానే జాతకాలు చెప్పడం తెలిస్తే, ముందు తనని బాగు చేసుకోకుండా,  జాతకాలు ఎందుకు చెప్పుతారు అంటూ కామెంట్స్ చేశారు. వేణు స్వామి ఈ ప్రశ్నకు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో జవాబు చెప్పారు. ఈ క్రమంలో వేణు స్వామి తన ఆస్తుల గురించి తొలిసారి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తనకు ఒక పబ్ ఉందని, టైమ్ సరిపోక ఈ మధ్యే అమ్మేసినట్టు చెప్పారు.
రియల్ ఎస్టేట్,  వైన్ షాప్, రేంజ్ రోవర్ కారు ఉన్నట్టుగా తెలిపారు. ‘జ్యోతిష్యం చెప్పే వాడి జాతకం బావుంటే జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు అని వాగే వారికి నా సంపాదనే సమాధానం. నా రేంజ్ ఇది అని’ వేణు స్వామి చెప్పుకొచ్చారు. నేనే కాకుండా, నా భార్య వీణా కూడా సంపాదిస్తుంది. ఆమె సంగీతం ప్రావీణ్యురాలు అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: “యాత్ర 2″లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరీ… అందులో ఏం రాసి ఉందో చూస్తే కన్నీళ్లు ఆగవు!


End of Article

You may also like