Ads
ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది.
Video Advertisement
ఇదే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. అదేంటంటే హీరో, రావు రమేష్ గారు ఒక సీన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ సీన్ లో హీరో తర్వాత నిల్చొని మాట్లాడుతూ ఉంటాడు.
అలా మాట్లాడుతున్నప్పుడు మనకి వెనకాల నుంచి చూపించినప్పుడు హీరో షర్ట్ మామూలుగానే ఉంటుంది. కానీ ముందు నుంచి చూపించినప్పుడు మాత్రం హీరో షర్ట్ టక్ చేసి ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు కూడా గమనించండి. లాక్ డౌన్ లో ఉన్న తీరిక వల్ల మనం గమనిస్తూ ఉంటే ఇలా సినిమాలోని చిన్న చిన్న పొరపాట్లు బయటికి వస్తూ ఉంటాయి.
మనం ఇలా చూస్తే ఈ పొరపాట్లు జాబితాలో చాలా సినిమాలు ఉంటాయి. ఏ సినిమా అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అసలు వీటికి పొరపాటు అనేది కూడా చాలా పెద్ద పదం ఏమో. కాబట్టి వీటివల్ల సినిమాకి వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి ప్రేక్షకులు కూడా వీటిని అంత పెద్దగా పట్టించుకోరు. కానీ ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు అరే ఇది పొరపాటు ఏమో కదా అని అనిపిస్తుంది అంతే.
Also Check: Aravinda sametha Movie Dialogues in Telugu
End of Article