Ads
- చిత్రం : అతిథి దేవో భవ
- నటీనటులు : ఆది సాయి కుమార్, నువేక్ష, సప్తగిరి, రోహిణి.
- నిర్మాత : రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల
- దర్శకత్వం : పొలిమేర నాగేశ్వర్
- సంగీతం : అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి
- విడుదల తేదీ : జనవరి 7, 2022
Video Advertisement
స్టోరీ :
అభయ్ (ఆది సాయి కుమార్) కి మోనోఫోబియా అనే సమస్య ఉంటుంది. అంటే ఒంటరిగా ఉండడానికి భయపడుతూ ఉంటాడు. అభయ్ కి పుట్టుకతోనే ఈ సమస్య ఉంటుంది. ఆలా ఒంటరిగా ఉండడానికి భయపడే అభయ్, వైష్ణవి (నువేక్ష)ని చూసి ఇష్టపడతాడు. వైష్ణవి కూడా అభయ్ ని ఇష్టపడుతుంది. కానీ అభయ్ సమస్య వారి ప్రేమకి అడ్డు అవుతుంది. ఆ సమస్యని వైష్ణవికి చెప్పలేక, తనలో దాచలేక బాధపడుతూ ఉంటాడు అభయ్. అభయ్ వైష్ణవికి తన సమస్య గురించి చెప్పగలిగాడా? తర్వాత వాళ్ళిద్దరి జీవితాల్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? చివరికి వారిద్దరి కథ ఏమైంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కథ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ చూపించడం బహుశా తెలుగు ఇండస్ట్రీలో ఇది మొదటిసారి అయ్యి ఉండొచ్చు. కానీ పేపర్ మీద రాసుకున్న కథ, తెరకెక్కించడంలో ఎక్కడో పొరపాటు జరిగింది అనిపిస్తుంది. పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఆది సాయి కుమార్ బాగా నటించారు. తన క్యారెక్టర్ కూడా కొత్తగా అనిపిస్తుంది. హీరోయిన్ నువేక్ష కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు అలాగే సీనియర్ నటి రోహిణి నటన కూడా బాగుంది. అంతే కాకుండా, ఇంకొక ముఖ్య పాత్రలో నటించిన సప్తగిరి నటన చాలా బాగుంది. కానీ సినిమా మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది. సీన్స్ కూడా ఆసక్తికరంగా అనిపించవు. కొన్ని సీన్స్ లో డ్రామా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. స్లోగా ఉండడం వల్ల సినిమా చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- కాన్సెప్ట్
- నటీనటుల పర్ఫార్మెన్స్
మైనస్ పాయింట్స్:
- బోరింగ్ సీన్స్
- ల్యాగ్ అయిన కథనం
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
నెమ్మదిగా సాగినా కూడా సినిమా చూడచ్చు అనుకునేవారికి అతిథి దేవో భవ ఒక యావరేజ్ సినిమాగా అనిపిస్తుంది.
End of Article