ఇల్లరికం వచ్చిన ఓ అల్లుడు చేసిన పనికి ఆ అత్తింటివారు ఆశ్చర్యపోయారు. ఇల్లరికం వచ్చిన అల్లుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. అతనికి ఇంత డబ్బు ఎక్కడనుంచి వస్తుందో కూడా వారికి అంతుపట్టేది కాదు. చివరికి పోలీసులు అక్కడకి వెళ్ళినప్పుడు అతని బండారాన్ని బయట పెట్టారు. అసలు కథ ఏంటో చూడండి.

man theft bikes

న్యూస్ 18 కధనం ప్రకారం, మలికిపురం మండలం కత్తిమండ గ్రామానికి చెందిన బాలకృష్ణ ఇల్లరికం అల్లుడు గా వచ్చాడు. ఏ పని చేయకుండా జల్సాలకు బాగా అలవాటు పడ్డాడు. మద్యం, బెట్టింగులు వంటి వాటికి బానిస అయ్యాడు. అందుకోసం అప్పులు కూడా చేసాడు. చివరకు డబ్బు లేక పోవడం తో.. అత్తారింటి వారిని అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం, బైక్ దొంగతనాలను చేయడం ప్రారంభించాడు.

bike chori 1

చివరకు 27 బైక్ లను దొంగతనం చేసేసాడు. అలా దొంగతనం చేసే బైక్ లను తాకట్టు పెట్టి సొమ్ము చేసుకునేవాడు. నకిలీ తాళం చెవులను ఉపయోగిస్తూ.. బైక్ లను దొంగతనం చేసేవాడు. ఇలా దొంగతనం చేసిన బైక్ లను తెచ్చి అత్తారింటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం లో పెట్టేవాడు. ఇప్పటివరకు 12 బైక్ లను అలా తాకట్టు లో పెట్టాడు. మిగిలినవి ఖాళీ స్థలం లోనే ఉంచాడు.

bike chori 2

గత నెల 24 న ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి శ్రీనివాస థియేటర్లో సినిమాకి వెళ్లారు. బండిని పార్కింగ్ ప్లేస్ లోనే ఉంచినా కనిపించక పోవడం తో.. అతను రాజోలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. వరుస దొంగతనాలు జరుగుతున్నాయని గమనించిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ కేసు విచారణ కోసం రెండు బృందాలుగా ఏర్పాటై నిందితుడిని పట్టుకున్నారు. బాలకృష్ణను అదుపులోకి తీసుకుని.. అత్తారింటికి ఎదురుగ ఉన్న ఖాళీ స్థలం లో ఉన్న బైక్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు.