Ads
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. మన దేశంలో ఈ వ్యాధి విస్తరణను అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించారు. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా పూర్తిగా షట్ డౌన్ చేసారు. లాక్డౌన్ వల్ల ఆస్ట్రేలియాలో నివసించే ఎంతో మంది భారతీయ విద్యార్థులు వారి జీవనోపాధి కోల్పోయి, నిత్యావసర సరుకుల కొనలేని పరిస్థితి లో ఉన్నారు.
Video Advertisement
ఆస్ట్రేలియాలో ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థుల కష్టాలను గుర్తించి మేము ఉన్నాము అంటూ ముందుకు వచ్చారు ఆస్ట్రేలియా తెలంగాణ అస్సోషియేషన్ ఆధ్యక్షుడు అనిల్ బై రెడ్డి మరియు అస్సోషియేషన్ సభ్యులు ఫానికుమర్, కిరణ్, వంశీకొట్టల,కృష్ణ వడియల, రవి దామర, రఘు, పుల్లారెడ్డి, ప్రవీణ్ దేశం, అమర్, రాజవర్ధన్ రెడ్డి, మహేష్, సతీశ్. సుమారు 200 మందికి నిత్యావసర సరుకులను అందించి వారి గొప్ప మనసును చాటుకున్నారు.
విద్యార్థులఇమ్మిగ్రేషన్ సమస్యలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు త్వరలో ఉచిత కన్సల్టెన్సీ ఏర్పాటు చేయనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయసకారాలు అందించిన తెలంగాణ మరియు తెలుగు అసోసియేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .
End of Article