Anudeep
Anudeep
Maintaining Teluguadda website since 2017 and have 7 years of experience in managing various million fan based Facebook pages.
ఇదేమి ఎడిటింగ్ సామీ..! “చలి చలి గా అల్లింది” సాంగ్ ని ఇలా కూడా ఎడిట్ చేస్తారా..? చూస్తే నవ్వాపుకోలేరు..!
సోషల్ మీడియా లో మీమ్స్ ఎంత ట్రేండింగ్ లో ఉన్నాయో వీడియో ఎడిటింగ్ సాంగ్స్ కూడా అంతే. బాగా ఫేమస్ అయిన రకరకాల సాంగ్స్ ను తీసుకుని వాటిని పేరడీ వీడియోస్ లాగ ఎడిట్ చేయడం ఈ మధ్య బాగా ట్రేండింగ్ లో ఉంటోంది. మైండ్ కి రిలాక్స్ ని ఇస్తుండడం లో మీమ్ పేజెస్ కూడా ఇలాంటి వీడియోస్ ను ఎక్కువ గా ఎడిట్ చేస్తున్నాయి..

ఈ వీడియో కూడా అలాంటిదే. ఇన్స్టా గ్రామ్ లో “హైదరాబాద్ హవా మీమ్” పేజీ వారు ఈ వీడియో ను ఎడిట్ చేసారు. మిష్టర్ పర్ఫెక్ట్ సినిమా లో కాజల్ అగర్వాల్ హీరో ప్రభాస్ ను ఇష్టపడడం మొదలు పెట్టాక మంచి రొమాంటిక్ సాంగ్ వస్తుంది కదా.. “చలి చలి గా అల్లింది.. గిలి గిలి గా గిల్లింది”..అంటూ ఈ పాట సాగుతూ ఉంటుంది. ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఈ సాంగ్ ని ఫన్నీ వీడియో గా “హైదరాబాద్ హవా మీమ్” పేజీ వాళ్ళు ఎడిట్ చేసారు.

ఈ వీడియో ని చూస్తే మీరు కూడా నవ్వాపుకోలేరు. చాలా సినిమాల్లోని సీన్లను కట్ చేసి తీసుకొచ్చి ఎడిట్ చేసారు. ఇలా ఓ సాంగ్ కి తగ్గట్లు సినిమాలలోని సీన్ లు తీసుకొచ్చి ఎడిట్ చేయడం చాలా కష్టమైన పనే. కానీ, ఒకసారి వీడియో ని ఎడిట్ చేయడం పూర్తి అయ్యాక.. దానిని చూసి నవ్వుకుంటుంటే ఆ కష్టం మర్చిపోతారు. ఇప్పడు సోషల్ మీడియా లో ఈ వీడియో హల్ చల్ చేస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. మీరు కూడా చూసేయండి మరి.. మీ ఒపీనియన్ ని కామెంట్ చేసేయండి..
Jathi Ratnalu Deleted Funny Comedy Scenes – Jathi Ratnalu Comedy Scenes
టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ ఇప్పుడు ‘జాతి రత్నాలు’ సినిమా..విశేషంగా ప్రేక్షక ఆదరణ పొందుతున్న ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని సాధించి పెడుతుంది, బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు చిన్న సినిమాలలో అతి పెద్ద విజయం గా చెప్పుకోవచ్చు.ఇక పోతే ఈ సినిమాలోని కామెడీ సీన్స్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో లో మేజర్ ప్లస్ పాయింట్స్ రచయిత రాసిన పంచ్ డైలోగ్స్, ఈ డైలాగ్స్ సినిమా లో చాల బాగా పండాయి..ఇక పోతే సినిమాలోని మురళి శర్మ చేసిన కోర్ట్ సీన్ కి సంబంధించి చిత్ర యూనిట్ ఒక వీడియో పోస్ట్ చేసింది.సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయినా మెన్స్ ఆధారంగా చేసిన ఈ ఫన్నీ సీన్ సినిమాలో డిలీట్ అయ్యింది..Watch : Jathi Ratnalu Deleted Funny Comedy Scenes Jathi Ratnalu Scenes
Watch Jathi Ratnalu Deleted Scene
Also Check: Jathi Ratnalu comedy Punch Dialogues
Also Check: Jathi Ratnalu Deleted Funny Comedy Scenes Jathi Ratnalu Scenes
నెలలో కొడుకుకి 1.5 లక్షలు పంపడం కోసం…రోడ్డుపై దోశలు వేస్తున్న సీరియల్ నటి.! హ్యాట్సాఫ్ అంటున్న నెటిజెన్స్.!
సినిమా ఇండస్ట్రీ అనగానే అదొక రంగుల ప్రపంచం లా కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ లో ఉండే నటీనటులందరూ ఎక్కువ మొత్తాల్లో డబ్బులు వెనకేసుకొని లగ్జరీ లైఫ్ ని గడుపుతూ ఉంటారని మనమంతా అనుకుంటాం. కానీ, అందరి జీవితాలు అలా ఉండవు. సినీ ఇండస్ట్రీ లో పైకి కనిపించే ప్లాస్టిక్ నవ్వుల నటన వెనుక, కన్నీరు పెట్టించే గాధలు కూడా ఉంటాయి. అందుకు ఇపుడు మనం చెప్పుకోబోయే సీరియల్ నటి జీవితమే ఉదాహరణ.

ఈమె కవితా లక్ష్మి అనే సీరియల్ ఆర్టిస్ట్. మలయాళం లో చాలా సీరియల్స్ లో నటించి తక్కువ సమయం లోనే ఫేమస్ అయ్యారు. కుటుంబ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నారు. ఆమె “శ్రీ ధనం” అనే సీరియల్ లో శాంత పాత్రలో నటించారు. ఈ పాత్ర ఆమెకు ఎంతగానో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అయితే ఆమెను అదృష్టం మాత్రం వరించలేదు. పైకి చెప్పుకోవాటానికి స్టార్ అయినా ఆమె వ్యక్తిగత జీవితం లో కష్టాలు తప్పలేదు. ఆమె భర్తతో పదమూడేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన పిల్లల బాగోగులు కూడా చూసుకుంటున్నారు.

కవితా లక్ష్మి కొడుకు బ్రిటన్ లో చదువుకుంటున్నాడు. బ్రిటన్ లో అయితే చదువు బాగుంటుందని, అక్కడ పార్ట్ టైం చేస్తూ చదువుకోవచ్చని …కొడుకుని బ్రిటన్ కు పంపించింది. అతను పార్ట్ టైం చేస్తున్నప్పటికీ, డబ్బులు చాలాకపోవడం తో.. అతనికి అవసరమైన సాయాన్ని కూడా కవితా లక్ష్మే పంపాల్సి వస్తోంది.

ఆమె తన కొడుకుకి నెలకు ఒకటిన్నర లక్ష రూపాయలు పంపించాల్సి ఉంది. ఇందుకోసం ఆమె కేరళ, తమిళనాడు మధ్య నేషనల్ హై వే 66 పై రోడ్డు సైడ్ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాంటిది నడుపుతున్నారు. దోసలు, ఆమ్లెట్లు మరియు గొడ్డు మాంసం కూరలను ఆమె రోడ్డు పై వెళ్లే కస్టమర్లకు అందిస్తున్నారు. లక్ష్మి కుమారుడు ఆకాష్ కృష్ణ ఏడాది క్రితం యుకె లో ఓ కోర్సులో చేరాడు. అయితే, అది ఊహించినదానికంటే ఎక్కువ ఖర్చు ఉండడం తో.. ఆమె ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

“నెలకు 1.5 లక్షలు పంపించాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. వాయిదా పధ్ధతి లో పంపించడానికి బ్యాంకు ల వద్ద రుణాలు తీసుకుందామనుకున్నాను. కానీ, తాకట్టు పెట్టుకోవడానికి నా దగ్గర భూమి, ఇల్లు వంటి ఆస్తులు లేకపోవడం వలన బ్యాంకు వారు నాకు ఋణం ఇవ్వలేదు. ఓ ప్రైవేట్ సంస్థలో నాకు చిట్ ఫండ్ ఖాతా ఉన్నప్పటికీ.. దాని గడువు పూర్తి కానీ కారణం గా వారు నాకు సొమ్మును ఇవ్వడానికి అంగీకరించలేదు. ” అంటూ కవితా లక్ష్మి చెప్పుకొచ్చారు.

ఆమె చేతిలో ప్రస్తుతం రెండు సీరియల్స్ మాత్రమే ఉన్నాయి. వాటితో వచ్చే డబ్బులు వారి కుటుంబానికే సరిపోతాయి. కొడుకు కు కూడా పంపించాల్సిన అవసరం ఉండడం తో ఆమె పార్ట్ టైం గా రాత్రి పూట దోశలు వేస్తూ రోడ్డు పై అమ్ముతున్నారు. టీవీ, సినిమా ప్రపంచం లో జీవితాలన్నీ విలాసవంతం గా ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాము. కానీ, చాలా మంది జీవితాలు అందుకు విరుద్ధం గా ఉంటాయి.

“విలాసవంతమైన జీవితం కన్నా.. నాకు నా పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ప్రోత్సహించడమే ముఖ్యం” అంటూ కవితా లక్ష్మి నవ్వుతు చెప్తారు. నా పని నేను చేసుకోవడం లో తప్పేమి లేదు కదా అని నవ్వేస్తారు. తన కుటుంబం కోసం ఆమె ఇంతలా కష్టపడుతుండడం చూసి నెటిజన్లు సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
మరణించిన భార్య ని వీడలేక..17 సంవత్సరాలు గా శవం పక్కనే నిద్ర.. ఎముకలు పాడవకుండా ఆ భర్త ఏమి చేసాడంటే..?
ఆ భర్త కి భార్య అంటే వల్లమాలిన ప్రేమ. తనను కంటికి రెప్పలా చూసుకున్న అర్ధాంగి కళ్ళ ముందు లేకపోవడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. దీనితో, ఆమె శవం పక్కనే పెట్టుకుని పడుకుంటున్నాడు. ఇతని స్టోరీ చూపరులను కలచివేస్తోంది. వివరాల్లోకి వెళితే.. వియాత్నం కు చెందిన లీ అనే వ్యక్తి తన భార్య చనిపోయినా మర్చిపోలేక పోతున్నాడు.

అతను తన భార్యను మరచిపోలేక చాలా రోజుల పాటు స్మశానం వద్దకే వెళ్ళేవాడు. చాలా రోజుల పాటు స్మశానం వద్దకు వెళ్లి భార్య సమాధి పక్కనే పడుకునేవాడు. ఓ రోజు వర్షం కురవడం తో.. అతను అక్కడ ఉండలేకపోయాడు. దీనితో, ఆ భర్త ఆ సమాధి పక్కనే ఒక సొరంగాన్ని కూడా తవ్వేసి అందులో ఉండడం మొదలుపెట్టాడు. ఇలా చేసిన చాలా రోజులకు లీ పిల్లలకు ఈ విషయం తెలిసింది.

తమ తండ్రిని వారు ఆ స్థితి లో చూడలేకపోయారు. అతని తండ్రికి నచ్చ చెప్పి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చినా.. లీ మామూలు మనిషి కాలేకపోయాడు. తిరిగి స్మశానం వద్దకే వెళ్లి.. సమాధి తవ్వి అస్థికలను బయటకు తీసాడు. వాటిని తెచ్చుకుని ఇంట్లోనే బెడ్ రూమ్ లో పెట్టుకుని నిద్రించేవాడు.

అతని అవస్థ ని చూసిన పిల్లలు చలించిపోయారు. లీ భార్య అస్థికలు కుళ్లిపోయిన స్థితి లో ఉన్నాయి. దీనితో, లీ వాటికి జిగురు, ఇసుక, సిమెంటు, ప్లాస్టర్ ఆఫ్ పారీస్ వంటి పదార్ధాలతో కలిపి ఓ మహిళ బొమ్మను తయారు చేయించాడు. ఆ బొమ్మలోనే తన భార్య ను చూసుకుంటూ.. ఆమె బ్రతికే ఉందనుకుని బతికేస్తున్నాడు.
ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో టాప్ 10 లో ఉన్న టాలీవుడ్ హీరో లు వీరే.. ఎవరికి ఎంతంటే..?
టాలీవుడ్ హీరోలకి ఫ్యాన్ బేస్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ పై కూడా మన టాలీవుడ్ హీరో లను అభిమానించే వారి సంఖ్య ఎక్కువ గానే ఉంటుంది. అలానే, మన హీరో లు కూడా అంటీముట్టనట్టు ఏమి ఉండరు. నిత్యం వారి ఫోటోస్ తో పాటు ఫామిలీ ఫోటోలు, వెకేషన్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

కేవలం ఫోటోలు పంచుకోవడం మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు లైవ్ లు, చాట్ సెషన్స్ వంటివి పెడుతూ నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటూ ఉంటారు. ఒక్కోసారి క్రేజీ కౌంటర్లు ఇచ్చేస్తుంటారు. ప్రతి హీరో అభిమానులను ఎంతో గొప్ప గా ట్రీట్ చేస్తారు. సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ.. ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న టాప్ 10 టాలీవుడ్ హీరోల లిస్ట్ పై ఇక్కడ ఓ లుక్ వేయండి.
#10 అఖిల్ అక్కినేని:

అక్కినేని వారబ్బాయి అఖిల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండోయ్. క్యూట్ గా స్మార్ట్ బాయ్ లా కనిపించే అఖిల్ కి ఇన్స్టా లో 2.2m ఫాలోవర్స్ ఉన్నారు. ఈ లవర్ బాయ్ కి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
#9 ఎన్టీఆర్:

నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కి ఇన్స్టా లో 2.3m ఫాలోవర్స్ ఉన్నారు.
#8 వరుణ్ తేజ్:

టాలీవుడ్ మెగా హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కి కూడా గట్టి ఫాలోయింగే ఉంది. వరుణ్ తేజ్ ని ఇన్స్టా లో 2.4 మిలియన్ మెంబెర్స్ ఫాలో అవుతున్నారు.
#7 నాని:

నాచురల్ స్టార్ నాని కి ఇన్స్టా లో 3.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నాని కూడా అప్పుడప్పుడు తన కొడుకు క్యూట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తూనే ఉంటారు.
#6 రామ్ చరణ్:

మెగాస్టార్ చిరంజీవి వారసుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఫాలోవర్స్ ఎక్కువే. రామ్ చరణ్ ను 3.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
#5 రానా:

దగ్గుబాటి వారసుడు, భల్లాలదేవుడు రానా కు ఇన్స్టా లో 4.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎంత స్టార్ డమ్ వచ్చినా రానా డౌన్ టు ఎర్త్ పర్సన్ లానే కనిపిస్తారు.
#4 ప్రభాస్:

మన డార్లింగ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఇన్స్టా లో 6.3 మిలియన్ ఫాలోవర్స్ ఉండడం విశేషం. ప్రభాస్ సోషల్ మీడియా లో పెద్దగా ఆక్టివ్ గా ఉండరు. అయినప్పటికీ ఈ రేంజ్ లో ఫాలోవర్స్ అంటే ప్రభాస్ ఎంత ఫాలోయింగ్ ఉందొ తెలుస్తూనే ఉంటుంది.
#3 మహేష్ బాబు:

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా లో బాగా ఆక్టివ్ గా ఉంటారు. తమ వెకేషన్ ఫొటోస్ తో పాటు, సితార, గౌతమ్ ల ఫోటోలు కూడా పంచుకుంటూ ఉంటారు. ఇన్స్టా లో మహేష్ బాబు కు 6.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇది ఫేస్ బుక్ ఫాలోవర్స్ తో పోలిస్తే కొంత తక్కువే.
#2 అల్లు అర్జున్:

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా చాలానే ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ కి తెలుగు నాటే కాదు కేరళ వైపు కూడా చాలా మంది అభిమానులే ఉన్నారు.. ఇన్స్టా లో అల్లు అర్జున్ 10.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
#1 విజయ్ దేవరకొండ:

రౌడీ హీరో విజయ్ దేవర కొండా కు యూత్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. తక్కువ టైం లో విజయ్ దేవరకొండ ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో అందరి కంటే ఎక్కువ అభిమానులు కలిగిన హీరో గా విజయ్ నిలిచారు. విజయ్ దేవరకొండ కి ఇన్స్టాగ్రామ్ లో 11 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
https://filmyfocus.com/telugu/top-10-most-followed-tollywood-heroes-on-instagram/
అమ్మ బాబోయ్..! ఇన్స్టాగ్రామ్ లో నాగబాబు గారి టైమింగ్ మాములుగా లేదుగా..? ఈ 30 క్రేజీ రిప్లై లపై ఓ లుక్ వేయండి..!
చాలా మందికి సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించిన క్యూరియాసిటీ ఉంటుంది. ఆన్ స్క్రీన్ పై కాకుండా.. ఆఫ్ స్క్రీన్ పై వారు ఎలా ఉంటారు..? ఆఫ్ స్క్రీన్ లో వారు ఎలా మాట్లాడతారు..? ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఈ క్రమం లో సెలెబ్రిటీలు కూడా తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలని అనుకుంటారు. చాలా మంది సెలెబ్రిటీలు అభిమానులను కలిసినప్పుడు.. అభిమానులతో మాట్లాడుతున్న టైం మంచి రిలేషన్ మైంటైన్ చేస్తారు.

అదే టైం లో.. అభిమానులు మితి మీరు ప్రవర్తించిన సందర్భాలలో కూడా ఇచ్చి పడేస్తుంటారు. అయితే, స్మార్ట్ వే లో మాట్లాడుతూ అభిమానుల్ని మరింత ఆకట్టుకుంటారు. సోషల్ మీడియా వచ్చిన తరువాత ఇలా సెలెబ్రిటీలు అభిమానులతో ముచ్చటించడం మరింత ఎక్కువైంది. అప్పుడప్పుడు లైవ్ లోకి రావడం, లైవ్ లో అభిమానులతో ముచ్చటించడం, చాట్ సెషన్స్ ను పెడుతుండడం వంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం..

లేటెస్ట్ గా, నాగబాబు గారు ఇన్స్టాగ్రామ్ లో చాట్ సెషన్ ను పెట్టారు. “ఆస్క్ మీ ఏ కొశ్చన్” పేరిట నాగబాబు అభిమానులతో ముచ్చటించారు. సెషన్ లో అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకి నాగబాబు క్రేజీ కౌంటర్లు ఇచ్చారు. ఈ ఆన్సర్లు చూస్తే.. నాగబాబు గారిని పక్కా యంగ్ బాయ్ అనుకుంటారు. అంత స్మార్ట్ గా ఒక్కొక్కరికి ఇచ్చి పడేసారు. ఇప్పుడు ఈ ఆన్సర్లు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ ఫన్ పంచుతున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి మరి.
1.

2.
3.
4.

5.
6.
7.
8. 
9. 
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
27.
28.
29.
30.
మార్కెట్ లో దొరికే పండ్లపై ఉండే స్టిక్కర్స్ గమనించారా.? 8, 9 అనే నంబర్లకి అర్థం ఏంటో తెలుసా.?
మనం రోడ్డు పై వెళ్తున్నపుడు రోడ్ సైడ్ గాని, పండ్ల మార్కెట్ లలో గాని బాక్సుల్లో పండ్లని పెట్టి అమ్ముతుంటారు కదా.. అయితే, ఈ పండ్లపై స్టిక్కర్లు అతికించి ఉంటాయి. అసలు ఈ స్టిక్కర్లు ఎందుకు అతికిస్తారు. ఈ స్టిక్కర్లను అతికించడం లోని ఉద్దేశ్యం ఏమిటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సామాన్యం గా పండ్లపై ఇలాంటి స్టిక్కర్లు ఉంటె.. వాటిని మనం చూడగానే అవి సహజం గానే పండించారా? లేక రసాయనాలను ఉపయోగించి పండించారా? అన్న విషయాన్నీ మనం చూడగానే చెప్పేయొచ్చు. ఈరోజుల్లో పండ్లన్నీ రసాయనాలతోనే పండిస్తున్నారు. ఆర్గానిక్ గా దొరికేది చాలా తక్కువ. ఒకవేళ దొరికినా వీటిని చాలా కాస్ట్ లీ రేటుకి అమ్ముతున్నారు. అంత చేసిన.. అవి ఆర్గానిక్ ఏ నా కాదా? అన్న సంగతి మనం చెప్పలేము.

అదే ఇలాంటి స్టిక్కర్లు ఉన్న పండ్లు అయితే.. మనం ఈజీ గా గుర్తించవచ్చు. అదెలానో చూడండి. పండు పై ఉన్న స్టిక్కర్ పై మూడు లేదా నాలుగు అంకె ఉంటె..ఆ పండ్లని కృత్రిమ రసాయనాలు, సహజ ఎరువులు వాడి పండించారని అర్ధం. అదే 9 నెంబర్ ఉంటె దానిని సేంద్రియ ఎరువులు ఉపయోగించి సహజసిద్ధం గా పండించారని అర్ధం. అలా కాకుండా, 8 అంకెతో ఉంటె మాత్రం వాటిని జన్యు మార్పిడి పధ్ధతి ద్వారా పండించారని అర్ధం. ఇవి తింటే చాలా ప్రమాదకరం. అందుకే పండ్లను తీసుకునే ముందు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఈ సమాచారం మీరు తెలుసుకుని.. మీ స్నేహితులతో కూడా పంచుకోండి.
విమానం లో వెళ్తున్నపుడు అనుకోకుండా కిటికీ అద్దాలు పగిలిపోతాయా..?మీకెప్పుడైనా ఇలాంటి డౌట్ వచ్చిందా..?
మనకి కొన్ని కొన్ని సార్లు వింత వింత డౌట్ లు వస్తూ ఉంటాయి కదా.. ఉన్నట్లుండి మనం ఉన్న రూమ్ లో ఫ్యాన్ ఊడి కింద పడితే ఏమవుతుంది..? అని సడన్ గా ఆలోచిస్తూ ఉంటాం. ఇది కూడా అలాంటి డౌటే. మనం విమానం లో వెళ్తున్నపుడు అనుకోకుండా కిటికీ అద్దాలు పగిలిపోతాయా..? అని మీకెప్పుడైనా అనిపించిందా..? సహజం గా ఇలాంటి ప్రశ్నలు చిన్నపిల్లలకే ఎక్కువ వస్తుంటాయి.. ఎక్కువ గా ఆలోచించగలిగే సామర్ధ్యం ఉన్న వారికి కూడా ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయట.

విమానం లో మనకి కలిగే అనేక సందేహాలకు సమాధానం గా రాకేష్ ధన్నారపు అనే హైదరాబాద్ యువకుడు ‘101 ఫ్లైయింగ్ సీక్రెట్స్’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం లో ఆయన పలు ప్రశ్నలకు పూర్తి వివరణ తో సమాధానం ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న రాకేష్ ఈ ప్రశ్నకి విశ్లేషణాత్మకం గా సమాధానం ఇచ్చారు. సాధారణం గా విమానపు కిటికీలు గ్లాస్ లాగ కనిపిస్తాయి కదా. అవి విమానం అంత పైకి ఎగురుతున్నపుడు పగిలిపోతాయేమో అన్న సందేహాలు రావడం సహజం.

అయితే, విమానం లోపలి ఎక్కేటప్పుడు ఎవరిని లోహపు వస్తువులు, కత్తులు, నెయిల్కట్టర్లు వంటివాటిని లోపలకి తీసుకు రావడానికి అనుమతించరు. ఎంత బలం గా ఉన్న వ్యక్తి అయినా సరే.. ఉద్దేశపూర్వకం గా గ్లాస్ డోర్ లపై బద్దలు కొట్టినా అవి పగలవు. విమానం లో ఏర్పాటు చేసే కిటికీలను పాలీ కార్బొనేట్తో తయారు చేస్తారు. ఈ కిటికీలు ఎంత ఒత్తిడి ని అయినా తట్టుకోగలవు. విమానాలు భూమి కి పైన, ఎత్తున ఎగురుతూ ఉంటాయి. ఈ క్రమం లో బలమైన గాలి వలన చాలా ఒత్తిడి ఉంటుంది. పాలీ కార్బొనేట్తో చేయబడ్డ ఈ కిటికీలు ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడగలవు. అందుకే విమానం లో ఏర్పాటు చేసే కిటికీలు పగలడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. కాబట్టి భయపడాల్సిన పని లేదు.
Note: images used in this article are only for representative purpose. But not the actual characters
కూతురు కి కొత్త బట్టలు కొని.. భార్యతో గుడికెళదామనుకున్నాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మిగిలాడు..కంటతడి పెట్టిస్తున్న ఘటన..!
కూతురుకి కొత్త బట్టలు కొని , తెల్లారి భార్య దగ్గరకెళ్ళి కుటుంబం తో కలిసి గుడికి వెల్దామనుకున్నాడు. కానీ అతని కోరిక తీరని కలే అయింది. భార్య దగ్గరకి వెళ్లేలోపే అతను ఈ లోకాన్ని వీడాల్సిన పరిస్థితి దాపురించింది. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన స్థానికులని కలచివేస్తోంది. మృతుడి బాగ్ లోని ఆధార్ కార్డు వివరాల ద్వారా సదరు వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వివరాల్లోకెళితే, నెల్లూరు జిల్లా కలువాయి మండలం పుల్లూరు గ్రామ వాసి నరసింహులు (32) బీ టెక్ చదివి శ్రీసిటీలోని ఓ పైపుల కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నారు. నరసింహులు నాలుగేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. అతనికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. భార్య పిల్లలతో కలిసి నరసింహులు సూళ్లూరు పేట సాయి నగర్ లోనే నివాసం ఉంటున్నారు. అయితే, కొన్ని రోజుల క్రితం భార్య, కూతురుని పుట్టింటికి పంపించాడు. ఉద్యోగం కారణం గా తాను సూళ్లూరు పేటలోని ఉండిపోయాడు.

అయితే, వారాంతం లో భార్య ను చూడడానికి రెండు రోజులు ఆఫీసులో సెలవు పెట్టి ఇంటికి వెళదామనుకున్నాడు. ముందు రోజు రాత్రి భార్యతో కూడా ఫోన్ లో మాట్లాడాడు. పాప కు కొత్త బట్టలు తీసుకున్నానని , పొద్దున్నే ముగ్గురం గుడికి వెళదామని చెప్పాడు.. తెల్లారేసరికి ఊరికి చేరుకుంటానని తెలిపాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతం లో హోలీక్రాస్ సెంటర్ వద్ద ఊరికి వెళ్ళడానికి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

అదే సమయం లో అటు వైపు వేగం గా ఓ వాహనం దూసుకొచ్చి బస్సు స్టాప్ లో నిలుచుని ఉన్న నరసింహులు, అతనితో పాటు మరో వ్యక్తి వైపుకి దూసుకొచ్చింది. వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారు. స్థానికులు ఈ ఘటన తో హతాశులయ్యారు. నరసింహులు బాగ్ లో చిన్న పాప వి కొత్త బట్టలు చూసి కలత చెందుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
