Anudeep
Anudeep
Maintaining Teluguadda website since 2017 and have 7 years of experience in managing various million fan based Facebook pages.
అందం గా ఉన్న అమ్మాయిలని ఎవరిని చూసినా హీరోయిన్లా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే, ఏ సినిమాలో చూసినా హీరోయిన్లు అందం గానే ఉంటారు. మేకప్ వల్లే వారికి అంత అందం వస్తుందో ఏమో తెలీదు కానీ, ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు మేకప్ వేసుకునే కనబడుతున్నారు. అయితే, మరి హీరోయిన్లు.. మేకప్ లేకుండా ఎలా ఉంటారో ఎప్పుడైనా చూసారా…?

ఇక్కడ అందం ఒక్కటే పాయింట్ కాదు. వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉంటె తప్ప ఇండస్ట్రీ లో నిలుదొక్కుకోలేరు. అయితే, వాళ్ళ టాలెంట్ కి అందం కూడా తోడైంది అంతే. మన హీరోయిన్లు మేకప్ ఉన్నా లేకున్నా మనకి నచ్చుతారు అనుకోండి. అయితే మేకప్ లేకుండా ఉంటె మన టాలీవుడ్ హీరోయిన్లు ఎలా ఉంటారో ఓ సారి చూద్దాం..
ఈ లిస్ట్ ను చూడండి. మేకప్ లేకుండా ఉంటె మన ఫేవరెట్ హీరోయిన్లు ఎలా ఉంటారో చూద్దాం.
1. అనుష్క:

2. కాజల్:

3. శృతిహాసన్:

4. తమన్నా:

5. హన్సిక:

6. పూజ హెగ్డే:

7. రకుల్:

8. రాశిఖన్నా:

9. నభా నటేష్:

10. సమంత:

11. అనుపమ పరమేశ్వరన్:

12. లావణ్య త్రిపాఠి:

13. మెహరీన్:

14. నివేద:

15. కీర్తి సురేష్:

16. త్రిష:

17. నయనతార:

18. కృతి శెట్టి:

19. ప్రియా ప్రకాష్:

20. కియారా అద్వానీ:

21. సాయి పల్లవి:

22. రష్మిక:

టీ, కాఫీ తాగాక మంచినీళ్లు తాగితే పళ్ళు ఊడిపోతాయా..? దీనిపై నిపుణులు ఏమి చెబుతున్నారు..?
ఉదయాన్నే లేవగానే మనకి టీ/కాఫీ తాగకపోతే తెల్లారదు. ఏ పని చేయాలనిపించదు. అలసట గా ఉన్నపుడు.. నీరసం గా ఉన్నపుడు కూడా ఒక కప్ టీ లేదా కాఫీ తాగితే.. మనకి చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అయితే, చాల మంది కాఫీ లేదా టీ తాగేముందు మంచినీటిని తాగుతారు. కానీ టీ లేదా కాఫీ తాగిన తరువాత ఏమి తాగరు. మరికొందరైతే అసలు టీ, కాఫీ తాగాక మంచినీళ్లు తాగకూడదని చెబుతుంటారు. అసలు ముందు తాగాలా…? తరువాత తాగాలా..? తర్వాత ఎందుకు తాగొద్దని చెబుతున్నారో.. మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది టీ లేదా కాఫీ తాగాక నీళ్లు తాగితే పళ్ళు ఊడిపోతాయని చెబుతుంటారు. నిజానికి మనం టీ, కాఫీ వేడి వేడి గా తాగుతాం. ఆ తరువాత వెంటనే చల్లగా ఉండే నీళ్లు తాగడం వలన దంతాలు కదిలి..ఊడిపోతాయని చెబుతుంటారు. అయితే.. నిపుణులు మాత్రం దీనిపై మీకు ఎలాంటి అపోహలు అవసరం లేదంటున్నారు. టీ లేదా కొద్దీ సేపటికి మీరు నీరు తాగచ్చు.. లేదా నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించవచ్చు. ఇలా చేయడం వలన మీ పళ్ళు గారపట్టవు. టీ, కాఫీ లలో కెఫీన్ అనే పదార్ధం ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఇది మీ పళ్లకు గార పట్టిస్తుంది. ఈ కెఫీన్ అనే పదార్ధం అల్జీమర్స్, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.ఈ పదార్ధం వల్లనే, మనం టీ, లేదా కాఫీ తాగగానే ఉత్తేజం పొందుతాము. కానీ, ఎక్కువ మొత్తం లో టీ / కాఫీ లు తీసుకోవడం వలన, మన శరీరం లో కెఫీన్ ఎక్కువై కాలేయ సంబంధిత సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే టీ, కాఫీలను పరిమితం గా తీసుకోవాలి. అలాగే, వేడి వేడి గా టీ, కాఫీ లు తాగడం వలన ఏరో డైజస్టివ్ సిస్టమ్ పై ఉండే పొర దెబ్బతింటుంది. అందుకే ముందుగా కొంత మంచినీటిని తాగడం వలన ఈ పొర వేడిని తట్టుకోగలుగుతుంది.

అలాగే, టీ / కాఫీలు అసిడిటీ ని కలిగిస్తాయి. కాలేయ సంబంధిత వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మీరు కాఫీ లేదా టీ తాగేముందు మంచినీటిని తాగితే.. ఈ ఇబందులను అరికట్టవచ్చు. టీ లో కెఫీన్ తో పాటు ధియామిన్ అనే రసాయనం కూడా ఉంటుంది. అందుకే, టీ / కాఫీ లను ఎక్కువ మొత్తం లో తాగడం వలన ఇబ్బందులను ఎదుర్కోవాలి. అదే ముందు కొంత మంచినీటిని తాగడం వలన ఈ ఇబ్బందులని ఎదుర్కోవచ్చు.
ఆ భార్యాభర్తలు సెల్ఫీ దిగి…ఆ ఫోటోను ఏం చేసారో తెలుసా.? తర్వాత ఏమైందో చూస్తే షాక్ అవుతారు.!
జనరల్ గా వెయ్యి పదాలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో వ్యక్తపరచగలదని అంటుంటారు. అందుకే ఫోటో లపై మనకి ఉన్న మోజు అంత తొందరగా పోదు. గత కొంత కాలం గా సెల్ఫీ లు కూడా మన జీవితం లో భాగం అయిపోయాయి. ఒకళ్ళు ఫోటో తీసే అవసరం లేకుండా.. మనకి నచ్చిన మధురమైన క్షణాలను గుర్తుంచుకునేలా మనకి మనమే ఒక చిన్న సెల్ఫీ తీసేసుకుంటున్నాం. అయితే, ఆ సెల్ఫీ ఓ జంటకి అదృష్టం తీసుకొచ్చింది. వారికి లండన్ టూర్ కి వెళ్లే అవకాశాన్ని కల్పించింది. ఇంతకీ అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.

బ్రిటీష్ ఎయిర్వేస్ వారు ఒక సెల్ఫీ కాంటెస్ట్ ను పెట్టారు. ఈ కాంటెస్ట్ కి ఆసక్తి ఉన్న వారు తమ పార్టనర్ తో కలిసి ఒక కపుల్ సెల్ఫీ పంపిస్తే.. అందులో ఎవరి సెల్ఫీ ఎంపిక అయితే వారికి లండన్ ట్రిప్ కు ఆహ్వానం పంపిస్తారనేది కాంటెస్ట్ సారాంశం. ఈ కాంటెస్ట్ కు చెన్నై కి చెందిన పింకీ మనోగరన్ మరియు హరీష్ రామన్ ల జంట కూడా తమ సెల్ఫీ ని పంపింది. అయితే, వీరికి అదృష్టం కలిసొచ్చింది.
వీరి సెల్ఫీ ఎంపికై లండన్ కి వెళ్లే అవకాశం లభించింది. ఈ జంట కు రెండు వరల్డ్ ట్రావెలర్ ప్లస్, ప్రీమియం ఎకానమీ రిటర్న్ టిక్కెట్లను చెన్నై నుండి లండన్‌కు వెళ్ళడానికి గిఫ్ట్ గా పంపారు. ఇక వీరిద్దరూ విజేతలుగా నిలవడం తో వీరి ఆనందానికి అంతు లేదు. వీరితో పాటు మరికొందరు కూడా విజేతలు గా నిలిచారు.

విజేతల్లో ఒకరైన పింకీ మనోగరన్ తనకు లండన్ అంటే ఎంతో ఇష్టమైన ప్రదేశమని పేర్కొన్నారు. ఆ నగరాన్ని చూడడం తన కల అని.. ఇలా తనకి అవకాశం వస్తుందని ఊహించలేదని పేర్కొంది. లండన్ ట్రిప్ లో ఎన్నో మధుర క్షణాలను సొంతం చేసుకుంటామని తెలిపింది. అదండీ సంగతి.. అదృష్టం ఎప్పుడు ఎలా తడుపు తడుతుందో తెలియదు. అలాంటి అదృష్టాలు మనక్కూడా వస్తే బాగుంటుంది కదా..
పెళ్లి అయిన తరువాత తన జీవితం ఎలా మారిపోయిందో.. ఓ అమ్మాయి మాకు పంపిన మెసేజ్..!
భారతీయ వివాహ వ్యవస్థ ఎంత ఔన్నత్యమైనదో.. మహిళల పట్ల భారత సమాజం లో ఉన్న భావాలు అంత సంకుచితమైనవి. అందుకే మహిళలు పెళ్లి తరువాత ఉద్యోగం చేయడానికి కొందరు మనస్పూర్తి గా ఒప్పుకోలేరు. ఇలా పెళ్లి తరువాత ఉద్యోగం చేయాలనుకుని.. చేయలేక సతమతమవుతున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో విద్య కూడా ఒకరు. పెళ్లి అయ్యాక తన జీవితం ఎలా మారిపోయిందో విద్య మాకు పంపిన మెసేజ్ ను మీకు అందిస్తున్నాం.
“నా పేరు విద్య. నేను ఎంబీఏ పూర్తి చేసాను. నాకు కెరీర్ పై చాలా ప్లాన్స్ ఉండేవి. ఏదైనా మంచి పొజిషన్ లో ఉండాలి అని కలగనేదాన్ని. సొంతం గా ఓ ఫిట్ నెస్ సెంటర్ ను పెట్టి రన్ చేయాలనేది నా కోరిక. సొంతం గా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అనుకునే మనస్తత్వం నాది. కానీ.. పెళ్లి అయ్యాక ఒక్కసారి గా పరిస్థితులన్నీ మారిపోయాయి. పెళ్ళికి ముందు నేను ఏమి చేస్తాను అన్నా నా తల్లి తండ్రులు ముందు పెళ్లి చేసుకో.. ఆ తరువాత నీకు నచ్చినట్లు ఉండు అని చెప్పేవారు. కానీ, పెళ్లి అయ్యాక నా జీవితం నా చేతుల్లో లేదు అనిపించింది.

నా అత్తగారు, మామ గారు, భర్త.. ఇలా నేను ఏమి చేయాలన్న వీరందరి పర్మిషన్ తీసుకోవాలి. నా అత్తా మామ లు ముందు పిల్లలను కనండి.. ఆ తరువాత ఏమైనా ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. నా ఆశలు నెరవేర్చుకోవడానికి ఇంకా టైం ఉందని అర్ధం అయింది. కొంత కాలం పాటు వీరికి అనువు గా ఉండాలని అర్ధం అయింది. నా భర్త తో ప్రేమకు చిహ్నం గా మాకో పండంటి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తరువాత రోజు మొత్తం వాడితోనే సరిపోయేది. బాబు ఆలనా పాలన చూసుకోవడం, ఇంట్లో పనులు చక్కపెట్టుకోవడం వంటి పనులే సరిపోయేవి.

నాకంటూ సొంత కలలను నెరవేర్చుకోవడానికి సమయం ఉండేది కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకునే దాన్ని. కానీ, ఇప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా నేను నా భర్తనే అడగాల్సి వస్తోంది. నాకు ఏదైనా నచ్చినవి కొనుక్కోవాలి అన్నా నేను నా భర్తనే అడగాలి. నేనేమి ఖాళి గా లేను. రోజంతా నా కుటుంబం పనులను చేయడానికే సమయం సరిపోతుంది. కానీ, నాకేమి జీతం ఇవ్వరు. ఒక్కరోజు కూడా నాకు ఎలాంటి హాలిడే ఉండదు. అవిశ్రాంతం గా, నిర్విరామం గా పనిచేయాల్సి వస్తుంది. నాలాగా ఇంకెంతమంది ఉన్నారో..
నాటితరం నుండి నేటితరం వరకు…ఈ 22 మంది టాలీవుడ్ హీరోల “EDUCATIONAL QUALIFICATIONS” ఏంటో తెలుసా.?
మనలో ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ యాక్టర్ ఉంటారు. ఆ యాక్టర్ నటించిన ఏ మూవీ ని అయినా వదలకుండా చూస్తాం. ఆ యాక్టర్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ను అయినా వదలకుండా చదువుతాం. మనకి వారి గురించి తెలుసుకోవాలి అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇపుడు, మనం మన ఫేవరెట్ యాక్టర్లు ఏమి చదువుకున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

#1 అక్కినేని నాగ చైతన్య:
నాగార్జున నట వారసుడు నాగ చైతన్య బీకామ్ వరకు చదువుకున్నారు.

#2 సాయి ధరమ్ తేజ్:
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బయోటెక్నాలజీ లో డిగ్రీ పూర్తి చేసారు. ఆ తరువాత ఎంబీఏ ను కూడా పూర్తి చేసారు.

#3విశ్వక్ సేన్ :
ఈ నగరానికి ఏమైంది అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయినా విశ్వక్ సేన్ కూడా బ్యాచిలర్ ఇన్ మాస్ కమ్యునికేషన్ అండ్ జర్నలిజం కోర్స్ ను పూర్తి చేసాడు.

#4 విజయ్ దేవర కొండ:
మన రౌడీ అన్న హైదరాబాద్ అబ్బాయే. విజయ్ కాచిగూడ బద్రుకా కాలేజ్ లో బికాం ను పూర్తి చేసాడు.

#5 రవితేజ:
మాస్ హీరో రవి తేజ బెజవాడ సిద్దార్ద డిగ్రీకాలేజ్ లో బి.ఏ ను పూర్తి చేసారు.

#6 డా.రాజశేఖర్
రాజశేఖర్ డాక్టర్ అయ్యాకే యాక్టర్ అయ్యారు. రాజశేఖర్ సినిమాల్లోకి రాకముందే వెటర్నరీ డాక్టరేట్ కోర్స్ ను పూర్తి చేశారు.

#7 అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ ఎమ్మెస్సార్ కాలేజ్ నుంచి బిబిఎ డిగ్రీని పొందారు.

#8 నాని:
నాచురల్ స్టార్ నాని కూడా డిగ్రీ పూర్తి చేసారు. ఆయన సికింద్రాబాద్ లోని వెస్లీ కాలేజీ లో డిగ్రీని పూర్తి చేసారు.

#9 రామ్ చరణ్:
మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ముందునుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. రామ్ చరణ్ తన బీకామ్ డిగ్రీ ని మధ్యలోనే ఆపేసాడు.

#10 జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ ది కూడా ఫిలిం బ్యాక్ గ్రౌండ్ కావడం తో చిన్నప్పటినుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజీ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసాడు. చిన్న వయసులోనే ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చేసాడు.

#11 ప్రభాస్:
ప్రభాస్ భీమవరం డిఎన్నార్ స్కూల్ లో స్కూలింగ్ ను పూర్తి చేసాడు. ఆ తరువాత హైదరాబాద్ కు వచ్చి బి టెక్ ను కంప్లీట్ చేసాడు.

#12 రానా:
రానా కూడా ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫిలో బ్యాచిలర్ డిగ్రి ని కంప్లీట్ చేసాడు. చెన్నై ఫిలిం స్కూల్ నుంచి డిగ్రీ పట్టాను పొందాడు.

#13 నాగార్జున:
కింగ్ నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఎమ్ ఎస్ పట్టాను పొందారు. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చేముందు యాక్టింగ్ లో శిక్షణా తీసుకున్నారు.

#14 నందమూరి బాలకృష్ణ
బాలయ్య బాబు నిజాం కాలేజీ లో బి కామ్ డిగ్రీ ని పూర్తి చేసారు.

#15 విక్టరీ వెంకటేష్:
వెంకీ మామ అమెరికా లో ఎంబీఏ పూర్తి చేసారు. ఆ తరువాత ఇండియా కు వచ్చి కలియుగ పాండవులు సినిమా తో యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టారు.

#16 మహేష్ బాబు:
ప్రిన్స్ మహేష్ బాబు మద్రాస్ లోని లయోలా కాలేజ్ నుంచి బీకామ్ పట్టాను పొందారు.

#17 పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్ వరకు చదివారు.

#18 చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో నర్సాపూరంలోని వైఎన్ కాలేజ్ లో బీకామ్ ను కంప్లీట్ చేసారు.

#19 కృష్ణ ఘట్టమనేని:
సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు సి ఆర్ రెడ్డి కాలేజీ లో బిఎస్సి చదివారు. ఇంజనీరింగ్ చదవాలని ప్రయత్నించారు. అయితే, అవకాశం లేకపోవడం తో సినిమాల వైపుకు వచ్చేసారు.

#20 శోభన్ బాబు:
శోభన్ బాబు బిఎ పూర్తి చేశారు. ఆ తరువాత లా కూడా చదవాలని అనుకున్నారు. కానీ కుదరకపోవడం తో సినిమాల వైపు వచ్చారు.

#21 ఎన్టీఆర్:
నందమూరి తారక రామారావు గుంటూరు ఎసి కాలేజ్ లో బి ఏ చదువు పూర్తి చేసారు. ఆ తరువాత మద్రాసు సర్వీసు కమిషను పరీక్షా రాసారు. 1100 మంది ఈ పరీక్షా రాయగా, వారిలో ఏడుగురు మాత్రమే ఎంపిక అయ్యారు. ఎంపికైన వారిలో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. అయితే, నటన పై ఆసక్తి తోనే వచ్చిన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని కూడా ఎన్టీఆర్ వదులుకున్నారు.

#22 అక్కినేని నాగేశ్వర్రావు:
అక్కినేని నాగేశ్వర్రావు కేవలం మూడవ తరగతి వరకే చదువుకున్నారు. చిన్నప్పటినుంచే ఆయనకు నాటకాలన్న, సినిమాలన్నా మక్కువ ఉండేది. చిన్నతనం నుంచి నాటకాలు వేస్తూ సినిమాలవైపు కు వచ్చారు. దీనితో ఆయన చదువు వైపు వెళ్ళలేదు.

తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ 10 సినిమాలు రీమేక్ లే…ఏ సినిమా నుంచి రీమేక్ చేసారో చూడండి..!
సినిమా ప్రేక్షకులకు చాలా సార్లు భాషతో సంబంధం ఉండదు. సినిమా ను అర్ధం చేసుకోవాలంటే భాష కావాలి.. ప్రేమించడానికి అక్కర్లేదు. అందుకే.. ఇతర భాషల్లో సినిమాలను కూడా లోకల్ భాషల్లోకి డబ్ చేస్తుంటారు. సినిమా బాగా హిట్ అయితే.. రీమేక్ చేస్తుంటారు. అలా తెలుగు లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ నుంచి తెలుగు లోకి రీమేక్ అయిన టాప్ 10 సినిమా లిస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1 గబ్బర్ సింగ్- దబాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి మంచి మాస్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు చాలా హెల్ప్ అయింది. ఈ సినిమా బాలీవుడ్ దబాంగ్ కి రీమేక్.
#2 గోపాల గోపాల – ఓ మై గాడ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ లు నటించిన మల్టీ స్టారర్ సినిమా “గోపాల గోపాల” . లార్డ్ కృష్ణ కాన్సెప్ట్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సినిమా ని తీశారు. దేవుడి కి నాస్తికుడి కి మధ్య జరిగే వివాదాన్ని, దేవుడి పేరు చెప్పుకుని దోపిడీ చేసే బాబాలపై ఓ నాస్తికుడు చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. ఈ సినిమా బాలీవుడ్ లోని ఓ మై గాడ్ సినిమా కి రీమేక్. ఇందులో లార్డ్ కృష్ణ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించారు.
#3 బిల్లా – డాన్

ప్రభాస్, అనుష్క హీరో హీరోయిన్లు గా నటించిన బిల్లా సినిమా కూడా బాలీవుడ్ “డాన్” కి రీమేక్. ఈ సినిమా డాన్ అంత విజయం సాధించకపోయినా మంచి టాక్ నే తెచ్చుకుంది. ఒరిజినల్ డాన్ సినిమాని తెలుగు నేటివిటీ కి తగ్గట్లు మోడిఫై చేయడం తో కొంత ఒరిజినాలిటీ దెబ్బతింది.
#4 దృశ్యం – దృశ్యం

మీనా, విక్టరీ వెంకటేష్ జంట గా నటించిన దృశ్యం సినిమా తెలుగునాట, తమిళనాట కూడా బాగా ఆకట్టుకుంది. కానీ, ఇది మలయాళం దృశ్యం సినిమా కి రీమేక్.
#5 చంద్రముఖి – మణిచిత్రతజ్హు

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమా చంద్రముఖి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు.ఈ సినిమా మలయాళం లోని మణిచిత్రతజ్హు సినిమాకి రీమేక్. తమిళనాట కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
#6 ఈనాడు- ఏ వెడ్నెస్ డే

విక్టరీ వెంకటేష్, కమల హాసన్ నటించిన మల్టీ స్టారర్ సినిమా ఈనాడు. ఇది కూడా బాలీవుడ్ లోని ఏ వెడ్నెస్ డే కి రీమేక్. ఈ సినిమా బాలీవుడ్, టాలీవుడ్ రెండింటిలోనూ సూపర్ హిట్ అయింది. కోపం వస్తే.. ఒక కామన్ మాన్ ప్రభుత్వాన్ని ఎలా కదిలించగలడన్న కధనం తో ఈ సినిమా ను రూపొందించారు.
#7 బాడీ గార్డ్- బాడీ గార్డ్

రొమాంటిక్ కామెడీ జోనర్ లో ఈ సినిమా ను రూపొందించారు. అదే పేరు తో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఈ సినిమా ను రీమేక్ చేసారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించగా, టాలీవుడ్ లో ఆ పాత్రను విక్టరీ వెంకటేష్ పోషించారు. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్, త్రిష జంటగా నటించారు. బాలీవుడ్ లో సల్మాన్, కరీనా జంటగా నటించారు.
#8 ప్రేమమ్ – ప్రేమమ్

మలయాళం లో సూపర్ హిట్ అయినా ప్రేమమ్ సినిమాను అదే పేరు తో తెలుగు లో కూడా రీ మేక్ చేసారు. ఈ రీ మేక్ లో శృతి హాసన్, నాగ చైతన్య జంటగా నటించి అలరించారు. ప్రేమమ్ లో ఉన్న అనుపమ పరమేశ్వరన్,మడోన్నా లు తెలుగు రీమేక్ లో ఉన్నారు. సాయి పల్లవి పాత్రను మాత్రం శృతి హాసన్ పోషించారు.
#9 శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ – మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్

మెగాస్టార్ చిరంజీవి హీరో గా వచ్చిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సూపర్ హిట్ అయింది. వాస్తవానికి ఇది బాలీవుడ్ సినిమా మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్ కి రీమేక్. కామెడీ ఎమోషనల్ ఫామిలీ డ్రామా గా ఈ సినిమా ను తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రీకాంత్, చిరంజీవి కలిసి నటించారు.
#10 అనామిక – కహాని

బాలీవుడ్ సినిమా కహాని ని తెలుగు లో అనామిక గా దర్శకుడు శేఖర్ కమ్ముల రీమేక్ చేసారు. ఈ సినిమాలో కథానాయిక గా నయనతార లీడ్ రోల్ పోషించారు. అయితే, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ తెలిసిన సినిమా కావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా కలెక్షన్లు సాధించలేదు.
మనల్ని చిన్నప్పుడు బాగా నవ్వించిన ఈ 10 కమెడియన్స్…ఇటీవల కాలంలో మనకి దూరమై కంటతడి పెట్టించారు.!
సినిమా హిట్ అవ్వాలి అంటే.. అందులో కామెడీ పండాలి. ఆహ్లాదకరం గా నవ్వించే కామెడీ ని పండించాలి అంటే.. కమెడియన్ అనే రైతు సినిమా అనే పంటపొలం లో కష్టపడాల్సిందే. అలా.. సినీ ఇండస్ట్రీ లో కష్టపడి మనలని నవ్వించి.. చివరికి మనకి దూరం అయిపోయిన కమెడియన్లను ఓ సారి తలచుకుందాం.

#1 ఎమ్మెస్ నారాయణ:

ఎమ్మెస్ నారాయణ కామెడీ రంగం లో బహుముఖ ప్రజ్ఞా శాలి. దొంగ, ప్రిన్సిపాల్, ఇంటి యజమాని, టీ షాప్ యజమాని, బాస్, డాక్టర్ వంటి పాత్రల్లో ఆయన ఇమిడిపోయి నటించారు. “బన్నీ,” “చిరుత,” “ఇంద్ర ”మొదలైన తెలుగు చిత్రాల్లో ఎమ్మెస్ నారాయణ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. “మా నాన్నకు పెళ్లి”, “దూకుడు” సినిమాలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన శరీరం లో పలు అవయవాలు ఫెయిల్ అవడం తో 2015 లో ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.
#2 వేణుమాధవ్:

కమెడియన్ గా వేణు మాధవ్ ప్రస్థానం అందరికి తెలిసినదే.. ఆయన కెరీర్ లో ఎంత వెలుగు ఉందొ.. సినిమాల్లోకి రాకముందు ఆయన జీవితం లో అంత చీకటి ఉండేది. వేణుమాధవ్ కు మిమిక్రి పై ఇంటరెస్ట్ ఉండేది. రవీంద్ర భారతి లో ఆయన ఇచ్చిన ఓ ప్రదర్శన వేణు మాధవ్ జీవితాన్నే మార్చేసింది. సంప్రదాయం సినిమా తో వెండితెరకు పరిచయమైన వేణు మాధవ్.. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. శ్రీ రామ చంద్రులు, దిల్, సై, ఆంధ్రావాలా, ఛత్రపతి.. ఇలా వేణుమాధవ్ హిట్ లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. కాలేయ సంబంధ వ్యాధి తో వేణుమాధవ్ 2019 లో మరణించారు.
#3 ఆహుతి ప్రసాద్:

ఆహుతి ప్రసాద్ కు చిన్నతనం నుంచి యాక్టింగ్ అంటే అమితమైన ప్రేమ ఉండేది. చదువు పూర్తి అయిపోయాక ఆహుతి ప్రసాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. “విక్రమ్” సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆయన ఆహుతి అనే సినిమాలో ఓ రోల్ ని చేసారు. ఆ సినిమా ఆయనకు ఎంత పేరు తెచ్చిపెట్టింది అంటే.. చివరకు ఆ సినిమా పేరు కూడా అయన పేరు పక్కన స్థిరపడిపోయింది. కాన్సర్ తో పోరాడుతూ.. ఆహుతి ప్రసాద్ 2015 తుదిశ్వాస విడిచారు.
#4 కళ్ళు చిదంబరం:

కొల్లూరు చిదంబరం ఆయన కళ్ళతోనే మనకి గుర్తుండిపోయారు. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయనను “కళ్ళు” చిదంబరం గా పిలుస్తుంది. అంతే కాదు. ఆయన నటించిన కళ్ళు సినిమా ఆయనకీ మంచి గుర్తింపు ను తెచ్చింది. ఆయనకు ఈ సినిమాకి గాను రాష్ట్ర నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. తెలుగు లో ఆయన నటించిన “అమ్మోరు” సినిమా కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. చిదంబరం సినిమాల్లోకి వచ్చే ముందు ఆయన ఇంజనీర్ గా పనిచేసేవారట. ఆయన కూడా 2015 లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
#5 ధర్మవరపు సుబ్రహ్మణ్యం:

ప్రభుత్వ అధికారి అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం నాటకాలు, సినిమాలపైనే మక్కువ తో తెలుగు ఇండస్ట్రీ కి వచ్చారు. జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురాలో ఆయనకు అవకాశం లభించింది. అదే ఆయన మొదటి సినిమా. ఆ తరువాత పలు సినిమాల్లో ఆయన నటించారు. అధ్యాపకుడిగా ధర్మవరపు పూయించిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు. అయితే కొందరు మరీ ఆ పాత్రలను కించ పరుస్తుండడం తో ఆ పాత్రలకు స్వస్తి పలికాడు. ఒక్కడు, వర్షం, నువ్వునేను, ధైర్యం, ఆలస్యం అమృతం సినిమాలు ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆరు నెలల పాటు కాలేయ కేన్సర్‌తో బాధపడి 2013 లో ఆయన ఈ లోకాన్ని విడిచెళ్ళిపోయారు.
#6 కొండవలస:

మీకు “అయితే ఒకే ” డైలాగ్ ఇప్పటికి గుర్తుందంటే దానికి కారణం కొండవలసే. కమెడియన్ గా ఆయన “అయితే ఒకే” పదాన్ని పలుకుతూ కామెడీ ని పండించారు. “అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు” సినిమా కొండవలస కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రత్యేకమైన యాసలో కామెడీ ని పండించడం ఆయనకే చెల్లింది. కొండవలసకు తీవ్రమైన చెవి కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండేదట. దానివల్లనే ఆయన 2015 లోనే మృతి చెందారు.
#7 జయప్రకాశ్ :

బ్రహ్మపుత్రుడు సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన జయప్రకాశ్ రెడ్డి పలు సినిమాల్లో కమెడియన్ గా విలన్ గా ఆకట్టుకున్నారు. ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన రాయలసీమ యాసలో ఆయన కామెడీ ని పండించారు. దాదాపు పాతిక సినిమాలు చేసాక.. ఆర్ధికం గా ఇబ్బందులు ఎదురవ్వడం తో గుంటూరు కు వెళ్ళిపోయి కొంతకాలం టీచర్ గా పనిచేసాడు. అనుకోకుండా ఆయనకు ప్రేమించుకుందాం రా సినిమా లో ఛాన్స్ ఇచ్చారు. అందులో విలన్ పాత్ర జయప్రకాశ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటినుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆయన తండ్రి గారు బదిలీలు అవుతుండడం వలన ఆయనకు పలు ప్రాంతాల్లోని భాషలపై పట్టు లభించింది.
#8 తెలంగాణ శకుంతల:

తెలంగాణ యాసతో అబ్బురపడేవిధం గా మాట్లాడే నటి రాష్ట్రము పేరునే తన పేరు పక్కన చేర్చుకుంది. రాయలసీమ మాండలికాన్ని కూడా ఆమె అద్భుతం గా పలికించగలరు. “మా భూమి” చిత్రంతో ఆమె తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. కామెడీ పాత్రలతో పాటు, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా శకుంతల అద్భుతం గా నటించారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అకస్మాత్తు గా గుండెపోటు రావడం తో ఆమె జూన్ 2014 లో మృతి చెందారు.
#9 బండ్ల జ్యోతి:

తేలికపాటి హాస్యం తో అమితం గా నవ్వించే వ్యక్తి గా బండ్ల జ్యోతి పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెస్ నారాయణ వంటి పలువురు ప్రముఖ హాస్యనటులతో ఆమె కలిసి నటించారు. “ఆమె”, “భద్రాచలం”, “గణేష్” వంటి చిత్రాలలో ఆమె నారాయణ, ఎంవిఎస్ వంటి నటులతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె చిన్నవయసులోనే దురదృష్టవశాత్తు గుండెపోటు కారణం గా మృతి చెందింది.
#10 కమెడియన్ ఏవిఎస్ :

ఏవీఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. కమెడియన్ గా ఆయన ఎన్నో సినిమాలలో నటించారు. ఆయన రచయితగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడి గా కూడా పరిచయం చేసారు. మిష్టర్ పెళ్ళాం సినిమాలో ‘తుత్తి’ మ్యానరిజం తో అలరించిన ఏవీఎస్, ఘటోత్కచుడు సినిమాలో ‘రంగుపడుద్ది’ డైలాగును , అలానే శుభలగ్నం సినిమాలో ‘గాలి కనపడుతుందా’ లాంటి డైలాగులు వేసి అలరించారు. నటనే కాకుండా ఆయన అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసారు. కాలేయ సంబంధ వ్యాధితోనే ఏవీఎస్ 2013 లో మృతి చెందారు.
మీమీద పిచ్చి ప్రేమ ఉన్న అబ్బాయిలు మాత్రమే ఈ 10 పనులు చేస్తారు.. ఏంటో చూడండి..!
సాధారణం గా మన ప్రేమను మనం ప్రేమించిన వారు అంగీకరిస్తే ఎంతో మురిసిపోతాం. కానీ, మనలని కూడా అంతే గొప్ప గా ప్రేమించే వారు దొరకడం మన అదృష్టం. అయితే, ఎవరైనా మనపై పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని మనకి ఎలా తెలుస్తుంది..? ప్రేమ లో పడితే అదే తెలుస్తుంది అండి. ఈ పది లక్షణాలు ఎవరిలో అయినా మీకు కనిపించాయా..? అయితే.. ఆ అబ్బాయి మీ పై పీకల్లోతు ప్రేమ లో మునిగిపోయాడని అర్ధం. అవేంటో చూడండి..

సాధారణం గా అబ్బాయిలకి సానిటరీ పాడ్స్ కొనడం లాంటివి ఇష్టం ఉండవు. ఇవి కొంటున్న సమయం లో అతని స్నేహితులెవరైనా చూస్తే తమ పరువు పోతుందని చాలా మంది అబ్బాయిలు భావిస్తారు. కానీ, మీకోసం ఎవరైనా అబ్బాయి అలా కొని తెచ్చ్చిపెట్టారంటే అతనికి మీరంటే చాలా పిచ్చి ప్రేమ అని అర్ధం.
1. జనరల్ గా అబ్బాయిలు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఓసారి కనబడి పలకరించి వచ్చేస్తారు.అంతే తప్ప..అమ్మాయిల్లా పక్కనే ఉండి ఎక్కువ కేర్ తీసుకోవడం వంటివి ఉండవు. కానీ, మీకెప్పుడైనా అనారోగ్యం వస్తే.. ఎవరైనా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారా..? అంటే ఆ అబ్బాయికి మీపై పిచ్చి ఇష్టం ఉన్నట్లే.
2.మీరు మాట్లాడుతున్నప్పుడు.. మీరు చెప్పే విషయాలన్నీ వారికి బాగా గుర్తుంటాయి. వారు మీ మాటల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. కాబట్టి మీరు చెప్పే విషయాలు కూడా వారికీ బాగా గుర్తుంటాయి.
3. మిమ్మల్ని సెక్యూర్ గా ఉంచడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. సాధారణం గా అబ్బాయిలు ఇలాంటి విషయాలు పట్టించుకోరు. ఎవరిదీ వారు చేసుకోగలరు అన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయినా మీ పట్ల ఈ ప్రత్యేకత కనబరుస్తున్నారంటే.. మీరంటే వారికి ప్రేమ ఉన్నట్లే.
4. మీతో పాటు కలిసి సీరియల్స్ చూడడానికి ఆసక్తి కనబరిస్తే.. వారి కి మీతో గడపడం ఇష్టమన్న సంగతి అర్ధం అవుతూనే ఉంటుంది. సాధారణం గా అబ్బాయిలకి సీరియల్స్ చూడడం ఇష్టం ఉండదు. మీతో గడపడం కోసమే వారు సీరియల్స్ చూడడానికి ఇష్టపడతారు.
5. ఇంట్లో ఉండే పనిని మీతో పాటు వారు కూడా పంచుకుంటారు. బాత్రూం క్లీనింగ్ నుంచి, వంట పనుల దాకా అన్ని పనుల్లోనూ మీకు సహకరిస్తారు.
6. మీ పై చాలా ప్రేమ ఉన్న అబ్బాయిలు మీతో ప్రేమ గానే ఉంటారు. కానీ రోజువారీ వారు చేస్తున్న పనులను, వారు ఎదుర్కొంటున్న కష్టాలను మీతో గడుపుతున్న సమయం లో మర్చిపోతారు. వారి కష్టాలను మీకు తెలియనివ్వరు.

7. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం. నిజం గా ప్రేమ ఉన్న వ్యక్తులు మాత్రమే మీతో ఓపెన్ గా నిజాయితీ గా ఉంటారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా.. మీకు మరింత దగ్గరవుతారు.
8. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని సలహా అడుగుతుంటారు. అంటే వారికీ చేతకాక కాదు.. మీరంటే ఎక్కువ ఇష్టం ఉండడం వలన.. మీ అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం ఇవ్వడం కోసమే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు.

9. సమయం దొరికినపుడు సరదాగా బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కూడా బయటకు తీసుకెళ్తుంటారు. రెస్టారంట్స్, షికార్లకు తాను వెళ్లాలనుకుంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలని భావిస్తారు.
10. తన పనులకంటే.. మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తనకి పనులు ఉన్నా, మీకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే మీరంటే పడి చచ్చేంత ఇష్టం ఉందని అర్ధం.
ఐపీఎస్ / పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అభ్యర్థులకు “జుట్టు” చిన్నగా ఎందుకు కత్తిరిస్తారో తెలుసా.?
ఐపీఎస్.. ఇండియన్ పోలీస్ సర్వీస్. దీని కోసం చాలా మంది కలలు కంటారు. కఠోర సాధనతో ఇందులో ఎంపికవుతారు. ఇందులో ఎంపికయ్యాక వారికి కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ ను ఇస్తారు. ఆ తరువాత పోస్టింగ్ ఇస్తారు. అయితే.. ఈ ట్రైనింగ్ సమయం లో వారి జుట్టుని చాలా చిన్నగా కత్తిరిస్తారు. ఇలా ఎందుకు చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా… పోలీస్ ట్రైనింగ్ టైం లో హీరోలు కూడా షార్ట్ హెయిర్ తో కనిపిస్తారు. ఇలా ఎందుకు అంటే.. ట్రైనింగ్ తీసుకునే సమయం లో పోలీసులు చాలా కష్టపడతారు. వారికి ఇచ్చే టాస్క్ లు ఎలా ఉంటాయి అంటే.. తాళ్లు ఎక్కడం, నేలపై పాకడం, జంప్ చేయడం… ఇలాంటివి చేసే సమయం లో జుట్టు ముఖం మీద పడడం వలన గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే జుట్టుని కత్తిరించేస్తారు.

అలాగే అందరికి ఒకటే యూనిఫామ్ ని ధరింప చేస్తారు. దీనివలన కుల, మత, ధనిక, పేద వర్గాల బేధం లేకుండా అందరు ఒక్కటే అనే భావం లో ట్రైనింగ్ ను పొందుతారు.ఐపీఎస్ కి ఎంపిక అయ్యి ట్రైనింగ్ తీసుకునే వారు విధిగా రూల్స్ ని పాటించాలి. కచ్చితం గా హెయిర్ కట్ ను వారు చెప్పిన్నట్లే చేయించుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ లో ఉన్నపుడు ఎక్కువ భాగం శారీరక శ్రమకు కేటాయిస్తారు.

ఫ్యాషన్ కోసం జుట్టుని కత్తిరించుకోవడానికి ఎక్కువ సమయం అవసరం అవుతుంది. అదే షార్ట్ హెయిర్ కట్ అయితే చాలా తొందరగా పూర్తి అయిపోతుంది. ఐపీఎస్ అంటే..ఎంతో కఠినమైన శ్రమ.. ఇందుకోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్నీ అభ్యర్థులకు ముందే అర్ధం అయ్యేలా చెప్పడం కోసమే.. ట్రైనింగ్ కి ముందే జుట్టుని కత్తిరించేస్తారు.
