స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఈ ఏడాది మొదట్లోనే సంక్రాంతికి టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, తమిళ డబ్బింగ్ సినిమాలతో కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దళపతి, అజిత్ బాక్సాఫీస్ దగ్గర రెండు మూడు రోజుల తేడాతో పోటీ పడిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కూడా ఒక రోజు తేడాతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. మరి రెండు చిత్రాలలో ఎవరి సినిమా విజయం సాధిస్తుందో అని అటు మెగా ఫ్యాన్స్, ఇటు రజినీ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ భోళా శంకర్. ఈ చిత్రంలో తమన్నా. కీర్తి సురేష్, సుశాంత్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆగస్ట్ 11 న రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ మూవీ యావరేజ్ టాక్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరో వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ కీలకపాత్రలలో నటించారు. జైలర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. ఇక మూవీలోని ‘కావాలయ్యా సాంగ్’ తమిళ వెర్షన్ కు 100 మిలియన్ల వ్యూస్ అందుకుంది.
ఈ పాటతో, ట్రైలర్ తో ఈ మూవీ పై అంచనాలను భారీగా పెరిగాయి. ఈ మూవీ ఆగస్ట్ 10న రిలీజ్ కానుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం, ఈ మూవీ తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోంది. రెండు సినిమాలను కంపేర్ చేస్తే సబ్జెక్ట్ కూడా డిఫరెంట్, జైలర్ మూవీకి హిట్ టాక్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Also Read: “రజనీకాంత్” తో పాటు… “మద్యానికి బానిస” అయ్యి దాదాపు తమ కెరీర్ నాశనం చేసుకున్న 6 నటులు వీరే..!

“బ్రో సినిమా ఎలా ఉంది?” అని కోరాలో అడుగగా, దానికి
ఇవన్నీ తెలుగులో పూర్తిగా మార్చారు. కానీ సినిమాలో అవసరమైన ఇంటర్ loods లేవనే చెప్పాలి. సినిమా సంభాషణలు మరియు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇచ్చి పెద్ద తప్పు చేశారు. ఆయన దృష్టి అంతా అంతర్లీనంగా భావం ఉండే డైలాగ్స్ మీద. సాధారణ ప్రేక్షకులకు అర్థం కాకుండా మరో అజ్ఞాతవాసి రచన చేశారా? అనిపించింది. ఎంతో హాస్యాన్ని పండించవచ్చు. యమలోకం భూలోకం కాన్సెప్ట్ మీద తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఎంతో వినోదాన్ని పంచే ఈ సినిమాలో చాలా అవకాశం ఉంది. దర్శకత్వం సముద్రఖనికి ఇవ్వడం మరో పెద్ద తప్పు.
తెలుగు నేటివిటీకి దూరంగా ఉంటుంది. ఇది హాస్యం పండించగల సీనియర్ తెలుగు దర్శకుడికి గాని లేదా వేరే కొత్త డైరెక్టర్ కి ఇచ్చినా మరింత హాస్యాన్ని పండించేవారు. పాటలు కూడా ఆశాజనకంగా లేవు. సినిమా హాల్లో స్పందన కరువైంది. శ్యాంబాబు పృధ్వి ఎపిసోడ్ అసలు పెద్దగా ఏమీ లేనేలేదు. అయినా సినిమా మొదట్లో వేసిన విజ్ఞాపన disclimer ప్రకారం ఈ సినిమాలో ఏ జంతువుల్ని హింసించడం జరగలేదు అని ముందే రాశారు. మొత్తానికి బ్రో సినిమా ఫ్లాప్ అని అనలేము హిట్ అని అనలేము.
బహుశా ఈ చిత్రానికి పని చేసిన సినీ కళాకారులు మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ లాంటి పెద్ద పెద్ద పేర్లు చూసి మనలో అంతర్లీనంగా ఉన్న ఒక బాధేమో ? స్థూలముగా అంతగా ఆకట్టుకోలేని సినిమా. పదేపదే సినిమాల్లో గతంలో పవన్ కళ్యాణ్ చార్ట్ బస్టర్ పాటలు వినిపించడం తీవ్ర అనారోగ్యనికి లోనయ్యా. ఏదైనా ఒక పాట రెండు సెకండ్లు అలా వచ్చి అలా వెళ్ళిపోతే అభిమానులకి కిక్ ఉంటుంది.
పూర్తి స్థాయిలో పెడితే ఇలాగే ఉంటుందని ఇదొక పెద్ద విఫల ప్రయోగం. చెప్పాలంటే నాకు సినిమా అరగలేదు వేడి చేసింది. అజీర్ణంగా ఉంది. అందుకని ధనియాలు జీలకర్ర నిమ్మకాయ రసం తాగా. సినిమా కాన్సెప్ట్ మూల కథ మంచిదండోయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు క్షమాపణలతో, ఒకసారి వీక్షణకు ఉపయుక్తం” అంటూ రాసుకొచ్చారు.
ప్రముఖ స్పోర్ట్స్ యాక్సెసరీస్ తయారీ కంపెనీ ‘నైక్’ 2011 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయం సాధించిన తర్వాత భారత క్రికెటర్ల జెర్సీ పై ఈ మూడు స్టార్లను పరిచయం చేసింది. అలా ముద్రించడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ఇండియా మూడు ప్రపంచ కప్ లను గెలుచుకుంది.
1983లో ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి భారత జట్టు తొలి ప్రపంచకప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. గ్రేట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు ఈ కప్ గెలిచింది. 2007లో భారత జట్టు తొలి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంతో రెండవ ప్రపంచకప్ విజయం సాధించింది. 2011లో వాంఖడే స్టేడియంలో ఎం ఎస్ ధోని సారధ్యంలో భారత క్రికెట్ జట్టు మూడవ ప్రపంచ కప్ ను సాధించింది.
మూడు ప్రపంచ కప్ లు గెలుచుకోవడంతో మూడు స్టార్లను భారత జెర్సీలో రూపొందించారు. అది మాత్రమే కాకుండా గ్రౌండ్ లో క్రికెటర్లకు స్ఫూర్తి నింపేందుకు గాను ఈ మూడు నక్షత్రాలను జెర్సీలో రూపొందించారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇప్పటివరకు 5 ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. అందుకే ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు లోగోలో 5 నక్షత్రాలు ఉన్నాయి. వాస్తవానికి పుట్‌బాల్‌లో ఈ సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ మూవీలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించగా, సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు జరుగగా, కమెడియన్ హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఆది మెగా కుటుంబాన్ని విమర్శించేవారికి తనదైన ప్రాస, పంచ్‌లతో సమాధానం చెప్పాడు. సహజంగా హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవికి మాత్రం హీరోలే అభిమనులుగా ఉంటారని అన్నారు. ఆది తన పంచ్ లతో మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాడు.
హైపర్ ఆది ఈ ఈవెంట్ లో పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌ల గురించి కూడా మాట్లాడాడు. రామ్ చరణ్ గురించి చెబుతూ ‘ సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవలేదు. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవలేదు. కానీ చిరంజీవిగారి కొడకు చిరంజీవి అయ్యాడు అంటూ ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అయితే ఇవే కామెంట్స్ మూడేళ్ళ క్రితం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ అనియన్ స్లైస్ అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు.
హైపర్ ఆది భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కామెంట్స్ చేసిన తరువాత సదరు ట్విట్టర్ యూజర్ ‘ఈ ట్వీట్ మనం మూడున్నరేళ్ల క్రిందటే వేసాం’ అంటూ ఆ ట్వీట్ ని షేర్ చేయడంతో నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
1. సూపర్ స్టార్ రజినీకాంత్:
2. ధర్మేంద్ర:
3. మనీషా కోయిరాల:
4. సంజయ్ దత్:
5. ఫర్ధీన్ ఖాన్:
6. పూజా భట్:
ఆగస్ట్ 10న రిలీజ్ అవుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ కండిషన్ కూడా అలాగే కనిపిస్తోంది. ఫస్ట్ డే 391 షోలు మాత్రమే పడుతున్నట్లు సమాచారం. వాటిలో 85 షోలు మాత్రమే హౌస్ ఫుల్ అయినట్టు తెలుస్తోంది. ఈ రెండు ఇలా ఉంటే, ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అవుతున్న ‘బిజినెస్ మెన్’ మూవీకి ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా జరిగాయి.
మహేష్ బాబు బర్త్ డే కి రీరిలీజ్ కానున్న నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ‘బిజినెస్ మెన్’ మూవీకి హైదరాబాద్ లో 172 షోలు బుక్ అయినట్లు తెలుస్తోంది. వాటిలో 110 షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయని, ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కోటి రూపాయల గ్రాస్ మార్క్ ను దాటేసిందని తెలుస్తోంది.
మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలు థియేటర్లలో రి రిలీజై సెన్సేషన్ సృష్టించగా, ఈ ఏడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అవుతున్న బిజినెస్ మేన్ సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో కోటి రూపాయల గ్రాస్ మార్క్ ను దాటిందని తెలుస్తోంది.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ సినిమా చిత్రీకరణ సమయంలో తమకు సహాయం చేస్తానని డైరెక్టర్ కార్తికి మాట ఇచ్చారని, బెల్లీ, బొమ్మన్ దంపతులు చెబుతున్నారు. ఆమే ఇచ్చిన మాటను ఇంతవరకు నెరవేర్చలేదని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా ఇల్లు, తన మనవరాలు చదువుకు సాయం, వాహనం కోసం మూవీకి వచ్చిన కలెక్షన్స్ లో కొంత ఇస్తానని చెప్పారని లీగల్ నోటీసులో తెలిపారు.
ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ నుండి దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ పురస్కారాలు పొందారని బెల్లీ, బొమ్మన్ దంపతులు చెప్పారు. అయితే తమకు మాత్రం ఏమి చేయలేదని, ఆస్కార్ వచ్చిన తరువాత జరిగిన సన్మాన సభల్లో కూడా ఆస్కార్ ను పట్టుకోనివ్వలేదని వారు పేర్కొన్నారు. ఆ డాక్యుమెంటరీలో నటించిన తరువాత తాము ప్రశాంతత పోగొట్టుకున్నామని ఆ దంపతులు తమ బాధను వ్యక్తం చేశారు.
‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ నిర్మాణ సంస్థ బెల్లీ, బొమ్మన్ దంపతులు చేసిన ఆరోపణల పై స్పందించి, వారు చెప్పే వాటిలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తికి గోంజాల్వెస్ కు బెల్లీ, బొమ్మన్ దంపతులు రెండు కోట్ల పరిహారం ఇవ్వాలంటూ లీగల్ నోటీసులు పంపడం హాట్ టాపిక్ గా మారింది.
నుపుర్ చాబ్రా ఇండియాకి చెందిన అమ్మాయే. అయితే ఆమె అమెరికాలో ఉంటున్నారు. నుపుర్ చాబ్రా మైనర్ అండ్ మార్కెటింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో పూర్తి చేశారు. అంతేకాకుండా బిజినెస్ ఎకనామిక్స్ లో, ప్రిన్సిపుల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కూడా పూర్తి చేశారు. ఆమె సామాజిక మధ్యమాలలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ, ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్ లో ఉంది. అయితే నుపుర్ చాబ్రా కేరింగ్ హండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు.
ఈమె ఏఐ టెక్నికల్ రీక్రుటర్ గా, మార్కెటింగ్ మీడియా మేనేజర్ గా ఫేస్ బుక్ లో ఆరు సంవత్సరాలు పని చేశారు. ప్రస్తుతం నుపుర్ చాబ్రా శాన్ ఫ్రాన్సిస్కోలో రా బ్లాక్స్ లో రీక్రుటింగ్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే, మరో వైపు కేరింగ్ హండ్స్ ఫర్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ కు ఎక్స్క్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
లెట్స్ హాంగిన్ అనే నాన్ ప్రాఫిటబుల్ సంస్థకు కో ఫౌండర్ గా ఉన్నారు. దీనిని ఉద్యోగం కోల్పోయినవారికి సహాయం అందించడం కోసం డిజైన్ చేశారు. ఈ సంస్థ ద్వారా 2020లో ఉద్యోగం కోల్పోయిన చాలామందికి హెల్ప్ చేసినట్లు తెలుస్తోంది. 2020లో నుపుర్ సాహిల్ అనే వ్యక్తిని అక్టోబర్ 17 న వివాహం చేసుకుంది.
యశ్వంత్‌ను మరాఠీ స్కూల్ లో చేర్పించారు. పదకొండేళ్లకే మరాఠీ 4వ పరీక్షలో పాస్ అయ్యాడు. కానీ పేదరికం వల్ల పై చదువుల కోసం సిటీకి వెళ్లలేక, పొలం పనులు చేయడం మొదలుపెట్టాడు. కొన్నేళ్లకు అతని అన్నయ్య ఆర్మీలో రిటైర్ అయ్యి, తిరిగి వచ్చాడు. యశ్వంత్ కూడా తన అన్నయ్యలాగే ఆర్మీలో చేరాలని అనుకున్నాడు. కానీ యశ్వంత్ తల్లికి అతను ఆర్మీలో చేరడం ఇష్టం లేదు. కానీ అన్నదమ్ములిద్దరు పట్టుబట్టడంతో ఆమెకు ఒప్పుకుంది. కానీ ఒక కండిషన్ పెట్టింది.
ఆర్మీలో చేరడానికి ముందే పెళ్లి చేసుకోవాలని, అప్పుడే ఆర్మీలో చేరేందుకు అనుమతిస్తానని చెప్పడంతో 18 ఏళ్ల వయసులో 1937లో లక్ష్మీ బాయిని పెళ్లి చేసుకున్నాడు. యశ్వంత్ 1938లో 5వ మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో సోల్జర్ గా చేరాడు. అక్కడ యశ్వంత్ బాగా పనిచేయడంతో తక్కువ సమయంలోనే ప్రమోషన్ పొంది, నాయక్ రేంజ్ కి ఎదిగాడు. సరిగ్గా ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది. 1939-1945 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారి తరపున పోరాడడం కోసం 5వ మరాఠా లైట్ ఇన్ఫాంట్రీని ఇటలీకి పంపించారు.
ఆ సమయంలో నాయక్ యశ్వంత్ ఘాడ్గే మరాఠా లైట్ పదాతి దళంలో ముఖ్యమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలా ఇటలీకి వెళ్ళిన పదాతి దళం యశ్వంత్ ఘాడ్గే నేతృత్వంలో జర్మనీతో పోరాడుతోంది. 1944లో జూలై 10న ఇటలీలోని అప్పర్ టైబర్ వ్యాలీలో, నాయక్ యశ్వంత్ ఘడ్గే సారథ్యంలో రైఫిల్ విభాగం పై జర్మన్ సేనలు అకస్మాత్తుగా దాడి చేశాయి. భారీ మెషిన్-గన్ కాల్పులకు గురైంది. ఇది కమాండర్ మినహా మిగతా సభ్యులందరు మరణించారు. ఒక్కడే ఉన్నప్పటికీ నాయక్ యశ్వంత్ ఘడ్గే ఏమాత్రం భయపడకుండా మెషిన్-గన్ పై గ్రెనేడ్ విసిరాడు.
అది మెషిన్-గన్ ధ్వంసం చేసింది. ఆ తరువాత తుపాకులతో శత్రు సైనికులను కాలుస్తూ, చివరకు ‘గోతిక్ రేఖ’ను ఘాడ్గే స్వాధీనం చేసుకున్నారు. కానీ పక్కనే ట్రెంచ్‌లో దాక్కున్న జర్మన్ సోల్జర్ ఘాడ్గేను తుపాకీతో కాల్చడంతో ఆయన 22 ఏళ్ల వయస్సులోనే మరణించారు. యుద్ధంలో ఘాడ్గే ధైర్యంగా పోరాడారు. అయితే ఘాడ్గే మృతదేహం దొరకలేదు. నాయక్ యశ్వంత్ ఘాడ్గే ధైర్యసాహసాలకు గానూ ఘాడ్గేకు మరణించిన తరువాత డిల్లీలోని ఎర్రకోట వద్ద విక్టోరియా క్రాస్‌ను ప్రధానం చేయడం జరిగింది. దీనిని బ్రిటిష్ ఆర్మీలో అత్యున్నత గౌరవంగా భావిస్తారు.