ఎవరు ఈ యశ్వంత్ ఘడ్గే..? ఇతనంటే ఇటలీ వాళ్ళకి ఎందుకు అంత అభిమానం..?

ఎవరు ఈ యశ్వంత్ ఘడ్గే..? ఇతనంటే ఇటలీ వాళ్ళకి ఎందుకు అంత అభిమానం..?

by kavitha

Ads

ఇటీవల యశ్వంత్ ఘడ్గే అనే ఇండియన్ జవాన్ జ్ఞాపకార్థం ఇటలీలోని మోంటోన్‌లో ఒక స్మారక చిహ్నం నిర్మించారు. ఈ మెమోరియల్‌ని ఇటలీ గవర్నమెంట్ మరియు భారత రాయబార కార్యాలయం కలిసి నిర్వహించాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇండియన్ సైనికులు చూపిన ధైర్యసాహసాలకు, త్యాగాలకు ప్రతీకగా ఈ మెమోరియల్‌ని స్థాపించారు.

Video Advertisement

22 జూలై 2023న జరిగిన ఈ కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ ఆఫీసర్లు, మోంటోన్ మేయర్, ఇటలీ సైనిక అధికారులు, ఇటలీ పౌరులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ ఘడ్గే పై ప్రత్యేక పోస్ట్‌కార్డును రిలీజ్ చేశారు. మరి యశ్వంత్ ఘడ్గే ఎవరో? ఏం చేశారో? ఇప్పుడు చూద్దాం..
బీబీసి కథనం ప్రకారం, యశ్వంత్ బాలాజీ ఘాడ్గే మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ లోని పలాస్‌గావ్-అంబ్రేచి వాడీలో జన్మించారు. ఆయన తల్లి  వితాబాయి, తండ్రి బాలాజీరావు. వారిది పేద వ్యవసాయ కుటుంబం. అతనికి ఒక అన్న మరియు నలుగురు అక్కలు ఉన్నారు. అతను 3 నెలల వయసులో ఉన్న సమయంలోనే తండ్రి మరణించడం, అదే టైమ్ లో అన్న ఆర్మీలో చేరడంతో కుటుంబ భారం అతని తల్లి పై పడింది. ఆమె వ్యవసాయ పనులకు వెళ్తూ, పిల్లలను పెంచసాగింది.
యశ్వంత్‌ను మరాఠీ స్కూల్ లో చేర్పించారు. పదకొండేళ్లకే మరాఠీ 4వ పరీక్షలో పాస్ అయ్యాడు. కానీ పేదరికం వల్ల పై చదువుల కోసం సిటీకి వెళ్లలేక, పొలం పనులు చేయడం మొదలుపెట్టాడు. కొన్నేళ్లకు అతని అన్నయ్య ఆర్మీలో రిటైర్‌ అయ్యి, తిరిగి వచ్చాడు. యశ్వంత్ కూడా తన అన్నయ్యలాగే ఆర్మీలో చేరాలని అనుకున్నాడు. కానీ యశ్వంత్ తల్లికి అతను ఆర్మీలో చేరడం ఇష్టం లేదు. కానీ అన్నదమ్ములిద్దరు పట్టుబట్టడంతో ఆమెకు ఒప్పుకుంది. కానీ ఒక కండిషన్ పెట్టింది.
ఆర్మీలో చేరడానికి ముందే పెళ్లి చేసుకోవాలని, అప్పుడే ఆర్మీలో చేరేందుకు అనుమతిస్తానని చెప్పడంతో 18 ఏళ్ల వయసులో 1937లో లక్ష్మీ బాయిని పెళ్లి చేసుకున్నాడు. యశ్వంత్ 1938లో 5వ మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీలో సోల్జర్ గా చేరాడు. అక్కడ యశ్వంత్ బాగా పనిచేయడంతో తక్కువ సమయంలోనే ప్రమోషన్ పొంది, నాయక్ రేంజ్ కి ఎదిగాడు. సరిగ్గా ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది. 1939-1945 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారి తరపున పోరాడడం కోసం 5వ మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీని ఇటలీకి పంపించారు.
ఆ సమయంలో నాయక్ యశ్వంత్ ఘాడ్గే మరాఠా లైట్ పదాతి దళంలో ముఖ్యమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలా ఇటలీకి వెళ్ళిన పదాతి దళం యశ్వంత్ ఘాడ్గే నేతృత్వంలో జర్మనీతో పోరాడుతోంది. 1944లో జూలై 10న ఇటలీలోని అప్పర్ టైబర్ వ్యాలీలో, నాయక్ యశ్వంత్ ఘడ్గే సారథ్యంలో రైఫిల్ విభాగం పై జర్మన్ సేనలు అకస్మాత్తుగా దాడి చేశాయి. భారీ మెషిన్-గన్ కాల్పులకు గురైంది. ఇది కమాండర్ మినహా మిగతా సభ్యులందరు మరణించారు. ఒక్కడే ఉన్నప్పటికీ నాయక్ యశ్వంత్ ఘడ్గే ఏమాత్రం భయపడకుండా మెషిన్-గన్ పై  గ్రెనేడ్ విసిరాడు.
అది మెషిన్-గన్ ధ్వంసం చేసింది. ఆ తరువాత తుపాకులతో శత్రు సైనికులను కాలుస్తూ, చివరకు ‘గోతిక్ రేఖ’ను ఘాడ్గే స్వాధీనం చేసుకున్నారు. కానీ పక్కనే ట్రెంచ్‌లో దాక్కున్న జర్మన్ సోల్జర్ ఘాడ్గేను తుపాకీతో కాల్చడంతో ఆయన 22 ఏళ్ల వయస్సులోనే మరణించారు. యుద్ధంలో ఘాడ్గే ధైర్యంగా పోరాడారు. అయితే ఘాడ్గే మృతదేహం దొరకలేదు. నాయక్ యశ్వంత్ ఘాడ్గే ధైర్యసాహసాలకు గానూ ఘాడ్గేకు మరణించిన తరువాత డిల్లీలోని ఎర్రకోట వద్ద విక్టోరియా క్రాస్‌ను ప్రధానం చేయడం జరిగింది. దీనిని బ్రిటిష్ ఆర్మీలో అత్యున్నత గౌరవంగా భావిస్తారు.

Also Read: ఎవరు ఈ చక్రవర్తి “బింబిసార”..? ఆయన జీవితం వెనక ఉన్న రహస్యం ఏంటి..?


End of Article

You may also like