ఈ వ్యక్తి తెలియని తెలుగు వారు ఉండరు ఏమో..! ఈయన ప్రయాణం ఎప్పుడు మొదలయ్యింది అంటే..?

ఈ వ్యక్తి తెలియని తెలుగు వారు ఉండరు ఏమో..! ఈయన ప్రయాణం ఎప్పుడు మొదలయ్యింది అంటే..?

by Mohana Priya

Ads

కొన్ని విషయాలకి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో అవగాహన అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అందులో వంటలు కూడా ఒకటి. వంటలు అంటే మన వాళ్ళకి బాగా తెలుసు. కానీ, వంటల మీద యూట్యూబ్ చానల్స్ మాత్రం గత కొంత కాలం నుండి వెలుగులోకి రావడం మొదలు అయ్యాయి. అయితే అసలు ఇలాంటి వంటలని ఆన్ లైన్ లో చేసి చూపించడం, యూట్యూబ్ లో వీడియోస్ షేర్ చేయడం అనేది మొదలుపెట్టిన వ్యక్తి ఒకరు ఉన్నారు. 2007 లో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టారు. ఎన్నో రకాల వంటలని చూపించారు. సంజయ్ తుమ్మ. ఈ పేరు వింటే ఆయన ఎవరు అనేది మీలో చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. అదే వా చెఫ్ అంటే మాత్రం చాలా మందికి తెలుస్తుంది.

Video Advertisement

vah re vah chef sanjay thumma

హైదరాబాద్ లో పుట్టిన సంజయ్ తుమ్మ, 7 సంవత్సరాల వయసులోనే వంటల మీద ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. తన తోబుట్టువులని తన అల్లరితో ఇబ్బంది పెట్టకూడదు అని ఉద్దేశంతో సంజయ్ తుమ్మ తల్లి వంట రూమ్ లోనే ఎక్కువగా ఉండనిచ్చేవారు. సంజయ్ తుమ్మ మొదటిగా దోస, ఎగ్ కర్రీ చేశారు. సంజయ్ తుమ్మ తల్లికి ఆరోగ్యం బాలేనప్పుడు, తన వంట తనే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే సంజయ్ తుమ్మకి వంటల మీద ఆసక్తి కలిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో హోటల్ మేనేజ్మెంట్ లో డిప్లమా పొందారు. సిజిల్ ఇండియా అనే పేరుతో 1998 లో చికాగోలో ఒక రెస్టారెంట్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏడు సంవత్సరాలలో ఇంకొక మూడు రెస్టారెంట్లు మొదలుపెట్టారు.

చెఫ్ కి వంట చేయడానికి ఎక్కువగా అవకాశం ఉండదు అని కారణంగానే తన రెస్టారెంట్స్ ని సంజయ్ తుమ్మ అమ్మేశారు. సెప్టెంబర్ 2007 లో చికాగోలో తన మొదటి 150 రెసిపీలు రికార్డు చేసి యూట్యూబ్ లో వా చెఫ్ అనే ఒక ఛానల్ పెట్టి అందులో పోస్ట్ చేశారు. అప్పటి నుండి సంజయ్ తుమ్మకి పేరు రావడం మొదలు అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సంజయ్ తుమ్మ రెసిపీస్ చూసేవారు. ప్రతి వీడియోకి కొన్ని మిలియన్లలో వ్యూస్ వచ్చేవి. 2000 వీడియోలకి 750 మిలియన్ వ్యూస్ తో 2.3 మిలియన్ సబ్స్క్రైబర్ లని సంపాదించుకున్నారు. యూట్యూబ్ ఛానల్ లో నెలకి 10 నుండి 12 వీడియోలు షేర్ చేస్తూ ఉండేవారు.

2008లో తన కుటుంబంతో పాటు ఇండియాకి వచ్చేసి, ఇక్కడ వారెవా డాట్ కామ్ అనే పేరుతో తన సొంత వెబ్ సైట్ మొదలుపెట్టి, అందులో రెసిపీస్ పోస్ట్ చేశారు.  సంజయ్ తుమ్మ టీవీ ఛానల్స్ లో వచ్చే ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. జడ్జ్ గా వ్యవహరిస్తూ ఉంటారు. జీ తెలుగులో వారేవా అనే ప్రోగ్రాంలో, ఈటీవీ అభిరుచి లో సూపర్ చెఫ్ అనే ప్రోగ్రాంలో, సాక్షి టీవీలో గరంగరం వంటలు అనే ప్రోగ్రాంలో అతిథిగా తన వంటలు చూపించారు. ఇప్పుడు మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగులో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇండియన్, కాంటినెంటల్, చైనీస్, జాపనీస్ ఇలా అన్ని రకమైన వంటలని సంజయ్ తుమ్మ చేసి వీడియోలుగా షేర్ చేస్తూ ఉంటారు. వీడియోస్ షేర్ చేయడం మాత్రమే కాకుండా, అందులో అసలు ఆ వంటలు ఎలా చేస్తే బాగుంటుంది అని అదనపు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటారు.


End of Article

You may also like