90 ఏళ్ల క్రితం నాటి సైకిల్ బిల్ చూశారా..? అప్పట్లో ధర ఎంతంటే..?

90 ఏళ్ల క్రితం నాటి సైకిల్ బిల్ చూశారా..? అప్పట్లో ధర ఎంతంటే..?

by Mohana Priya

Ads

కాలం మారింది. మనుషులు మారారు. టెక్నాలజీ మారింది. జీవనశైలి కూడా మారింది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మారినవి ధరలు. సంవత్సరం మారితే ధరలు కూడా మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సంవత్సరం కాదు. కొన్ని నెలల తర్వాతే ధరలు మారిపోతూ ఉంటాయి. అంత తొందరగా కాలం మారుతుంది. అలా ధరలు మారడానికి కారణం ఏదైనా ఉంటుంది. కొన్ని సార్లు ఆ వస్తువు, లేదా ఆ పదార్థం అరుదుగా దొరికితే అప్పుడు ఎక్కువ ధరకి అమ్ముతారు. ఇప్పుడు మనుషుల జీవనశైలికి తగ్గట్టు ధరలు మారిపోయాయి. రాజుల కాలంలో రోడ్ల మీద డైమండ్స్ అమ్మేవారు అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు డైమండ్స్ కొనుక్కోవాలి అంటే కొన్ని సంవత్సరాలు కొంత మొత్తాన్ని సేవ్ చేశాక ఆ తర్వాత కొనుక్కోవాలి.

Video Advertisement

90 years old cycle bill

అప్పట్లో వాళ్లకి ఎక్కడ పడితే అక్కడ దొరికే డైమండ్లు ఇప్పుడు ఇలా ఇంత ఖరీదుగా అయిపోతాయి అని వాళ్ళు కూడా ఊహించి ఉండరు. డైమండ్స్ మాత్రమే కాదు. అప్పట్లో చాలా తక్కువ ధరకి అమ్మేవి అన్ని కూడా ఇప్పుడు వేలు, లక్షల్లో అమ్ముతున్నారు. అందులో రోజు మనుషులు వాడే వాహనాలు కూడా ఒకటి. గతంలో వాహనాల ధరలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు సైకిల్ కూడా చాలా మొత్తం పెడితే కానీ రాదు. 90 ఏళ్ల క్రితం సైకిల్ బిల్ ఇప్పుడు బయటికి వచ్చింది. ఇందులో సైకిల్ ధర చూస్తే ఇప్పుడు అదే ధర ఉంటే పది సైకిళ్లు కొనే అవకాశం ఉంది అన్నట్టు అనిపిస్తుంది.

ఈ సైకిల్ బిల్ కలకత్తాలో ఉన్న కుముద్ సైకిల్ వర్క్స్ వారిది. ఇందులో సైకిల్ ధర 18 రూపాయలు అని ఉంది. 1934 లో ఈ సైకిల్ కొనుగోలు చేశారు. అప్పుడు సైకిల్ ధర కేవలం 18 రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఈ ధరకి సైకిల్ లో ఒక భాగం కాదు, సైకిల్ టైర్ కూడా రాదు. అసలు ఇప్పుడు ఇదే ధర కి సైకిల్ వస్తే 100 సైకిళ్ళు కొని పెట్టుకునేవారు. కానీ కాలంతో పాటు ధరలు కూడా మరి ఇప్పుడు వేలల్లోకి చేరాయి. ఆధునికత కూడా ఇందుకు ఒక కారణం. అందుకే ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్న మోడల్స్ కూడా వస్తున్నాయి.


End of Article

You may also like