సినిమాల మీద ఇష్టం ఒక మనిషిని ఇంత చెడుగా మారుస్తుందా..? ఈ సినిమా చూశారా..?

సినిమాల మీద ఇష్టం ఒక మనిషిని ఇంత చెడుగా మారుస్తుందా..? ఈ సినిమా చూశారా..?

by Harika

Ads

ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న అందరిలో చాలా విషయాలు వేరుగా ఉంటాయి. కానీ ఒక్క విషయం మాత్రం వారందరిలో కామన్ గా ఉంటుంది. అదే సినిమాల మీద వారికి ఉన్న ఇష్టం. ఇష్టం కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమాల మీద వాళ్ళకి ఉన్న పిచ్చి. సినిమాల కోసం ఊర్లు వదిలేసి వచ్చేస్తారు. ఉద్యోగాలు వదిలేసి వస్తారు. ఎంత గొప్ప చదువులు చదివినా కూడా సినిమా ఇండస్ట్రీలో నిలతొక్కుకోవాలి అనే ఒక ఆశతో చిన్న ఉద్యోగం అయినా సరే సినిమా ఇండస్ట్రీలో చేస్తారు. అలా పెద్ద స్థాయికి వెళ్తారు. ఇదంతా చాలా పెద్ద జర్నీ. అయితే ఇలా ఒక మనిషికి సినిమాల్లోకి వెళ్లి పెద్ద నటుడు అవ్వాలి అనే ఆశ ఉంటుంది.

Video Advertisement

movie in which hero wants to become an actor.

కానీ అతను మాట్లాడలేడు. అతను సినిమాల్లోకి వెళ్లి గొప్ప నటుడు అయ్యాడు. దానికి ఇంకొక వ్యక్తి సహాయం చేశాడు. ఇదంతా సినిమా. షమితాబ్ అనే సినిమాలో ఇది చూపించారు. ధనుష్ ని నటుడిగా మరొక మెట్టు ఎక్కించిన గొప్ప సినిమా ఇది. ఆర్ బాల్కీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ రెండవ కూతురు అక్షర హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, దానిష్ (ధనుష్) కి మాటలు రావు. కానీ హీరో అవ్వాలి అని అనుకుంటాడు. చిన్నప్పటినుండి సినిమాలు చూస్తూ పెరుగుతాడు.

ముంబైకి వెళ్లి పెద్ద హీరో అవ్వాలి అని ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ లు అడ్డుకుంటారు. అప్పుడు అక్కడ అక్షర పాండే (అక్షర హాసన్) దానిష్ ని చూసి అతని వివరాలు తెలుసుకుంటుంది. తన తండ్రి కనిపెట్టిన ఒక పరికరంతో దానికి ఆపరేషన్ చేసి, మరొక వ్యక్తి మాట్లాడితే, అది దానిష్ నుండి వచ్చేలాగా చేస్తారు. అలా దాని గొంతు కోసం అమితాబ్ సిన్హా (అమితాబ్ బచ్చన్) ని అడుగుతారు. పనులు ఏమీ చేయకుండా అలా గడిపేసే అమితాబ్ సిన్హాని చాలా కష్టపడి వాయిస్ కోసం మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అమితాబ్ సిన్హా వాయిస్ తో దానిష్ చాలా పెద్ద హీరో అవుతాడు. అమితాబ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి తన పేరు, అమితాబ్ పేరు కలిసి వచ్చేలాగా తన స్క్రీన్ నేమ్ ని షమితాబ్ అని పెట్టుకుంటాడు.

అమితాబ్ తన వాయిస్ వల్ల దానిష్ అంత పెద్ద హీరో అయ్యాడు అని అనుకుంటాడు. దానిష్ తన టాలెంట్ వల్ల అయ్యాను అని అనుకుంటాడు. మరొకపక్క అక్షర సినిమా తీయాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ వీళ్లిద్దరి మధ్య ఈగో గొడవలు పరిష్కరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. ఈ సినిమాకి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించారు. శృతి హాసన్ ఈ సినిమాలో ఒక పాట కూడా పాడారు. అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో ఒక పాట పాడారు. 2015 లో  వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత గొప్ప వసూళ్లు సాధించలేకపోయినా కూడా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా హిందీలో జీ ఫైవ్ లో స్ట్రీమ్ అవుతోంది. చాలా మంచి సినిమా అని చాలా మంది కామెంట్స్ చేశారు.


End of Article

You may also like