మూలా నక్షత్రంలో పుట్టిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదా..? చేసుకుంటే ఏమవుతుంది అంటే..?

మూలా నక్షత్రంలో పుట్టిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదా..? చేసుకుంటే ఏమవుతుంది అంటే..?

by Mounika Singaluri

Ads

పెళ్లితో రెండు మనసులు ఒకటవుతాయి. రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. నిజానికి పెళ్లి అంటే ఒక పండగలా జరుగుతూ ఉంటుంది. అయితే వివాహాన్ని జరిపేందుకు ముందు జాతకాలని చూస్తూ ఉంటారు. వరుడు, వధువు పుట్టిన నక్షత్రాలని సమయాన్ని చూసి వాటి ఆధారంగా ఇద్దరికీ నప్పుతుందా లేదా అనేది చూపించి అప్పుడు వివాహం జరుపుతారు.

Video Advertisement

ప్రేమ పెళ్ళిళ్ళలో ఇలాంటివి ఉండవు. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లలో ఇవి కచ్చితంగా ఉంటాయి. ఈ రోజుల్లో కూడా చాలా మంది జాతకాలని చూసి ఆ తర్వాత మాత్రమే పెళ్లిళ్లు చేస్తున్నారు.

అయితే ఒక విషయం ఏమిటంటే.. మూల నక్షత్రం లో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనేది మనం చాలా సార్లు వినే ఉంటాం. నిజంగా మూల నక్షత్రం లో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకుంటే సమస్యలు వస్తాయా..? ఎటువంటి సమస్యలు వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

శాస్త్రపరంగా చూస్తే మూల నక్షత్రంలో పుట్టిన తేదీని పెళ్లి చేసుకుంటే అంత అదృష్టం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. కానీ చాలా మంది మూల నక్షత్రం లో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని అంటూ ఉంటారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. నిజానికి అలాంటివేమీ జరగవు. ఒకవేళ కనుక సమస్యలు వస్తున్నాయి అంటే అమ్మాయి పుట్టినప్పటి నుండి కూడా సమస్యలు రావాలి.

పైగా పుట్టిన వాళ్లకి కూడా ఎన్నో ఇబ్బందులు కలిగి ఉండాలి. కానీ ఇవన్నీ అపోహలు కనుక అలా జరగదు. ఇటువంటివి అనవసరంగా నమ్మద్దు. మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వైవాహిక జీవితంలో ఆనందంగా సాగుతున్న వాళ్లు కూడా ఉన్నారు.

చాలామంది ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. మూల, ఆరుద్ర, జేష్ఠ నక్షత్రం లో పుట్టిన వారిని వివాహం చేసుకుంటే సమస్యలు వస్తాయని అంటుంటారు కానీ అవేమీ నిజం కాదు ఈ నక్షత్రాలలో పుట్టిన వాళ్లు కూడా ఆనందంగా వుంటారు.


End of Article

You may also like