2023 సివిల్స్ టాపర్ కంటే ఎక్కువ మార్కులు సంపాదించుకున్న… IAS శృతి శర్మ మార్క్ షీట్ చూశారా..?

2023 సివిల్స్ టాపర్ కంటే ఎక్కువ మార్కులు సంపాదించుకున్న… IAS శృతి శర్మ మార్క్ షీట్ చూశారా..?

by Mohana Priya

Ads

అన్ని పరీక్షల కంటే సివిల్స్ పరీక్ష చాలా కష్టం అని అంటారు. సివిల్స్ లో ర్యాంక్ సాధించాలి అంటే ఒక తపస్సు లాగా చదవాలి. ఎటువంటి వేరే ఆలోచనలు లేకుండా కేవలం సివిల్స్ మీద మాత్రమే దృష్టి పెట్టి కష్టపడాలి. ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా కూడా మార్కులు సరిగ్గా రాక ర్యాంక్ సరిగ్గా రాకుండా మెయిన్స్ కి సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు. అలా అని బాధపడకుండా మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించాలి. సివిల్స్ సాధించాలి అంటే పట్టుదల, టాలెంట్ తో పాటు ధైర్యం కూడా ఉండాలి. చాలా ఓపిక ఉంటేనే సివిల్స్ లో ర్యాంక్ సాధించగలుగుతారు. ఈ సంవత్సరం కూడా సివిల్స్ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Video Advertisement

ias shruti sharma marksheet

ఎంతో మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు. ఈ నేపథ్యంలో 2021లో సివిల్స్ లో ర్యాంక్ సాధించిన ఐఏఎస్ అధికారి శృతి శర్మ మార్కుల లిస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఇందులో టాపిక్ పరంగా మార్కులు ఉంటాయి. దాంతో పాటు రిటన్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్కులు, తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు కలిపి, మొత్తంగా ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కూడా ఇందులో ఉంటుంది. శృతి శర్మ మార్క్స్ షీట్ చూస్తే,

ఎస్సే (పేపర్-1) లో 132 మార్కులు,

జనరల్ స్టడీస్-1 (పేపర్-II) లో 135,

జనరల్ స్టడీస్-II (పేపర్ III) లో 121 మార్కులు సాధించారు.

జనరల్ స్టడీస్-III (పేపర్ IV) లో 139 మార్కులు సాధించారు.

జనరల్ స్టడీస్-IV (పేపర్ V) లో 112 మార్కులు.

ఆప్షనల్-I (చరిత్ర – పేపర్ VI) లో 155 మార్కులు.

ఆప్షనల్-II (చరిత్ర – పేపర్ VII) లో 138 మార్కులు సాధించారు.

మరొక పక్క ఈ సంవత్సరం, 2023 సివిల్స్ ఫలితాలు వచ్చాయి. అందులో ఎక్కువ మార్కులు సాధించిన ఆదిత్య శ్రీ వాస్తవ మార్క్స్ చూస్తే శృతి శర్మ కంటే కూడా తక్కువగా ఉన్నాయి. ఆదిత్య శ్రీ వాస్తవ సాధించిన మార్క్స్ చూస్తే,

ఎస్సే (పేపర్-1) 117 మార్కులు.

జనరల్ స్టడీస్-1 (పేపర్-II) లో 104 మార్కులు.

జనరల్ స్టడీస్-II (పేపర్ III) లో 132 మార్కులు సాధించారు.

జనరల్ స్టడీస్-III (పేపర్ IV) లో 95 మార్కులు.

జనరల్ స్టడీస్-IV (పేపర్ V) లో 143 మార్కులు.

ఆప్షనల్-I (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – పేపర్ VI) లో 148 మార్కులు.

ఆప్షనల్-II (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – పేపర్ VII) లో 160 మార్కులు సాధించారు.

ఇద్దరిదీ పోల్చి చూస్తే శృతి శర్మ ఎక్కువ మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 2021 లో శృతి శర్మ సివిల్స్ ర్యాంక్ సాధించారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ALSO READ : చీరకట్టులో ఎయిర్ పోర్ట్ కి వచ్చినందుకు ఆ మహిళ ఎగతాళి చేసింది…సుధామూర్తి గారి కౌంటర్ హైలైట్.!


End of Article

You may also like