దొంగని పట్టుకోవడం కోసం అనుకోకుండా ఒక పోలీస్ తప్పు చేస్తే..? ఈ సినిమా చూశారా..?

దొంగని పట్టుకోవడం కోసం అనుకోకుండా ఒక పోలీస్ తప్పు చేస్తే..? ఈ సినిమా చూశారా..?

by Harika

Ads

ఒక తప్పుడు పనులు చేసే దొంగ, అతనిని పట్టుకోడానికి కష్టపడి పోలీస్. ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం చాలా ప్రత్యేకమైన సినిమా. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా అప్పటి వరకు రాలేదు. వచ్చినా కూడా టేకింగ్ ఇంత బాగున్న సినిమాలు మాత్రం రాలేదు. ఈ సినిమా పేరు విక్రమ్ వేద. మాధవన్, విజయ్ సేతుపతి, శ్రద్ధ శ్రీనాథ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇంక కథ విషయానికి వస్తే, విక్రమ్ (మాధవన్) ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అతను వేద (విజయ్ సేతుపతి) ని పట్టుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ క్రమంలో విక్రమ్ ఒక తప్పు చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

Video Advertisement

movie with gripping concept

తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి సినిమా చూస్తున్నంత సేపు ఉంటుంది. సినిమా సాగుతున్నంతసేపు కూడా అలాంటి ఆసక్తి ఉండేలాగా చూడడం అనేది దర్శకులని ప్రశంసించాల్సిన విషయం. ఈ సినిమాకి పుష్కర్ – గాయత్రీ దర్శకత్వం వహించారు. 2017 లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఎవరు అనుకోని అంత పెద్ద విజయం ఈ సినిమా సాధించింది. ఈ సినిమాలో మాధవన్ నటన, విజయ సేతుపతి నటన సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇద్దరిలో ఎవరు మంచివారు కాదు. అలా అని ఎవరు చెడ్డవారు కాదు. ఇద్దరికీ సమానంగా పాత్రలు ఉంటాయి. అంతే సమానంగా ఇద్దరి పాత్రలని చూపించారు. ఈ సినిమాకి సామ్ సి ఎస్ అందించిన సంగీతం మరొక హైలైట్ అని అప్పుడు అందరూ అన్నారు.

ముఖ్యంగా ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. ఇదే సినిమాని హిందీలో సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్ తో రీమేక్ చేశారు. కానీ ఆ సినిమా తమిళ్ సినిమా సాధించిన అంత పెద్ద విజయం సాధించలేదు. కానీ అందరి నటనకి మంచి ప్రశంసలు వచ్చాయి. తెలుగులో కూడా రీమేక్ చేస్తారు అనే వార్తలు వచ్చాయి. కానీ అది ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలియదు. ఈ సినిమా తమిళ్ భాషలో జీ ఫైవ్ లో స్ట్రీమ్ అవుతోంది. హిందీ డబ్బింగ్ లో కూడా ఈ సినిమా ఉంది. ఈ సినిమాకి చాలా అవార్డులు వచ్చాయి. చాలా మంది ఈ సినిమా మీద ఇది ఆ సంవత్సరం వచ్చిన గొప్ప సినిమా అని కామెంట్స్ చేశారు.


End of Article

You may also like