హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తనీష్ హీరోగా నటించిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ప్రణీత హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ చిత్రం బాగానే ఆడింది. ఆ తరువాత సిద్దార్థ్ హీరోగా నటించిన ‘బావ’మూవీలో హీరోయిన్ గా చేసే అవకాశం కలిగింది.
పలు సినిమాలలో నటించిన ప్రణీత లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత తాజాగా భీమన అమావాస్య సందర్భంగా చేసిన పూజకు సంబంధించిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే గత ఏడాది ఇలాగే చేసిన ఫోటోకు ఆమె ట్రోలింగ్ కు గురి అయ్యింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రణీత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ మూవీతో ప్రణీతకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించినప్పటికీ ప్రణీతకు విజయం దక్కలేదు.
ఇక లాక్ డౌన్ సమయంలో బెంగళూరుకు చెందిన బిజినెస్ మెన్ నితిన్ రాజుని ప్రణీత పెళ్లి చేసుకుంది. ఆ తరువాత 2022 జూన్ లో ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి ప్రణీత అలాగే అందంగా ఉంది. ఇటీవల కాలంలో మునుపటిలా మారి, గ్లామర్ ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలో తరచుగా షేర్ చేస్తోంది. ప్రణీత గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది.
ప్రణీత సుభాష్ తన భర్త నితిన్ రాజుతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. భీమన అమావాస్య సందర్భంగా ప్రణీత తన భర్త పాదాలకు నేలపై కూర్చుని పూజ చేస్తోంది. ఈ ఫోటోకు మీకు ఇది తప్పుగా అనిపించి ఉండొచ్చు. కానీ హిందూ ధర్మంలో దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది అని కాప్షన్ ఇచ్చింది. గత ఏడాది ఇదే భీమన అమావాస్య సందర్భంగా చేసిన ప్రణీత తన భర్త పాదాలకు పూజ చేసిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆమె పై మీమ్స్, ట్రోలింగ్ జరిగింది.
Also Read: ఇలాంటి సమస్యల మీద కూడా సినిమాలు తీస్తారా..? ఈ సినిమా చూశారా..?

అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పటికే స్టార్‌కిడ్‌గా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమాలో భరతుడిగా నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. తాజాగా అల్లు అర్హ దేవర సినిమాలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర’ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వికపూర్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్హను హీరోయిన్ జాన్వీకపూర్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ విషయం గురించి స్వయంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ కి ఫోన్ చేసి మరి అడిగారట. దాంతో బన్నీ కూడా అంగీకరించినట్టు సమాచారం.
అల్లు అర్హ తన రెండవ సినిమాకే భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అర్హ నిమిషానికి 2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఇక ఈ మూవీలో అర్హ పాత్ర 10 నిమిషాలు ఉంటుందని, ఆ లెక్కన చూస్తే సుమారు అల్లు అర్హ ఇరవై లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అల్లు అర్హ రేంజ్ వేరు అని కామెంట్స్ చేస్తున్నారు.
1. బేబీ:
2. బుట్టబొమ్మ:
3. ఉప్పెన:
4. జూనియర్స్:
5. కొత్త బంగారు లోకం:
6. చిత్రం:
7. ఎటో వెళ్లిపోయింది మనసు:
8. జయం:
9. గంగోత్రి:
10. బస్ స్టాప్:
11. బాయ్స్:
12. నిర్మలా కాన్వెంట్:
13. ప్రేమిస్తే:
14. నువ్వు నేను:
15. సీతాకోక చిలుక:
రామ్ సంగయ్య దర్శకత్వంలో వచ్చిన ‘తందట్టి’ సినిమాలో రోహిణి, పశుపతి రామస్వామి, వివేక్ ప్రసన్న ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తమిళ మూవీ థియేటర్లలో జూన్ 23న రిలీజ్ అయ్యింది. తందట్టి తమిళ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీ మంచి వసూళ్లు సాధించి అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
ఇక ఈ మూవీ కథ విషయనికి వస్తే, వీరసుబ్రమణియన్ (పశుపతి) పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. 10 రోజుల్లో అతని రిటైర్మెంట్ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే కిడారిపట్టి అనే గ్రామంలోని తంగపొన్ను(రోహిణి) అనే వృద్ధురాలు కనిపించకుండా పోతుంది. ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. ఆమెను వెతికే పనిని వీర సుబ్రమణియన్‌కు అప్పగిస్తారు. అతను తంగపొన్ను కనిపెట్టాడా? ఆమె ఏం అయ్యారు? ఆమెను వెతికే క్రమంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే మిగతా కథ.
ఆస్తులు బంధాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఈ మూవీలో చక్కగా చూపించారు. ఒక వైపు నవ్విస్తూనే, దర్శకుడు సమాజానికి చురకలు అంటించాడు. ఊరిలోని సంబంధాలు, స్వార్థపూరితమైన మనసులు, ఆస్తి కోసం కన్నవారి పై పిల్లల కపట ప్రేమను అర్థమయ్యేలా చక్కగా మలిచాడు. ఆడియెన్స్ కథతో కనెక్ట్ అవుతారు. కొన్ని సన్నివేశాలు రియల్ లైఫ్ లో జరిగే సంఘటనలలా అనిపిస్తాయి. రోహిణి, పశుపతి తమ క్యారెక్టర్ల లో జీవించారు. మిగతా నటీనటులు ఎవరి పాత్రలకు తగిన విధంగా వారు నటించారు.
టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఎప్పుడూ లేనిది విచిత్రంగా మొదటిసారి టమాటాల దొంగతనాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొన్నటి దాకా షాపుల్లోని టమాటాలు దొంగలు ఎత్తుకెళ్లడం వినిపించింది. కానీ ప్రస్తుతం టమాటా దొంగలు రూటు మార్చి, టమాటా తోటల్నే లక్ష్యం చేసుకుంటున్నారు. గతంలో టమాటా పండించిన రైతులు భారీగా నష్టపోయేవారు. కిలో టమాటా రూపాయికి అమ్మేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సార్లు గిట్టుబాటు ధర రాలేదని కొందరు రైతులు కోపంతో టమాటాలను రోడ్ల పై పడేసిన సందర్భాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడా సీన్ అంతా రివర్స్ అయ్యింది. ఎన్నో ఏళ్ల తర్వాత టమాటాలు మంచి ధర పలుకుతుండడంతో రైతులు సంతోషంలో ఉన్నారు. టమాటా ధర పెరుగుదల వల్ల రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక రైతు టమాటాలను అమ్మి కోటీశ్వరుడు అయిన విషయం వైరల్ గా మారింది. ఇక టమాటా క్రేజ్ సోషల్ మీడియా దాకా చేరింది. టమాటా ధర పై జోక్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే కరీంనగర్ కుర్రోడు అనే ఇన్ స్టా పేజీలో ఒక వీడియో షేర్ చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369లోని సీన్ అది. బాలకృష్ణ టైమ్ మిషన్ లో భావిష్యత్తులోకి వెళ్ళినపుడు బ్రహ్మానందంకు అతని భార్య కాల్ చేసి ‘ఈ రోజూ టమాటాల చాలా చీప్ గా ఉన్నాయట. కిలో 1500 అంట, 2 కిలోలు తీసుకురండి అని చెప్తుంది. ఆ తరువాత అదుర్స్ మూవీలో బ్రహ్మానందం ‘ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది రా. చాలా సేపు సస్పెన్స్ తరువాత నాక్కుడా అర్ధం అయ్యింది’ అనే సీన్ వస్తుంది. ఇది చూసిన నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో నటుడు మనోజ్ అలియాస్ సూర్యతేజ్ ను ఇప్పటికే పోలీసులు కోర్టు ముందు హాజరు పరచడం, రిమాండ్‌లోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు షాకింగ్ విషయాలు ఉన్నాయి.
ఆ తరువాత విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఇద్దరు అప్పటి నుంచి వేరుగా ఉంటున్నారు. మానసిక సమస్యలతో, ఒత్తిడితో ఇబ్బంది పడే వారికి స్మిత కౌన్సిలింగ్ ఇస్తుండేదని, ఈ క్రమంలోనే యాక్టర్ మనోజ్ కు స్మితతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. సినిమా అవకాశాలు లేక డిప్రెషన్ లో ఉన్న మనోజ్, స్మిత దగ్గరికి కౌన్సిలింగ్‌కు వచ్చేవాడు. అలా వీరిద్దరి మధ్య పెరిగిన పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. వీరిద్దరు 3 సంవత్సరాలుగా పిల్లలతో కలిసి శామీర్ పేటలో ఉండే సెలబ్రిటీ విల్లాలో ఉంటున్నారు.
మనోజ్ తమన వేధిస్తున్నాడని స్మిత కుమారుడు సీడబ్ల్యూసీకి కంప్లైంట్ చేశాడు. సీడబ్ల్యూసీ వాళ్లు వారి తండ్రి సిద్ధార్థ్‌ను హైదరాబాద్ పిలిపించారు. సిద్ధార్థ్ దాస్ శనివారం పిల్లల కోసం సెలెబ్రిటీ విల్లాకు వెళ్ళాడు. సిద్ధార్థ్‌ను చూసిన స్మితా మనోజ్‌కి చెప్పడంతో ఆగ్రహించిన మనోజ్ ఏయిర్ గన్ తో సిద్ధార్థ్ పై కాల్పులు జరిపాడు. గన్ చూసి భయపడిన సిద్ధార్థ్ బయటికి వచ్చి, డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి మనోజ్‌ను అరెస్ట్ చేశారు. ఏయిర్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఏడాది అధిక శ్రావణమాసం జులై 18 నుండి ఆగస్టు 16 వరకు ఉంటుంది. ఇక నిజ శ్రావణం ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 15 వరకు నిజ శ్రావణ మాసం ఉంటుంది. ఇక అధికమాసంను శూన్య మాసం అని కూడా పిలుస్తారు. అధిక మాసంలో ముహూర్తాలు పెట్టి చేసే శుభకార్యాలు కొత్త షాపులను ప్రారంభించడం, గృహ ప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, పెళ్ళిళ్ళు, ఉపనయనం, సీమాంతం, వాస్తు పూజల వంటివి చేయకూడదని అంటారు.
ఇక ఈ నెలలో చేయాల్సిన వాటిని తప్పనిసరిగా చేయాలి. అవి ఏమిటంటే పితృకార్యాలు తప్పనిసరిగా చేయాలని పండితులు చెబుతున్నారు. ఆబ్దికం వంటి వాటిని మానకుండా బ్రహ్మణుడికి సమర్పించాల్సినవి చేయాలి. నిజ శ్రావణ మాసంలో సరి అయిన రీతిలో ఆబ్దికంను జరిపించాలి. అధిక మాసం కాబట్టి ఈ నెలలో ఏం చేసిన అధిక ఫలితాన్ని పొందుతారు.
కాబట్టి జపాలు, తపాలు, నిత్యం చేసే పూజలు అధికంగా చేయడం. పారాయణం, తీర్థయాత్రలు, నది స్నానాలు, సముద్ర స్నానాలు వంటి పుణ్యకార్యాలను తప్పనిసరిగా చేసినట్లయితే మామూలు రోజుల కన్నా అధికమైన ఫలితం ఉంటుందని చెబుతారు.నిత్య పూజలు చేసేవారు మానకుండా అధిక మాసంలో కూడా కొనసాగించాలి. వరలక్ష్మి వ్రతం ను తప్పని సరిగా అధికమాసంలో చేసుకోవాలని లేదు. నిజ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.
తాజాగా రిలీజ్ అయిన బేబీ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టినట్టు తెలుస్తోంది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎస్.కె.ఎన్ ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పైన నిర్మించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా వైష్ణవి హీరోయిన్ గా నటించింది. యాక్టర్ విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించాడు. ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఆనంద్ దేవరకొండ ఈ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడే ఛాన్స్ ఉందని టాక్. బేబీ హిట్ అవడంలో కీలక పాత్రను హీరోయిన్ వైష్ణవి చైతన్య పోషించింది. ఆమెకు మొదటి మూవీ అయినా, ఎక్కడ తన యాక్టింగ్ లో ఫ్రెషర్ అనే భావన కనిపించలేదు. అద్భుతంగా నటించిదని టాక్. ఇక ఈ మూవీలో వైష్ణవి చైతన్య స్నేహితురాలి పాత్రలో కుసుమ డేగలమర్రి నటించింది.
కుసుమ డేగలమర్రి నటి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మరియు మోడెల్. ఆమెకు తెలుగులో బేబీ మొదటి చిత్రం. కుసుమ బిగ్ బాస్ హైదరాబాదీ స్పూఫ్ సీజన్ 1 అని యూట్యూబ్ లో ప్రసారం అయ్యే వీడియోస్ లో నటించింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆమె ప్రకటనలకి, షూటింగ్ కి సంబంధించిన వీడియోలని, ఫోటోలను తరచుగా షేర్ చేస్తుంటుంది. ఆమె ఇన్ స్టా ఖాతాకు 12 వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు.
చాంద్రమానంలో ప్రతి నెల అవధిగా అమవాస్యను పరిగణిస్తే, సూర్యమనంలో పౌర్ణమిని నెల అవధిగా తీసుకుంటారు. సౌరమానానికి, చాంద్రమానానికి మధ్య ఏడాదిలో పదకొండు రోజుల తేడా ఏర్పడుతుంది. ఈ తేడా సౌరమానం, చాంద్రమానంలో ప్రతీ 4 ఏళ్లలో 31 రోజులు అవుతుంది. అలా అధిక మాసంగా ఏర్పడును. 32 నెలలకు ఒకసారి ఏర్పడే మాసాన్ని అధిక మాసం అని అంటారు.
అధిక మాసము శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన మాసం. అందుకే అధికమాసానికి పురుషోత్తమ మాసమని కూడా పేరు వచ్చినట్లు చెప్పబడినది. విష్ణుమూర్తి అధిక మాసంలో పురుషోత్తమ పేరుతో ఇంటిఇంటికి తిరుగుతుంటాడు. అందువల్ల ఈ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించాలని, వేరే శుభకార్యాలు చేయకూడదని బ్రహ్మదేవుడు నిషేధించాడు. ఒకవేళ అలా జరుపుకుంటే విష్ణుమూర్తిని పూజించడం మాని సొంతకార్యాలు చేసుకున్న పాపానికి గురై భ్రష్టులవుతారని బ్రహ్మదేవుడు అజ్ఞాపించారని చెబుతారు.
2023లో జూలై 18 నుండి అధిక మాసం మొదలు అవుతుంది. ఈసారి అధికంగా శ్రావణమాసం రానుంది. సాధారణంగా ఆషాఢం మాసం పూర్తి అవగానే శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు చేస్తారు. అయితే ఈసారి అసలైన శ్రావణ మాసం 2023 ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకుఅని జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారు.
కాలిఫోర్నియాలో జులై 20న జరుగనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ ఈవెంట్ అడుగుపెట్టనున్న మొదటి ఇండియన్ మూవీగా ‘ప్రాజెక్ట్ కే’ చరిత్ర సృష్టించబోతుంది. ఈ వేడుకలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్-కే అర్ధం ఏమిటనే ఇంట్రెస్ట్ అందరిలోనూ మరింతగా పెరిగింది. అది మాత్రమే కాకుండా మూవీ మేకర్స్ సైతం ప్రాజెక్ట్-కే అంటే తెలుసుకోవాలని ఉందా? అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. దీంతో ఈ మూవీ టైటిల్ ఇదే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్ట్-కే అంటే ముందుగా కర్ణ, కల్కీ అనే టైటిల్స్ వైరల్ గా మారాయి. కానీ ప్రస్తుతం మాత్రం ప్రాజెక్ట్ కే మూవీకి ‘కాలచక్ర’ అని ఫైనల్ చేశారని వినిపిస్తోంది.
సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ నేపథ్యం బేస్ చేసుకుని ఈ మూవీ తెరకెక్కిస్తుండడంతో ‘కాలచక్ర’ అనే టైటిల్ ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. మరి టైటిల్ ఇదేనా కాదో తెలియాలంటే జులై 20 వరకు వేచి చూడాల్సిందే. ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ ఈవెంట్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోనే, నాగ్ అశ్విన్ పాల్గొననున్నారని తెలుస్తోంది.