ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ “ప్రాజెక్ట్‌ K” టైటిల్‌ ఇదేనా..?

ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ “ప్రాజెక్ట్‌ K” టైటిల్‌ ఇదేనా..?

by kavitha

Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్‌- కే’. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Video Advertisement

‘ప్రాజెక్ట్‌- కే’ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ ను ‘శాన్‌ డియాగో కామిక్‌–కాన్‌ 2023’ ఈవెంట్ లో ఫస్ట్ లుక్ రీలజ్ చేయనున్నారు. దాంతో పాటుగా ఈ మూవీ టైటిల్ ను రివీల్‌ చేయబోతున్నారని సమాచారం. అయితే ప్రాజెక్ట్‌- కే టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
What-is-Project-Kకాలిఫోర్నియాలో జులై 20న జరుగనున్న ‘శాన్‌ డియాగో కామిక్‌–కాన్‌ 2023’ ఈవెంట్ అడుగుపెట్టనున్న మొదటి ఇండియన్ మూవీగా ‘ప్రాజెక్ట్ కే’ చరిత్ర సృష్టించబోతుంది. ఈ వేడుకలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్‌హాసన్, అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్‌-కే అర్ధం ఏమిటనే ఇంట్రెస్ట్ అందరిలోనూ మరింతగా పెరిగింది. అది మాత్రమే కాకుండా మూవీ మేకర్స్‌ సైతం ప్రాజెక్ట్‌-కే అంటే తెలుసుకోవాలని ఉందా? అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. దీంతో  ఈ మూవీ టైటిల్ ఇదే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్ట్‌-కే అంటే ముందుగా కర్ణ, కల్కీ అనే టైటిల్స్  వైరల్‌ గా మారాయి. కానీ ప్రస్తుతం మాత్రం ప్రాజెక్ట్‌ కే మూవీకి ‘కాలచక్ర’ అని ఫైనల్ చేశారని వినిపిస్తోంది.
సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ నేపథ్యం బేస్‌ చేసుకుని ఈ మూవీ తెరకెక్కిస్తుండడంతో ‘కాలచక్ర’ అనే టైటిల్‌ ఖరారు చేశారని టాక్‌ వినిపిస్తోంది. మరి టైటిల్ ఇదేనా కాదో తెలియాలంటే జులై 20 వరకు వేచి చూడాల్సిందే. ‘శాన్‌ డియాగో కామిక్‌–కాన్‌ 2023’ ఈవెంట్ లో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోనే, నాగ్‌ అశ్విన్‌ పాల్గొననున్నారని తెలుస్తోంది.

Also Read: “హిట్ టాక్ వస్తే క్రేజ్ ఈ రేంజ్ లో ఉందా..?” అంటూ… వైష్ణవి చైతన్య “బేబీ” రిలీజ్‌పై 15 మీమ్స్..!

 


End of Article

You may also like