ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అలోక్ మౌర్య, జ్యోతిల సంఘటన మరవక ముందే అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. అది కూడా ఎక్కడో కాదు ఉత్తరప్రదేశ్ లోనే జరగడం యాదృచ్ఛికం. గవర్నమెంట్ జాబ్ చేయడమే తన లక్ష్యం అని చెప్పిన భార్యకు భర్త కష్టపడి ప్రిపరేషన్ ఇప్పించడం వల్ల ఆమె సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ జాబ్ ను సాధించింది.
కానీ ఆ తర్వాత మరొకరితో రిలేషన్ పెట్టుకుని, తన మీద వరకట్న వేధింపుల కేసు పెట్టి, జైలుకు పంపించిందని అలోక్ మౌర్య చెప్పడం తెలిసిందే. ఇందులో వాస్తవాలు ఏవైనా తాజాగా అలాంటి ఘటనే మరోకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అలోక్ మౌర్య, జ్యోతి మౌర్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ తరహ ఘటన యూపీలోని కాన్పూరులో చోటు చేసుకుంది. కాన్పూరులో నివసించే అర్జున్ సింగ్, సవిత మౌర్యలు భార్యాభర్తలు. ఈ జంటకి 2017లో పెళ్లి జరిగింది. భార్యకు చదువు పట్ల ఉన్న ఇష్టాన్ని గుర్తించిన అర్జున్ సింగ్, సవిత మౌర్యను అప్పులు చేసి మరి నర్సింగ్ చదివించాడు.
నర్సింగ్ పూర్తి అయిన తరువాత సవిత మౌర్యకు మెడికల్ డిపార్ట్మెంట్ లోనే గవర్నమెంట్ కాంట్రాక్టు జాబ్ వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరిన రెండు మూడు నెలల తరువాత సవిత మౌర్య ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. ఇక అప్పటి నుండి భర్త అర్జున్ సింగ్ ను దూరం పెట్టడం ప్రారంభించింది. ఆమె మరో గదిలో నిద్రపోతుండడంతో అర్జున్ సింగ్ భార్యను నిలదీశాడు. దాంతో సవిత భర్తను నల్లగా, పొట్టిగా ఉన్నవంటూ, నీలాంటి భర్తతో ఉండలేనని చెప్పడంతో అర్జున్ షాక్ అయ్యాడు.
సవిత అర్జున్ సింగ్ నుండి విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. కానీ అర్జున్ సింగ్ మాత్రం తనకు భార్య సవిత కావాలని పోరాడుతున్నారు. భార్య చదువుకు 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని, అప్పును కూలీ పనులు చేసుకుంటూ తీరుస్తున్నానని కన్నీరు పెట్టుకున్నాడు. తనకు న్యాయం కావాలని అర్జున్ సింగ్ వేడుకుంటున్నాడు.
Also Read: విచిత్ర పరిచయం, నలుగురు పిల్లలు, ఇల్లు అమ్మేసి మరి..? వీరి ప్రేమ కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

వారసుడు మూవీ తరువాత స్టార్ హీరో విజయ్ దళపతి మరో తెలుగు దర్శకుడితో చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ దర్శకుడే గోపీచంద్ మలినేని. ఈ ఏడాది వీరసింహారెడ్డితో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ హీరో విజయ్ ను కలిసి కథ వినిపించించారని, మొదటి సిట్టింగ్‌లోనే విజయ్ కథను ఓకే చేశారని టాక్ వచ్చింది. గోపీచంద్ చెప్పిన స్టోరీ విజయ్‌కి బాగా నచ్చిందని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దాంతో వీరిద్దరి కాంబో పై అధికారిక ప్రకటన వస్తుందని అంతా భావించారు.
కానీ, అదే టైంలో విజయ్ దళపతి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో మూవీని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. గోపీచంద్ తర్వాత డైరెక్టర్ వెంకట్ ప్రభు విజయ్‌కి స్టోరి వినిపించారు. దాంతో గోపీచంద్ చెప్పిన స్టోరి పక్కన పెట్టారు. కారణం ఏమిటా అని ఆరా తీసిన తమిళ మీడియా వార్తల ప్రకారం, వచ్చే రెండు ఏళ్లలో విజయ్ దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు.
వెంకట్ ప్రభు చెప్పిన కథలో లోకల్ కంటెంట్ మరియు స్థానిక రాజకీయాల గురించి ప్రస్తావన ఉంటుందట. అందుకే ఈ కథను ఒకే చేశారని, ఈ మూవీని వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ చేసి, ఆ తర్వాత పాలిటిక్స్ వైపు వస్తారని అంటున్నారు. ఇటీవల విజయ్ మూడేళ్ళ పాటు సినిమాలకు విరామం ఇస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, దీపిక పదుకొనే, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా జవాన్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవించందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రివ్యూ రిలీజ్ అయ్యింది. 2 నిమిషాల 12సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోని జాగ్రత్తగా, స్టోరీ అంతగా అర్ధమయ్యే అవకాశం ఇవ్వకుండా గ్రాండ్ విజువల్స్ తో ఎడిట్ చేశారు. షారుఖ్ బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ యూట్యూబ్ ఛానల్ లో అన్ని లాంగ్వేజెస్ కి సంబంధించిన వెర్షన్లు పెట్టారు.
‘ఎవరు నేను, ఏవరిని కాను, తెలియదు. తల్లికిచ్చిన మాట కావచ్చు. నేరవేరని లక్ష్యం కావచ్చు’ అంటూ మొదలైన ప్రివ్యూ ఆద్యంతం షారుక్ డైలాగ్స్, లుక్స్, యాక్షన్ తో ఆకట్టుకుంది. ఇందులో షారుక్ పోలీస్ డ్రెస్ లో, ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు. ఇక చివర్లో గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచారు. ‘ఇది ఆరంభం మాత్రమే’ మరియు ‘నేను విలన్ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేడు’ అని చెప్పే షారుక్ డైలాగ్స్ ప్రివ్యూకి హైలైట్ గా నిలిచాయి.
విజయ్ సేతుపతి లుక్ బాగుంది. అయితే ఆయన పాత్రని రివీల్ చేయలేదు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె యాక్షన్ షాట్ బాగుంది. స్టైలిష్ ఆఫీసర్ గా నయనతారను చూపించారు. ఇది ఇలా ఉంటే జవాన్ ట్రైలర్ ప్రివ్యూ పై సోషల్ మీడియాలో లు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
అయితే వీరసింహారెడ్డి సమయంలోనే గోపీచంద్ మలినేని సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్టోరీ చెప్పడం జరిగిందట. గోపీచంద్ తరువాతి మూవీ మైత్రి వారితోనే చేయాలి. మహేష్ బాబు వద్ద మైత్రి మేకర్స్ అడ్వాన్స్ ఉంది. అయితే మహేష్ బాబు కాల్ షీట్స్ మాత్రం ఇప్పట్లో ఖాళీ లేకపోవడంతో గోపీచంద్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేయాలని ప్రయత్నించాడు. ఎందుకంటే విజయ్ దగ్గర కూడా మైత్రి మేకర్స్ అడ్వాన్స్ ఉంది. కానీ అతను ఒప్పుకోలేదు.
చివరకు గోపీచంద్ మలినేని తనకు హ్యట్రిక్ హిట్స్ ఇచ్చిన రవితేజతోనే ఫిక్స్ అయ్యాడు. గోపీచంద్ మలినేని తరువాతి సినిమా రవితేజతో అని మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు విజయం సాధించాయి. దాంతో వీరి కాంబో పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
కొత్త మూవీ కానీ, ట్రైలర్, పోస్టర్, టీజర్ ఇలా ఏది రిలీజ్ అయిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించే నెటిజెన్లు ఈ ప్రివ్యూలో ఉన్న షారుక్ లుక్స్, సీన్స్ వేరే సినిమాల నుండి తీసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా జవాన్ ట్రైలర్ ప్రివ్యూలోని లుక్స్ ను ఎక్కడి నుండి తీసుకున్నారో ఆ ఫోటోలను కలిపి షేర్ చేస్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు.
బాహుబలి మూవీలో రమ్యకృష్ణ నీటిలో మునుగుతూ చిన్న బాబును రెండు చేతులతో ఎత్తిపట్టుకుంటుంది. జవాన్ ప్రివ్యూలో అలాంటి సీన్ కనిపించింది. మరో సీన్ బైక్స్ పై వచ్చే సీన్, అజిత్ నటించిన వలిమైలో ఇలాంటి సీన్ ఉంటుంది. అపరిచితుడు విక్రమ్ లుక్, హాలీవుడ్ డార్క్ మ్యాన్ మరియు డార్క్ నైట్ సినిమాలలోని లుక్, శివాజీ మూవీలో రజనీకాంత్ గుండుతో కనిపిస్తాడు. అచ్చం అలాగే ట్రైలర్ ప్రివ్యూ చివర్లో లుక్ లో అలాంటి లుక్స్ లో షారుక్ కనిపించాడు. దాంతో నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సినిమాలో ఇన్ని పెట్టరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్తూ, ‘ఈ సంవత్సరం లోపం లేకుండా పూజలు అందుకుని, సంతోషంగా ఉన్నాను. కొంచెం ఆలస్యం అయినా వర్షాలు పడతాయని, అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, భయపడవద్దని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 5 వారాల పాటు ముత్తైదులందరూ నన్ను భక్తిశ్రద్ధలతో పూజించుకోవాలి. నా దగ్గరికి వచ్చిన వారిని క్షేమంగా చుసుకునే భారం నాది. అయిదు వారాల పాటు సాక పోయండి. టెంకాయలను కొట్టి, నైవేద్యాలను సమర్పించాలి.
గతేడాది నాకు మాటిచ్చి ఎందుకు మరిచిపోయారు. మీకు కావాల్సిన బలాన్ని ఇచ్చాను. మీతోనే ఉంటాను. ఏది బయట పెట్టాలో ఏది బయటపెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. అన్నిటినీ కడుపులో దాచుకుంటాను’ అని స్వర్ణలత పేర్కొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యవాణి వినడం కోసం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. రంగం కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
బోనాల వేడుకలో భాగంగా ఉజ్జయిని మహంకాళి గుడికి లక్షలాది మంది భక్తులు వచ్చారని, రాత్రీ సమయంలో కూడా దర్శనాలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అనేక పార్టీల నాయకులు ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారని వెల్లడించారు. భవిష్యవాణిలో అమ్మవారు బోనాలు వేడుక బాగా జరిగిందని చెప్పడం ఆనందకరం అని తెలిపారు. రంగం భవిష్యవాణి నేపథ్యంలో ఆలయంలో భక్తులకు మహంకాళి అమ్మవారి దర్శనం నిలిపివేశారు.
పాకిస్థాన్ మహిళ సీమా గులామ్ హైదర్ కు నోయిడాకు చెందిన సచిన్‌కు పబ్జీ గేమ్ ద్వారా పరిచయం కలిగింది. అయితే మహిళకు అప్పటికే పెళ్లి జరిగి, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. సీమా, సచిన్ పబ్జీలో నిత్యం చాటింగ్ చేసేవారు. వీరి పరిచయం తరువాత ప్రేమగా మారింది. దాంతో ప్రియుడు కోసం పెళ్లి చేసుకున్న భర్తను విడిచి పెట్టేందుకు సైతం సిద్ధ పడింది.
సీమా గులామ్ హైదర్ తన నలుగురు పిల్లలను తీసుకుని సచిన్ నివసించే ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణం అయ్యింది. పాకిస్తాన్ నుండి నేపాల్ మీదుగా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించి, ఉత్తరప్రదేశ్ చేరుకుంది. బస్సులో గ్రేటర్ నోయిడాకు వచ్చింది. ఆ తరువాత సచిన్ అక్కడే ఒక ఇల్లు రెంట్ కు తీసుకుని జీవించడం మొదలు పెట్టారు.
అయితే పాకిస్థాన్ మహిళ అక్రమంగా జీవిస్తున్నట్టు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సచిన్, సీమాను అదుపులోకి తీసుకున్నారు. తమకు కోర్టు పెళ్లి జరిగిందని, నలుగురు పిల్లలున్నట్లుగా వారు చెప్పారని అద్దెకు ఇల్లు ఇచ్చిన ఓనర్ బ్రిజేష్ పోలీసులకు వెల్లడించారు. అయితే సీమా కట్టు, బొట్టు చూస్తే, ఆమె పాకిస్తాన్ మహిళ అనే సందేహం రాలేదని అన్నారు.
రెండు పార్టులుగా ప్లాన్ చేసిన పుష్ప ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ టైటిల్ తో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. కలెక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా అల్లు అర్జున్ లుక్, యాక్షన్, సాంగ్స్, హీరో మేనరిజమ్ లాంటివన్నీ బాగా పాపులర్ అయ్యాయి. పుష్ప ది రైజ్ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ఐటమ్ సాంగ్ లో నటించింది. ‘ఊ అంటావా మావ’సాంగ్ తో సమంత మెప్పించింది. అలాగే ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే.
ఇక ఇప్పుడు ‘పుష్ప 2 ది రూల్’లో ఊ అంటావా సాంగ్ ను మించే విధంగా ఐటెం సాంగ్ ను సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎప్పటిలాగానే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో పుష్ప 2 మూవీలోని ఐటమ్ సాంగ్‌కి మంచి ట్యూన్ ఇచ్చారని, ఆ సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా నర్తించనుందని కొన్ని రోజుల ముందు టాక్ వచ్చింది. అయితే తాజాగా పుష్ప 2 మూవీ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే ఐటెమ్ సాంగ్ చేయడం కోసం ఊర్వశీ రౌతేలా రూ.6 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు డిఫరెంట్ సినిమాలలో నటిస్తూ, ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. కానీ కొంత కాలంగా ఆయన నటించిన సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణు ‘సామజవరగమన’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ఎలాంటి అంచలనాలు లేని ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, సీనియర్ నరేష్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ తో ఉన్న ఈ మూవీ ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. ఇక ఈ మూవీ శ్రీవిష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ముందుగా అనుకున్న హీరో శ్రీవిష్ణు కాదంట. యంగ్ హీరో సందీప్ కిషన్ అట. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ మూవీని సందీప్ తో చేయాలని అనుకుంటే ఆ సమయంలో సందీప్ మైఖేల్ మూవీతో బిజీగా ఉండి, ఈ సినిమాకి నో చెప్పారట. అలా ఈ సినిమా శ్రీవిష్ణు దగ్గరికి వచ్చిందని తెలుస్తోంది. సందీప్ ఒక సూపర్ హిట్ సినిమాను ను మిస్ అయ్యాడు.
బిహార్ రాష్ట్రంలోని నవాడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవాడలో ఒక గ్రామానికి చెందిన యువకుడికి పెళ్లి జరిగింది. కానీ అతని భార్య అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో పనిమీద ఒక రోజు బయటకు వెళ్లిన భర్త రాత్రికి ఇంటికి రాలేదు. దాంతో ఆ భార్య ఆమె ప్రియుడి దగ్గరికి వెళ్లింది.
ఆమె వెళ్ళడం చూసిన స్థానికులు మరియు ప్రియుడి బంధువులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, చెట్టుకు కట్టేసికొట్టారు. తరువాతి రోజు ఊరిలోని గ్రామ పెద్దలందరు కలిసి పంచాయతీ పెట్టి, వారిద్దరినీ ఆ గ్రామం నుంచి బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు. కానీ ఈ విషయం తెలిసి తిరిగి వచ్చిన ఆ యువతి భర్త, భార్యను ఏమి అనకుండా, కోపం తెచ్చుకోకుండా భార్యను, ఆమె ప్రియుడిని గుడికి తీసుకువెళ్లాడు.
ఆ తరువాత వారిద్దరికీ దండలు మార్పించి, వివాహం జరిపించాడు. ఈ సంఘటన చూసిన వారందరూ ఆశ్చర్య పోయారు. కొంత మంది అయితే ఆ భర్త అలా చేసినందుకు అతడిని తిట్టారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.