ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వాటెండ్ హీరోయిన్ ఎవరంటే శ్రీలీల పేరు వినిపిస్తుంది. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత హీరో రవితేజతో చేసిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఈ మూవీ హిట్ తరువాత టాలీవుడ్ లో శ్రీలీలకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. దాంతో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించేందుకు శ్రీలీల సిద్ధమయ్యింది. జూన్ 14 శ్రీలీల బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల నుండి ఫస్ట్ లుక్స్ విడుదల అయ్యాయి. వాటిపై తాజాగా నెట్టింట్లో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చక్కగా తెలుగులో మాట్లాడడం, డ్యాన్స్ బాగా చేస్తుండడంతో యంగ్ హీరోయిన్ శ్రీలీల పై దృష్టి పడింది. ధమాకా హిట్ తో టాలీవుడ్ లో ఈ బ్యూటీకి ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ నటిస్తోంది. ఈ రోజు (జూన్ 14) శ్రీలీల పుట్టినరోజు కావడంతో ఆమె నటిస్తోన్న చిత్రాల నుండి వరుసగా ఫస్ట్ లుక్స్ విడుదల అయ్యాయి. ఆమె ప్రస్తుతం పది సినిమాలలో నటిస్తోంది.
వాటిలో సుమారు 8 చిత్రాలు ప్రకటించారు. వాటిలో ప్రస్తుతం 6 సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. కొన్ని సినిమాలు త్వరలో షూటింగ్ మొదలవనుంది. దీంతో శ్రీలీల బిజీ బిజీగా ఉంది. ఈరోజు ఆమె బర్త్ డే కావడంతో ట్విట్టర్ అంతా శ్రీలీల పోస్టర్స్ తో ట్రెండ్ అవుతున్నాయి.
ఆమె నటిస్తోన్న మొత్తం సినిమాలను చూస్తే పంజా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, బాలకృష్ణతో భగవంత్ కేసరి, మహేష్ బాబు గుంటూరు కారం, డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని మూవీలో నటిస్తోంది. అలాగే ఆహా ఓటీటీ మూవీ కోసం అల్లు అర్జున్ సినిమాలో, నితిన్ కొత్త చిత్రంలో శ్రీలీల నటిస్తోంది. ఇక ఇన్ని సినిమాలలో నటిస్తున్న శ్రీలీల మూవీ పోస్టర్స్ పై నెట్టింట్లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
Also Read: “లావణ్య త్రిపాఠి” గురించి అల్లు అరవింద్ కంటే ముందే మరొకరు చెప్పేసారుగా..? ఎవరంటే..?

కొన్నేళ్ళ నుండి ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జూన్ 9న గ్రాండ్ గా నాగబాబు నివాసంలో జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబాలు హాజరు అయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే వీరి వివాహం జరుగనుంది.
వీరి ఎంగేజ్మెంట్ తరువాత అల్లు అరవింద్ చావు కబురు చల్లగా సినిమా ఈవెంట్లో లావణ్య గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే పదేళ్ళ క్రితమే ఒక సినిమాలో లావణ్య పెళ్లి గురించి చెప్పారని ఒక వీడియో తాజాగా వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
ఈ చిత్రంలో ఒక సీన్ లో లావణ్య త్రిపాఠిని పిల్లలు నీ పెళ్లికి చిరంజీవి వస్తాడట నిజమేనా అని అడుగుతారు. అప్పుడు లావణ్య వారితో అవును అంటుంది. ఆ సినిమాలో చెప్పినట్టుగానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలపెళ్లికి మెగాస్టార్ చిరంజీవి వస్తాడనే విషయం తెలిసిందే. వరుణ్, లావణ్యల ఎంగేజ్మెంట్ కూడా చిరంజీవి హాజరు అయ్యారు.
పురాణ గాథలను, ఇతిహాసాలను మూవీగా తెరకెక్కించడం అంటే ఆ డైరెక్టర్ కి కత్తిమీద సాములాంటిదే. స్టోరీలో ఎలాంటి మార్పులు చేసినా చరిత్రకారుల విమర్శల ఎదరోకోవాల్సి వస్తుంది. అలా అనుకుని ఇంట్రెస్టింగ్ చూపించకపోతే ఆడియెన్స్ ను మెప్పించలేరు. అందువల్ల ఇటువంటి కథలను ఎంచుకునే ముందు దర్శకులు ఎక్కువగా ఆలోచిస్తారు. ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన డైరెక్టర్లు మాత్రమే ఇలాంటి సినిమాలను తెరకెక్కిస్తారు. అయితే ఆదిపురుష్ తీసిన దర్శకుడు 2 చిత్రాలను తీసిన అనుభవంతోనే భారీ బడ్జెట్‌తో ‘ఆదిపురుష్’ ను తెరకెక్కించాడు.
ఓంరౌత్ ముంబైలో పుట్టి, పెరిగారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఓంరౌత్ తాత డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ మరియు ఎడిటర్. అందువల్ల ఓంరౌత్‌కు సినిమా పై ఆసక్తి పెరిగింది. దీనికోసం తన చదువు పూర్తయ్యాక, న్యూయార్క్‌లో సిని ఫీల్డ్ కు చెందిన కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. రచయితగా, దర్శకుడిగా కొన్నాళ్ల పాటు ఎమ్‌టీవీ నెట్‌వర్క్‌లో వర్క్ చేశాడు. హాంటెడ్-3డీ, సిటీ ఆఫ్ గోల్డ్ సినిమాలకు నిర్మాతగా చేశారు.
2015 లో లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్ అనే మరాఠీ సినిమాతో ఓంరౌత్ డైరెక్టర్ గా మారాడు. డైరెక్టర్ గా మొదటి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2020లో ఓంరౌత్ రెండో సినిమా ‘తానాజీ ‘ తెరకెక్కించారు. ఈ చిత్రంతో ఓంరౌత్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ఇక మూడవ సినిమా రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తెరకెక్కించారు. ట్రైలర్ తో ఈసినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తెలుగు సిని పరిశ్రమలో లెజెండరీ నటుడిగా వెలుగోందారు సీనియర్ ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉండడటంలో ఆయన పాత్ర ఎంతగానో ఉంది. అలాంటి ఎన్టీఆర్ సినిమాలలో చేయని పాత్ర అంటూ లేదు. తన చిత్రాలతో తెలుగువారిని అలరించారు. సూపర్ హీరోల సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. కానీ సీనియర్ ఎన్టీఆర్ 1980 లోనే ఆ తరహా చిత్రంలో నటించారు. ఈ సినిమా గురించి ఇప్పటివారికి అంతగా తెలియక పోవచ్చు.
సూపర్ మెన్ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్, జయప్రద హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి వి.మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. 1980 లో వచ్చిన సూపర్ మేన్ సినిమాను ఆర్. గోపాల్ నిర్మించాడు. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఫిక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో జయమాలిని, కైకాల సత్యనారాయణ, పండరి బాయి ముఖ్యపాత్రలలో నటించారు. తన కుటుంబాన్ని హత్యమార్చిన వారిని వెతికి పట్టుకోవాలనుకునే అబ్బాయి. అంజనేయస్వామిని ప్రార్ధిస్తాడు.
ఆంజనేయుడి ఆశీర్వాదాలతో, అతడు అతీంద్రియ శక్తులను పొంది సూపర్ మేన్ గా మారుతాడు. అయితే అప్పటిదాకా ఎన్నో అద్భుత పాత్రలను పోషించిన ఎన్టీఆర్ కి ఆపాత్ర అంతగా నప్పలేదని, వయసురీత్యా ఆయన సూపర్ మేన్ గా సెట్ అవలేదని టాక్. ఇప్పటివారికి ఆ మూవీని చూసినప్పుడు అలానే అనిపించవచ్చు. ఈ సినిమాలోని పాటలు ఆకట్టుకున్నాయి.
అంబటి రాయుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హెచ్‌సీఏలో తన చిన్నప్పటి నుండే పాలిటిక్స్ మొదలు అయ్యాయని అన్నారు. శివలాల్ యాదవ్ తన కొడుకు అర్జున్ యాదవ్‌ను భారత జట్టుకు ఆడించాలని తనను ఇబ్బంది పెట్టారని రాయుడు అన్నారు. దానికి కారణం అర్జున్ యాదవ్ కన్నా తాను బాగా ఆడుతుండటం వల్ల అడ్డంకిగా ఉన్న తనను తొలగించెందుకు ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో తనకు 17 ఏళ్లు అని, అందువల్ల అర్జున్ యాదవ్ భారత జట్టుకు త్వరగా సెలెక్ట్ అవ్వాలని కోరుకునేవాడినని తెలిపారు. అయితే భారత్‌కు ఆడటం అర్జున్ యాదవ్ వల్ల కాలేదని అన్నారు. ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నా చిన్నప్పుడే క్యాన్సర్ ప్రారంభం అయ్యిందని, ప్రస్తుతం అది 4 వ స్టేజ్‌కు చేరిందని అన్నారు. బీసీసీఐ కల్పించుకుంటే పరిస్థితి మారుతుందని అన్నారు.
2003-04లో భారత్ -ఏకి బాగా ఆడాను. అయితే 2004లో మారిన సెలక్షన్ కమిటీలో శివలాల్ యాదవ్ సన్నిహితులు వచ్చారని, ఇక అక్కడి నుంచి తన కెరీర్ కు బ్రేక్ పడిందని అన్నారు. తనను ఎందుకు సెలెక్ట్ చేయలేదని అడగటంతో 4 ఏళ్ల పాటు తనతో ఎవరిని మాట్లాడనీయలేదని అన్నారు. తనను మానసికంగా కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారని చెప్పాడు. బీసీసీఐ మేనేజ్మెంట్లో ఉన్న శివలాల్ యాదవ్ వల్లే తనను వరల్డ్ కప్ 2019 కి ఎంపిక చేయలేదని అన్నాడు. శివలాల్ యాదవ్ వల్లే తన కెరీర్ పోయిందని అంబటి రాయుడు చెప్పారు.
1.షాంఘై మాగ్లేవ్ చైనా:

4. అల్స్టోమ్ అవెలియాAGV -ఇటలీ:
5. సిమెన్స్ వెలారో E/AVS 103-స్పెయిన్:
6. షింకన్సెన్ హయబుసా E5 సిరీస్ (జపాన్):
7. డ్యుయిష్ బాన్- జర్మనీ:
8. కోరైల్ KTX – దక్షిణ కొరియా:
9. టీజీవి (TGV) డ్యూప్లెక్స్ -ఫ్రాన్స్:
10. టాల్గో 350-స్పెయిన్:
పురుషుల అనుమతి:
అందం బయటకు ప్రదర్శించకూడదు:
స్విమ్మింగ్ చేయకూడదు:
పరాయి మగవారితో మాట్లాడకూడదు:
కొనే డ్రెస్ లను ట్రై చేయకూడదు:
ఇవేకాకుండా మహిళలకు ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. కొన్ని రకాల బిజినెస్ లు చేయకూడదు. అప్పు తీసుకోవాలన్నా, లైసెన్సు ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఆమె క్యారెక్టర్ పై ఎలాంటి మచ్చలేదు అని ఇద్దరు పురుషులు ధ్రువీకరించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఫ్యామిలీ మెంబర్స్ తో అయినా కలివిడిగా ఉండకూడదు. స్పెషల్ ఫ్యామిలీ సెక్షన్ లేని హోటేల్స్ లో తినకూడదు.
భారతీయ రైల్వే సంస్థ రైళ్లకు పేర్లు ఎలా పెడుతుందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. రైళ్లకు వాటి పేర్లను ఎలా పెడుతారనేది ఆసక్తికరమైన విషయం. సాధారణంగా రైళ్లకు వాటి గమ్యస్థానాలనే పేర్లుగా నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇతర పేర్లను పెడతారు. అలాగే ట్రైన్ ప్రయాణించే ప్రాంతాలలో వాడుకలో ఉన్న పేర్లను కూడా నిర్ణయిస్తారు.
శతాబ్ది ఎక్స్ ప్రెస్ 1989లో మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 100 సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రారంభం అయ్యింది. అందుకే ఆ ట్రైన్ కు శతాబ్ది అని పేరును నిర్ణయించారు. ఇక రాజధాని ఎక్స్ ప్రెస్ దేశ రాజధాని డిల్లీ నుండి వేరే ప్రాంతాలకు మధ్య నడిచే రైలు. ప్రధానంగా ఢిల్లీ నుండి ఇతర రాష్ట్రాల రాజధానుల నడుమ ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. అందువల్ల దీనికి రాజధాని పేరు నిర్ణయించారు.
దురంతో ఎక్స్ ప్రెస్ విషయానికి వస్తే, దురంతో అనగా అవాంతరాలు లేనిది అని అర్ధం. ఇక శబరి ఎక్స్ ప్రెస్ కు శబరిమల వెళ్లే ప్రయాణికుల కోసం, అందువల్ల శబరి ఎక్స్ ప్రెస్ అనే పేరును పెట్టారు. ప్రత్యేకమైన పేర్లు తక్కువగా ఉంటాయి. ఎక్కువగా మాత్రం వాటి గమ్యస్థానం పేర్లనే రైళ్ల పేర్లుగా నిర్ణయిస్తుంటారు.
విజువల్ వండర్ గా రూపొందిన ‘ఆది పురుష్’ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించిగా, సీత పాత్రలో కృతి సనన్ నటించింది. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్. హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ప్రదర్శించే ధియేటర్లలో ఒక సీటును ఆంజనేయస్వామి కోసం కేటాయిస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దీనిపై కొందరు ప్రమోషనల్ స్టంట్ అని అంటే, కొందరు శ్రీరాముడి కథ చెప్తున్నప్పుడు ఆంజనేయస్వామి కోసం సీటు వదిలితే తప్పు ఏమిటి? అని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో రక రకాల చర్చలు జరుగుతున్న క్రమంలో తాజాగా వాట్సాప్ మెసేజ్ ఒకటి వైరల్ గా మారింది. ఆదిపురుష్ సినిమా చూసే సమయంలో పాటించాల్సిన నియమాలు అంటూ వాట్సాప్ గ్రూప్ లలో తిరుగుతోంది. ఆ నియమాలు ఇవే..
తల్లి ఆస్తికి పూర్తిగా యజమాని అయితే, ఆమె ఎలాంటి వీలునామా రాయకుండా మరణించినపుడు ఆ ఆస్తి ఆమె కొడుకు మరియు కుమార్తెలకు సమానంగా చెందుతుంది. కుమారులు మరియు కూతుర్లకు సమాన హక్కులు ఉన్నాయి. ఫ్యామిలీలోని వివాహిత లేదా అవివాహిత కుమార్తెకు తల్లి ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి మీద సమాన హక్కు ఉంటుంది.
హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం, తల్లి ఆస్తి పై కుటుంబంలోని కూతుర్లకు సమాన హక్కులను కల్పించింది. కుమార్తెలు హిందూ అవిభాజ్య కుటుంబం(HUF )లో కుమారుడితో పాటుగా సమానమైన హక్కులు మరియు బాధ్యతలు కలిగి ఉంటుంది. 2005 అనంతరం పూర్వీకుల యొక్క ఫ్యామిలీ ఆస్తిని విభజించాలని అడిగే హక్కు, కుమారుడితో సమానంగా ఆస్తిలో తమ వాటాను పొందడానికి డిమాండ్ చేసే హక్కు కూతుర్లకు ఉంది.
అయితే తల్లి తన ఆస్తి గురించి వీలునామా రాసినపుడు, ఆ వీలునామాలో తన కుమార్తెను చేర్చకపోతే, ఆ ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉండదు. తల్లికి ఆస్తి ఎవరైనా ఇచ్చినా, ఆమె ఆస్తి కొన్నా, ఆస్తి ఎలా సంపాదించినా ఆమె వీలునామా రాసినట్లయితే అది వారికే చెందుతుంది. దీని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..