నాడు బ్రిటిషర్లకే డబ్బులు అప్పు ఇచ్చిన భారతీయుడి కుటుంబం..! ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది..?

నాడు బ్రిటిషర్లకే డబ్బులు అప్పు ఇచ్చిన భారతీయుడి కుటుంబం..! ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది..?

by Anudeep

Ads

మన భారత దేశ చరిత్రను ఎంతగా తవ్వితే.. అంత నమ్మకశ్యం కానీ విశేషాలను మనం తెలుసుకోవచ్చు. భారత్ నేడుఅభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. కానీ ఒకప్పటి భారత్ వేరు. అది ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి.

Video Advertisement

శతాబ్దాల క్రితం గీసిన లేదా తీసిన చిత్రాలను చూస్తే వారి వైభోగం మనకు అర్థం అవుతుంది. దేశం పరాయి పాలనలో ఉన్నప్పటికీ అపార సంపదలు కలిగిన వారిగా కొందరి పేర్లు చరిత్రలో లిఖించబడ్డాయి. వారిలో ఒకరే ముర్షిదాబాద్ కు చెందిన జగత్ సేఠ్. ఆయన్ను సేఠ్ ఫతే చాంద్ అని కూడా పిలుస్తారు.

the richest family who gave loans to british
జగత్ సేఠ్ కు ‘ది బ్యాంకర్ అఫ్ ది వరల్డ్’ అనే బిరుదు ఉంది. దీనిని 1723 లో మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా ఇచ్చారు. 18 వ శతాబ్దంలో బెంగాల్ లోని అత్యంత ధనిక కుటుంబంగా వీరు పేరు గాంచారు.

# కుటుంబ నేపథ్యం

సేఠ్ మాణిక్ చాంద్ ఈ కుటుంబ స్థాపకుడు. వీరి పూర్వీకులు మార్వార్ నివాసులని స్థానికులు తెలిపారు.క్రీ.శ 1652లో, ఈ కుటుంబానికి చెందిన హీరానంద్ సాహు మార్వార్ నుండి పాట్నాకు మారారు.

1720లలో బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ జగత్ సేఠ్ సంపద కంటే తక్కువగా ఉండేది. అది ప్రస్తుత విలువలో సుమారు 1000 బిలియన్ పౌండ్లు లేదా అంతకంటే ఎక్కువ. బ్రిటిష్ పత్రాల ప్రకారం, ఇంగ్లాండ్‌లోని అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ డబ్బు జగత్ సేఠ్ వద్ద ఉండేది.

the richest family who gave loans to british
# ఇంత సంపద ఎలా సంపాదించారు?

హీరానంద్ కుమారుడు మాణిక్‌చంద్ సాహు, బెంగాల్ మొదటి నవాబు ముర్షిద్ కులీ ఖాన్‌తో స్నేహం చేశాడు. సాహులు లేదా సేఠ్ లకు భారత దేశంలోని ప్రతి ముఖ్య నగరాల్లో కార్యాలయాలు ఉండేవి. నవాబులు మరియు బ్రిటీషర్లు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి డబ్బును బదిలీ చేయడానికి వీరి సహాయం తీసుకొనేవారు.
ఆ విధంగా పోర్చుగీస్, ఫ్రెంచ్ మరియు బ్రిటీష్ వలస శక్తులకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా వారు చాలా డబ్బు సంపాదించారు.

వారి చివరి రోజుల్లో ఏం జరిగింది?

1764లో బక్సర్ యుద్ధానికి ముందు మీర్ ఖాసిం మాధవ్ రాయ్ మరియు అతని బంధువు మహారాజ్ స్వరూప్ చంద్‌ని కిడ్నాప్ చేసి, రాజద్రోహం ఆరోపణలపై కాల్చి చంపాడు. హత్యకు గురైనప్పుడు మాధవ్ రాయ్ అత్యంత ధనవంతుడు.

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా బెంగాల్ నవాబును నిలబెట్టిన ప్లాసీ యుద్ధంలో వారిద్దరూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మద్దతు ఇచ్చారని చెబుతారు. వారు నవాబ్ సైన్యానికి నిధులు కూడా అందించారు.

the richest family who gave loans to british
జగత్ సేఠ్ కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉంది?

మాధవ్ రాయ్, స్వరూప్ చంద్ మరణించిన తర్వాత వారి రాజ్యం కూలిపోవడం ప్రారంభమైంది. వారు తమ ఆధీనంలో ఉన్న చాలా భూమిపై నియంత్రణ కోల్పోయారు. అంతే కాకుండా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి నుండి తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదు.

దీంతో వారు కృంగిపోయారు. సాహు కుటుంబం 1900ల నాటికి ప్రజల దృష్టి నుండి అదృశ్యమైంది. జగత్ సేఠ్ నివాసం ప్రస్తుతం మ్యూజియంగా మారింది.


End of Article

You may also like