నివేతా థామస్.. ఈమెను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పాత్రలు ఎంచుకొని ప్రేక్షకులను అలరించారు. మొదటి నుంచి గుర్తుండిపోయే పాత్రలే చేస్తున్న ఈమె చాలా కాలంగా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
ఆమె రెజీనా కాసాండ్రాతో కలిసి చేస్తున్న ‘శాఖిని ఢాకిని’ చిత్రం త్వరలో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లను కూడా ప్రారంభించింది చిత్ర యూనిట్. తాజాగా రెజీనా కాసాండ్రా తో కలిసి నివేదా ప్రమోషన్లలో కనిపించారు. నివేతాను చూసిన ఆమె అభిమానులు ‘నివేతా ఏంటి ఇలా అయిపోయింది?’ అని ఆశ్చర్య పోతున్నారు. బ్లాక్ డ్రెస్ లో అందంగా కనిపించిన నివేతా గతంలో కంటే కాస్త లావుగా కనిపిస్తున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించిన ఆమె బాల నటిగా సినీ ప్రవేశం చేశారు. మలయాళ చిత్రం వెరుథె ఒరు భార్య లో బాల నటిగా చేసిన ఆమెకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఆ చిత్రంలోని పాత్రకు గాను కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం పొందారు. తరువాత అనేక తమిళ, మళయాళ చిత్రాల్లో సహాయనటిగా నటించారు. రజనీ కాంత్ కు కుమార్తెగా దర్బార్ మూవీలో కూడా మెరిశారు నివేతా. నివేతా థామస్ హీరో నానితో కలిసి చేసిన జెంటిల్ మాన్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్ను కోరి’ చిత్రంలో నటించారు నివేతా.

ఆ చిత్రం క్లాసిక్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి ఆమె నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేతా ప్రధాన పాత్రల్లో నటించిన ‘శాఖిని డాకిని’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు దృశ్యం 2 దర్శకుడు జీతూ జోసెఫ్ రీమేక్ చేస్తున్న పాపనాశం 2 లో కూడా నటిస్తున్నారు నివేతా. ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురు పాత్రలో నివేతా థామస్ నటిస్తున్నారు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా నివేతా నటిస్తున్నారు.
watch video :
https://www.instagram.com/reel/CiO1cBevTkP/?utm_source=ig_embed&ig_rid=480a27ee-e84a-4cbb-a9d0-29e36017cbac

















మరి వీరు ఎక్కువ పెట్టుబడులు ఎందులో పెట్టి ఎంత సంపాదించారో ఓ సారి చూద్దాం..? అనుష్క శర్మ సినిమా రంగంలో హీరోయిన్ గా చేస్తూ స్టార్ అయింది.విరాట్ కోహ్లీ విషయానికి వస్తే భారత్ క్రికెట్ ప్లేయర్ నుంచి కెప్టెన్ వరకు ఎదిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఒక యాడ్ లో నటించడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో లవ్ బర్డ్స్ గా ఉన్న వీరు వివాహం చేసుకొని చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు.
వీరిద్దరూ సొంతంగా సంపాదించుకున్న సంపాదనతోనే ఇండియాలోనే రిచ్చెస్ట్ గా పేరును సంపాదించుకున్నారు. వీరి ఆస్తుల వివరాలు చూస్తే మనకు కళ్లు చెదిరిపోతాయి. వీరిద్దరి ఆస్తులు కలిపి కొన్ని వందల కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ భారత్ లో స్టార్ క్రికెటర్ కావడం వల్ల ఆయన ఆడే మ్యాచ్ ఫీజులు మరియు ఎండోమెంట్ వంటి ఒప్పందాలు, రాబడులు చూస్తుంటే ఒక సంవత్సరంలో వంద కోట్లకు పైగా సంపాదిస్తారు అని సమాచారం.
ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అలాగే అనుష్క శర్మ కొన్ని రకాల వస్త్రాల బిజినెస్ కూడా చేస్తోందని దీని విలువ దాదాపు 65 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. గురువారు గుళ్లోని విరాట్ సొంత బంగ్లా 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
అలాగే వీరిద్దరి కార్ల విలువ 25 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ముంబై నగరంలో పది కోట్ల విలువ చేసే ఒక అపార్ట్మెంట్. అలాగే ఖరీదైన వస్తువులు బైకులు ఉన్నాయి. ఇదే కాకుండా వీరు పలు పరిశ్రమ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇక విరాట్ కోహ్లీ పూర్తి ఆస్తుల వివరాలు చూస్తే దాదాపుగా 950 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. ఇక అనుష్క శర్మ ఆస్తుల విషయానికి వస్తే 450 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వీరి ఆస్తుల విలువ దాదాపు 1400 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది.
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21 

































