సమంత, నాగ చైతన్య గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీసింది. సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య, సమంత వారిద్దరి విషయాన్నిరెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు.
అయితే, ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా సమంత ఏదో ఒక రకంగా హింట్ ఇస్తూనే ఉన్నారు. సమంత మాత్రమే కాకుండా, సమంత స్టైలిస్ట్ అయిన ప్రీతమ్ జుకాల్కర్ కూడా కొన్ని రోజుల నుండి తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా కొటేషన్స్ పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ సోషల్ మీడియా అకౌంట్ లో, అతనిని తిడుతూ చాలా మంది నెటిజన్లు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అందులో ఒకతను ఒక అభ్యంతరకరమైన పదం ఉపయోగించి “నీ వల్ల చైతన్య జీవితం ఇలా అయిపోయింది కదరా” అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ మీద పెద్దఎత్తున చర్చ జరిగింది.
ప్రీతమ్ కి మద్దతుగా సమంత మేకప్ ఆర్టిస్ట్ అలాగే వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్ అయిన సాధన సింగ్ కూడా రంగంలోకి దిగారు. “నిన్ను చూసి మీ అమ్మగారు సిగ్గుపడుతూ ఉంటారు” అని కామెంట్ పెట్టారు. అప్పుడు ప్రీతమ్ అతనిని కొన్ని అభ్యంతరకరమైన మాటలు తిట్టి, “మీ చైతన్య ఏమైనా చిన్న పిల్లాడా? అతనికి బుర్ర లేదా? ఇంకొకసారి ఈ విషయం గురించి మాట్లాడితే జైల్లో పెట్టిస్తా” అని కామెంట్ పెట్టారు.
అప్పుడు ఆ నెటిజన్, “తాను సమంత ఫ్యాన్ అని, అందుకే తనకి మాట్లాడే హక్కు ఉంది అని, మీరు ఇందులో కలగజేసుకోకపోతే బాగుంటుంది” అని సాధన సింగ్ కి చెప్పారు. అందుకు సాధన, “ఇంకొకరి ప్రొఫైల్ లోకి వచ్చి ఇలా తిట్టడం ఫ్యాన్ లక్షణం కాదు. నోరు మూసుకొని అవతలికి వెళ్ళు” అని కామెంట్ పెట్టారు. ఈ విషయం ఇంకా చర్చలకు దారి తీయడంతో ప్రీతమ్ జుకాల్కర్ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేసారు.