మార్చి 29 వ తేదీ రానే వచ్చింది. మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఇప్పటివరకు సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆలోచనతో ప్రేక్షకులు ఎదురు చూస్తే ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాటలు టీజర్ పోస్టర్స్ తో కొంచెం కొంచెంగా పెరిగిన ఎగ్జైట్మెంట్ ట్రైలర్ తర్వాత డబల్ అయ్యింది. వకీల్ సాబ్ సినిమా పింక్ సినిమాకి రీమేక్. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రని హిందీలో అమితాబ్ బచ్చన్ గారు పోషించారు.
వకీల్ సాబ్ సినిమాలో నివేతా థామస్, అంజలి, అలాగే మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య నాగళ్ల కూడా నటిస్తున్నారు. సినిమా మొత్తంలో ఈ ముగ్గురు పాత్రలు చాలా కీలకమైనవి. అసలు కథ మొత్తం ఈ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. తెలుగు రీమేక్ కి ఓ మై ఫ్రెండ్ ఎం సి ఏ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. దిల్ రాజు గారు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే తమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన మూడు పాటలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.
వకీల్ సాబ్ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ప్రకాష్ రాజ్ పాత్ర ని పవన్ కళ్యాణ్ “నందా జీ” అని పిలుస్తున్నారు. ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చే సినిమా బద్రి. గబ్బర్ సింగ్, కాటమరాయుడు తర్వాత మళ్లీ శృతి హాసన్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ లో నటించారు.
watch video :
ఈ సినిమాకి ఆసక్తి పెంచే పాయింట్స్ చాలా ఉన్నాయి. కానీ దాదాపు ఎక్కువ మంది ఎగ్జైట్ అవుతోంది మాత్రం ఒక విషయానికే. అది ఏంటో మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు మళ్లీ మూడు సంవత్సరాల తర్వాత స్క్రీన్ పై పవర్ స్టార్ ని చూస్తున్నాం అంటే ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా? ఇదే ఎగ్జైట్మెంట్ సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతూ ఇలా మీమ్స్ రూపంలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18