అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా మంగళవారం ఇంగ్లాండ్ కి టీం ఇండియా కి మధ్య జరుగుతున్న మూడో టి20 మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (77 నాటౌట్: 46 బంతుల్లో 8×4, 4×6) తో హాఫ్ సెంచరీతో టీమిండియా పరువు నిలబెట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 156 పరుగుల స్కోర్ చేసింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో రోహిత్ శర్మ (15: 17 బంతుల్లో 2×4)తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్ కేఎల్ రాహుల్ (0: 4 బంతుల్లో) మరోసారి డకౌట్ గా వెనుదిరిగారు. తరువాత మూడవ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ (4: 9 బంతుల్లో) స్కోర్ చేయగా, రిషబ్ పంత్ (25: 20 బంతుల్లో 3×4) లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌట్ అయ్యారు.
అయితే కె.ఎల్ రాహుల్ డకౌట్ అవ్వడం ఇది రెండవ సారి. మూడు మ్యాచ్ లలో కలిపి కె.ఎల్.రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మొదటి టీ20లో 4 బంతులు ఆడిన కె.ఎల్ రాహుల్ ఒక్క పరుగు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో బంతిని వికెట్లపైకి ఆడి అవుటయ్యారు. తర్వాత రెండో టీ20లో శామ్ కరన్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ కి లోపలి గా వెళ్తున్న బంతిని వెంటాడి వికెట్ కీపర్ జోస్ బట్లర్ కి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగారు కేఎల్ రాహుల్. దాంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2#3#4#5#6#7#8#9#10#11