Ads
లెజెండరీ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు భౌతికంగా మనకు దూరమైనా కూడా, పాటల రూపంలో మనకి దగ్గరగానే ఉన్నట్టు కనిపిస్తారు. ఆయన ఎంతో గొప్ప గాయకులు మాత్రమే కాకుండా మంచి హోస్ట్ కూడా. ఎన్నో ఈవెంట్స్ లో గెస్ట్ గా, అలాగే పాడుతా తీయగా ప్రోగ్రాం కి హోస్ట్ గా మనందరినీ పలకరించేవారు.
Video Advertisement
ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అందులోనూ ముఖ్యంగా సింగింగ్ ఈవెంట్ అయితే అక్కడ గాయకులు పాడే పాటలను ఎంజాయ్ చేసేవారు. అలా ఒక ఈవెంట్ లో ఇద్దరు సింగర్స్ ఒక పాట పాడుతున్నప్పుడు బాలు గారు రియాక్ట్ అయిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ప్రోగ్రాంలో సింగర్స్ కారుణ్య, అనురాగ్ కులకర్ణి కలిసి భరత్ అనే నేను సినిమాలోని వచ్చాడయ్యో సామి పాటని పాడారు.
ఈ పాటని ఒరిజినల్ గా కైలాష్ ఖేర్, దివ్య కుమార్ పాడారు. కైలాష్ ఖేర్ పోర్షన్ ని కారుణ్య పాడగా, దివ్య కుమార్ పాడిన పోర్షన్ ని అనురాగ్ కులకర్ణి పాడారు. చరణాల్లో ఒక చోట కొంచెం హై స్థాయిలో పాడాల్సి ఉంటుంది. ఈవెంట్ లో ఆ పోర్షన్ అనురాగ్ కులకర్ణి పాడారు.
చరణంలో హై స్థాయిలో వచ్చే పార్ట్ అనురాగ్ కులకర్ణి పాడుతున్నప్పుడు బాలు గారు చాలా బాగా పాడారు అని అర్థం వచ్చేలా రియాక్షన్ ఇచ్చారు. రెండు చరణాల్లో ఆ పార్ట్ వచ్చినప్పుడు బాలు గారు అలాగే రియాక్ట్ అయ్యారు. రెండవ చరణం పాడుతున్నప్పుడు అనురాగ్ కులకర్ణి ఎలా పాడతారు అని బాలు గారు ఎదురు చూశారు.
అప్పుడు బాగా పడటంతో ఎంతో సంతోషంగా, కరెక్టుగా పాడారు అని అన్నట్టుగా రియాక్ట్ అయ్యారు బాలు గారు. ఇప్పటికి కూడా ఎంతోమంది ఆయన లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మందికి బాలు గారి పాట వినకుండా రోజు గడవదు. కేవలం ఇప్పటి తరాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకి కూడా బాలు గారు ఒక ఆదర్శంగా నిలిచారు.
End of Article