మనకి క్రికెట్ అనేది ఒక ఆట కాదు. ఒక ఎమోషన్. ప్రపంచంలో క్రికెట్ కి ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒక మ్యాచ్ ఉంటే ఆ మ్యాచ్ మొదలయ్యే ఒకరోజు ముందు నుంచే క్రికెట్ అభిమానుల్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఒకటి గమనించారా?
సాధారణంగా క్రికెట్ గ్రౌండ్ మీద ఒకటి కంటే ఎక్కువ పిచ్ లు ఉంటాయి. కానీ మ్యాచ్ మాత్రం సింగిల్ పిచ్ మీద ఆడతారు. ఎందుకో తెలుసా? అలా ఒక స్టేడియం లో ఒకటి కంటే ఎక్కువ పిచ్ లు ఉండడానికి కారణం ఏంటంటే. ఒక్కొక్క పిచ్ ఒక్కొక్క పరిమాణంతో రూపొందిస్తారు.
ప్రతి పిచ్ కి వేరే వేరే స్టాండర్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క పిచ్ ఒక్కొక్క దానికి ఉపయోగిస్తారు. అంటే ఒక పిచ్ నెట్ ప్రాక్టీస్ కి, ఒక పిచ్ డొమెస్టిక్ క్రికెట్ కి, ఇంకొక పిచ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి అలా అన్నమాట. ఒకటి పర్టికులర్ పిచ్ లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడడానికి వీలుగా ఉండే స్టాండర్డ్స్ తో పిచ్ రూపొందిస్తారు.
ఒక పిచ్ స్టాండర్డ్ కి ఒక రకమైన మ్యాచ్ మాత్రమే ఆడడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇలా మల్టిపుల్ పిచెస్ ఉండడానికి ఇంకొక కారణం కూడా చెప్తారు. అదేంటంటే. మ్యాచ్ ఆడటానికి ఒక ఫ్రెష్ పిచ్ కావాలి. ఒక పిచ్ రికవర్ అయ్యి మళ్ళీ మామూలు కండిషన్ కి రావడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఒక స్టేడియంలో ఒకటి కంటే ఎక్కువ పిచ్ లు ఉంటాయి.