Ads
మనందరికీ జీవితంలో ఏదో ఒకటి చేయాలి అని కల ఉంటుంది. ఎన్నో చేయాలి ఎన్నో సాధించాలని అనుకుంటాం. కానీ అందుకు మనం చేసే ప్రయత్నం ద్వారానే మనకు విజయం వస్తుంది. ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు. మనకి ఎవరి సపోర్ట్ లేకపోవచ్చు. కానీ అలాంటి సమయంలో కూడా మనం అనుకున్న దాని కోసం కష్టపడి సాధించామంటే అక్కడే చాలా వరకు మనం గెలిచినట్టే.
Video Advertisement
ఒక వ్యక్తి అలాగే ఎందరితోనో పోరాడి తను అనుకున్నది సాధించారు. వివరాల్లోకి వెళితే. సంజు రాణి వర్మ మీరట్ కి చెందిన వారు. 2013లో సంజు తల్లి చనిపోయారు. అప్పుడు కుటుంబ సభ్యులు సంజుని కాలేజ్ వదిలేసి పెళ్ళి చేసుకోమని చెప్పారు. అప్పుడు సంజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మీరట్ లోని ఆర్జీ డిగ్రీ కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు.
ఆ టైంలో పెళ్లి చేసుకోమని ఒత్తిడి రావడంతో సంజు తన కుటుంబం తన ఆశయం రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు సంజు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తన చదువు కూడా మధ్యలో ఆగిపోయింది. సంజు దగ్గర డబ్బులు లేవు. ఒక రూమ్ రెంట్ కి తీసుకొని పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. అలాగే సంజు కి ప్రైవేట్ స్కూల్స్ లో పార్ట్ టైం టీచింగ్ ఉద్యోగాలు కూడా వచ్చాయి.
కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంజు తన ఆశయాన్ని వదలకుండా 2018 లో యూపిపిఎస్సి ఎగ్జామ్స్ క్లియర్ చేశారు. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరారు సంజు. 2020లో ఒక ఇంటర్వ్యూలో తనకి సివిల్స్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అవ్వాలి అని ఉంది అని చెప్పారు సంజు.
సంజు మాట్లాడుతూ “మా అమ్మ మరణించిన తర్వాత మా కుటుంబం వాళ్ళు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. నేను నా పాయింట్ వివరించటానికి ప్రయత్నించాను కానీ వాళ్ళు వినలేదు. అప్పుడు నేను ఇంక వాళ్ల కోణంలో నుంచి విషయాలను చూడడం ఆపేసి, నా జీవితం నేను బతకాలి అని నిర్ణయించుకున్నాను.
నా జీవితంలో నేను బతకడం మొదలు పెట్టినందుకు నా కుటుంబం నా మీద కొంచెం కోపంగా ఉంది. కానీ ఆఫీసర్ హోదాలో ఉన్న నన్ను అందరూ గౌరవిస్తుంటే చూసి వాళ్లు కూడా ఆనందంగా ఫీల్ అవుతారు అని నాకు తెలుసు. నాకు నా బాధ్యత గురించి పూర్తిగా తెలుసు. నా కుటుంబానికి నేను అన్నివిధాలా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను. కానీ కూతుర్లని చదువు ఆపించేసి పెళ్లి చేయమని ఈ సమాజం చేసే ఒత్తిడి అనేది నాకు అర్థం కాదు.” అని అన్నారు.
End of Article