పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో తను చేసే ఎన్నో మంచి పనులకి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. మన సెలబ్రిటీల్లో కూడా ఎంతో మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. అందులో ఒకరు నితిన్. నితిన్ తనకి పవన్ కల్యాణ్ అంటే ఇష్టం అని ఎన్నోసార్లు చెప్పారు. నితిన్ మాత్రమే కాకుండా మన ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా చాలా మంది ఉన్నారు.
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన అషు రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద అభిమాని. అయితే ఇటీవల అషు రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అషు. “నా దేవుడిని మళ్ళీ కలిశాను. ఆయనకి నేను గుర్తున్నాను, అలాగే టాటూ కూడా గుర్తుంది అని చెప్పారు. రెండు గంటల పాటు మాట్లాడారు. నేను వెళ్తున్నప్పుడు నాకు ఒక నోట్ కూడా ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
డైరెక్టర్ క్రిష్ గారికి చాలా థ్యాంక్స్” అని క్యాప్షన్ లో రాశారు అషు రెడ్డి. అలాగే పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన నోట్ ని కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ కి ఒక నెటిజన్ “ఒక వేళ పవన్ కళ్యాణ్ కి నాలుగవ భార్య అయ్యే అవకాశం వస్తే మీరు అంగీకరిస్తారా?” అని కామెంట్ చేశారు. అందుకు అషు రెడ్డి ఎస్ (YES) అని రిప్లై ఇచ్చారు.