హైదరాబాద్ మెట్రోలో మనకు వినిపించే గొంతు ఎవరిదో తెలుసా.?

హైదరాబాద్ మెట్రోలో మనకు వినిపించే గొంతు ఎవరిదో తెలుసా.?

by Mohana Priya

Ads

ఆర్టిసి బస్ సర్వీసెస్ కి కొంచెం శ్రమ తగ్గించడానికి మెట్రో సర్వీసెస్ వచ్చాయి. మెట్రో వచ్చిన తర్వాత ప్రయాణాలు ఎంత సులభం అయ్యాయో మనందరికీ తెలుసు. మెట్రోలో కూడా పైన చెప్పిన పొద్దున, సాయంత్రం సమయానికి ఎక్కువ మంది జనాలు ఉంటారు. కానీ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ప్రయాణికులు వాళ్ల స్టాప్ కి తొందరగా రీచ్ అవుతారు.

Video Advertisement

Voice of metro train announcement

స్టాప్ వచ్చేముందు మనకి ఒక రికార్డెడ్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఆ అనౌన్స్మెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వినిపిస్తుంది. దీనివల్ల ఏ భాష వాళ్ళు అయినా కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే మనం వాడుక భాషలో ప్రదేశాల పేర్లు ప్రనౌన్స్ చేసే తీరుకి, మెట్రో అనౌన్స్మెంట్ లో ప్రనౌన్స్ చేసే తీరుకి కొంచెం తేడా ఉంటుంది.

Voice of metro train announcement

చాలా మందికి అసలు “మెట్రోలో వినిపించే  ఆ గొంతు ఎవరిదో?” అనే ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు. మెట్రోలో జాతీయ భాష హిందీలో అనౌన్స్మెంట్ వినిపించే గొంతు పేరు రిని సిమోన్ ఖన్నా. రిని సిమోన్ ఖన్నా ఒక ప్రముఖ న్యూస్ రీడర్, ఇంకా జర్నలిస్ట్. తనకి పదమూడేళ్లు ఉన్నప్పటినుంచి హోస్టింగ్ చేయడం, ఆల్ ఇండియా రేడియో ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు రిని సిమోన్ ఖన్నా.

Voice of metro train announcement

తర్వాత ఢిల్లీ దూరదర్శన్ లో నేషనల్ న్యూస్ యాంకర్ గా కూడా చేశారు. ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ కి, డాక్యుమెంటరీ లకి, ఫీచర్ ఫిలిమ్స్ కి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే ఎన్నో జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లకి, కల్చరల్ షోస్, సెమినార్స్ కి కూడా యాంకరింగ్ చేశారు. మేల్ వాయిస్ ఆర్టిస్ట్ షమ్మీ నారంగ్ తో పాటు ఢిల్లీ మెట్రోలో, అలాగే హైదరాబాద్ మెట్రో లో రిని సిమోన్ ఖన్నా గొంతు వినిపిస్తుంది.


End of Article

You may also like