“ఆచార్య” సినిమాతో పాటు… “చిరంజీవి” కెరీర్‌లో “వరస్ట్ సినిమా” అని టాక్ తెచ్చుకున్న 12 సినిమాలు ఇవే..!

“ఆచార్య” సినిమాతో పాటు… “చిరంజీవి” కెరీర్‌లో “వరస్ట్ సినిమా” అని టాక్ తెచ్చుకున్న 12 సినిమాలు ఇవే..!

by kavitha

Ads

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ నేపథ్యం లేనప్పటికీ, నటుడుగా అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా మారారు. చిరంజీవి కెరీర్‌లో నటించిన సినిమాలలో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్‌తో పాటు ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి.

Video Advertisement

ఎన్టీఆర్ఈ, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు జనరేషన్ల తరువాతి తరంలో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ సాధించిన రికార్డ్ చిరంజీవిదే. అయితే విజయాలతో పాటు చిరంజీవి కెరీర్ లో ఆ స్థాయిలో డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చిరంజీవి కెరీర్ లోనే భారీ డిజాస్టర్ అయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..  1. ఆచార్య:

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ ఆచార్య. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లోనే భారీ ఫ్లాప్ గా మిగిలింది. 2.  సైరా నరసింహారెడ్డి:

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి మూవీని ఆయన కుమారుడు రామ్ చరణ్ నిర్మించారు. ఈ మూవీ ప్లాప్ అవడంతో దాదాపు 30 కోట్ల రూపాయల నష్టం వచ్చిందంట. 3 .శంకర్ దాదా జిందాబాద్:

బాలీవుడ్ లో హిట్ అయిన ‘లగేరహో మున్నాభాయ్’ మూవీని తెలుగులో చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా జిందాబాద్’ గా ప్రభుదేవా దర్శకత్వంలో రీమేక్ చేశారు. కానీ ఈ  సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
4. మృగరాజు:

మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా నటించిన మృగరాజు సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
5. అంజి:

కోడిరామకృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా అంజి. ఈ చిత్రాన్నినిర్మాత  శ్యామ్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించారు.
6. బిగ్‌బాస్ :

మెగాస్టార్ చిరంజీవి, రోజా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ బాపినీడు తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.7. రిక్షావోడు:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నగ్మా, సౌందర్య హీరోయిన్లుగా నటించిన మూవీ రిక్షావోడు. ఈ సినిమాకి  కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
8.రాజా విక్రమార్క:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రంలో అమల, రాధిక హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది.

9. త్రినేత్రుడు:

చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘తినేత్రుడు’. ఈ చిత్రాన్ని మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ఇది చిరంజీవి 100వ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.
10. జేబు దొంగ:

చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘జేబు దొంగ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.11. లంకేశ్వరుడు:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన లంకేశ్వరుడు మూవీ భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.12. రుద్రనేత్ర:

మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘రుద్రనేత్ర’. ఈ మూవీలో మెగాస్టార్ జేమ్స్‌బాండ్ పాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది.
Also Read: BHOLAA SHANKAR REVIEW : “చిరంజీవి” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like