Ads
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. సినిమాలో కొన్ని సీన్స్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి. అందులోనూ మిడిల్ క్లాస్ పేరుతో చూపించిన సీన్స్ మీద అయితే ఇంకా కామెంట్స్ వచ్చాయి. సాధారణంగా ఏ మిడిల్ క్లాస్ ఇంట్లో కూడా చేయని పనులు ఈ సినిమాలో మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తారు అన్నట్టు చూపించారు. దాంతో ఈ విషయం మీద సినిమా చూసిన వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో మూడు చుక్కలతో దోస వేస్తాడు. అది కూడా చిన్నపిల్లలకి అలా దోస వేసి ఇస్తాడు.
Video Advertisement
అలా ఎక్కడా జరగదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఇంకొక విషయం మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు. అదేంటంటే, హీరో పెద్దన్నయ్య సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. సరైన జాబ్ ఉండదు. కానీ అతనికి పెళ్లి అయ్యి, ముగ్గురు పిల్లలు ఉంటారు. హీరో చిన్నన్నయ్య వ్యాపారం కోసం తిరుగుతూ ఉంటాడు. అతనికి కూడా సరైన జాబ్ ఉండదు. కానీ అతనికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉంటారు. హీరో ఇద్దరు అన్నలకి ఆదాయం ఉండదు. దాంతో కుటుంబ బాధ్యత అంతా కూడా హీరో తీసుకుంటాడు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి కేవలం హీరో మాత్రమే.
నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. ఇంట్లో ఖర్చులకి ఆ డబ్బులు సరిపోవు. అప్పులు కూడా ఉంటాయి. సాధారణంగా, ఏ అబ్బాయి అయినా సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకోడు. ఏ ఇంట్లో అయినా సరే, ఒక అమ్మాయిని ఇవ్వాలి అంటే ఒక అబ్బాయికి సరైన ఉద్యోగం ఉండాలి. లేకపోతే అమ్మాయిని ఇవ్వరు. అలాంటిది అసలు ఉద్యోగాలు లేని ఇద్దరు అన్నలు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు కంటారు. దాంతో, అసలు సెటిల్ అవ్వని వాళ్ళకి పిల్లని ఎలా ఇచ్చారు? వాళ్లకి పెళ్లిళ్లు ఎలా జరిగాయి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : ఇంటర్ ఫలితాల గురించి ఈ పిల్లవాడు చెప్పిన వీడియో చూశారా..? ఇంత చిన్న వయసులో ఇన్ని తెలివితేటలు వచ్చాయా..?
End of Article