డబల్ డోర్ ఫ్రిడ్జ్ కు సింగల్ డోర్ ఫ్రిడ్జ్ కు తేడా ఏంటి..? ఈ రెండిటిలో ఏది మంచిదో తెలుసా..?

డబల్ డోర్ ఫ్రిడ్జ్ కు సింగల్ డోర్ ఫ్రిడ్జ్ కు తేడా ఏంటి..? ఈ రెండిటిలో ఏది మంచిదో తెలుసా..?

by Mohana Priya

ఈరోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండడం ఆశ్చర్యమే. దాదాపుగా అందరు ఫ్రిడ్జ్ వాడుతున్నారు. ఫ్రిడ్జ్ లలో కూడా రకరకాల మోడల్స్ వస్తున్నాయి. కొన్నిటికి సింగల్ డోర్ ఉంటె.. మరికొన్ని ఫ్రిడ్జ్ లకు డబల్ డోర్ ఉంటుంది. సింగల్ డోర్ ఉన్న ఫ్రిడ్జ్ లలో కూడా ఫ్రీజర్ కు సెపరేట్ డోర్ ని ఇస్తారు. ఇక డబల్ డోర్ విషయానికి వస్తే.. ఫ్రీజర్ సెపరేట్ గా పైన ఉంటుంది.

Video Advertisement

బడ్జెట్ ని బట్టి సింగల్ డోర్ ఫ్రిడ్జ్ లేదా డబల్ డోర్ ఫ్రిడ్జ్ ను కొనుక్కోవడం అనేది మన ఇష్టం. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే ముందు ఫ్రిడ్జ్ లలో ఉండే తేడాలు ఏంటో తెలుసుకోవాలి.

fridge 2

నిజానికి సింగల్ డోర్ ఫ్రిడ్జ్ కు, డబల్ డోర్ ఫ్రిడ్జ్ కు పెద్ద తేడా ఏమీ ఉండదు. కానీ ఫ్రిడ్జ్ లలో రెండు రకాలు ఉంటాయి. ” డైరెక్ట్ కూల్ ” , “ఫ్రాస్ట్ ఫ్రీ “ అని రెండు రకాల ఫ్రిడ్జ్ లు ఉంటాయి. డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్ లు తక్కువ కాస్ట్ లోనే లభిస్తాయి. ఎక్కువ మంది వీటిని వాడుకుంటూ ఉంటారు. ఈ డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్ లలో టెంపరేచర్ ను మాన్యువల్ గా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీజర్ లో టెంపరేచర్ ఒకసారి సెట్ చేస్తే అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకవేళ కూలింగ్ ఎక్కువ అయ్యి గడ్డ కట్టిపోతే బటన్ ప్రెస్ చేసి ఆ గడ్డలను కరిగించాల్సి ఉంటుంది.

fridge 1

ఈ ఐస్ గడ్డలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. లేకుంటే ఓవర్ ఫ్లో అయ్యి ఆ వాటర్ అంతా ఫ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చి ఫ్లోర్ పై పడుతుంటాయి. ఇక ఫాస్ట్ ఫ్రీ మోడల్స్ ఫ్రిడ్జ్ లలో ఈ సమస్య ఉండదు. ఈ ఫ్రిడ్జ్ లలో టెంపరేచర్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఉంచిన వస్తువులపై కూడా టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన కూరగాయలు, ఫుడ్ కి తగ్గట్లు ఈ టెంపరేచర్ సెట్ అవుతూ వాటిని పాడైపోకుండా ఉంచుతుంది. ఇక ఫ్రీజర్ లో గడ్డలు కట్టే సమస్య ఉండదు. అవసరమైనంతగా టెంపరేచర్ ఆటోమేటిక్ గా సెట్ అవుతూ ఉంటుంది. ఐస్ క్యూబ్స్ అవసరం అయిన చోట మాత్రమే గడ్డ కడుతుంది. అయితే వాడడానికి ఉన్న సౌకర్యం రీత్యా అందరిలోనూ డబల్ డోర్ ఫ్రిడ్జ్ మంచిది అనే అభిప్రాయం మాత్రం ఉంది.


You may also like