చంద్రబాబు నాయుడు గారి పెళ్లిపత్రిక చూసారా.? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా.?

చంద్రబాబు నాయుడు గారి పెళ్లిపత్రిక చూసారా.? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా.?

by Anudeep

Ads

సెప్టెంబర్ పదవ తేదీ ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెళ్లి రోజు. ఈ సందర్భంగా చంద్రబాబు పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఈ వివాహ పత్రిక చంద్రబాబే స్వయం గా ఆహ్వానిస్తున్నట్లు డిజైన్ చేసి ఉంది.

Video Advertisement

ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని తాను వివాహం చేసుకుంటున్నానని.. అందరు రావాలని.. ఆయనే ఆహ్వానిస్తున్నట్లు గా ఈ కార్డు ఉంది.

chandrababu 1

ఈ పెళ్లి వేడుక జరిగే నాటికి ఎన్టీఆర్ టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. మరో వైపు చంద్రబాబు నాయుడు కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా పదవి లో ఉన్నారు. దీనితో ఈ పెళ్ళికి అప్పట్లో చాలా క్రేజ్ వచ్చింది. అన్ని మీడియాలలోను.. ఈ పెళ్లి గురించి వార్తలు వచ్చేవి. ఓ వైపు రాజకీయ ప్రముఖులు, మరో వైపు సినిమా తారలు ఈ పెళ్ళికి హాజరయ్యి సందడి చేసారు.

chandrababu 2

ఇది ఇలా ఉంటె.. మరో వైపు కట్నం ప్రస్తావన కు సంబంధించి డిస్కషన్స్ కూడా జరిగేవి. చంద్రబాబు నాయుడు ఇంత కట్నం తీసుకున్నారు.. అంత తీసుకుని ఉండి ఉంటారు.. అంటూ చాలా రకాలుగా చెప్పేవారు. నిజానికి చంద్రబాబు నాయుడు నయాపైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారట. చంద్రబాబు అసలు అడగనేలేదట. మరో వైపు ఎన్టీఆర్ కూడా కట్నం ఇవ్వడానికేమి ముందుకురాలేదట. కానీ.. వీరి వివాహ వేడుక అప్పట్లోనే అంగరంగ వైభవం గా జరిగిందట. అప్పటి పెళ్లి ఫోటో, ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.


End of Article

You may also like