పట్టణాలు డెవలప్ అయ్యాయని తెలుసుకోవాలి అంటే అక్కడ ముందుగా చూసేది చుట్టూ ఉన్న బిల్డింగ్ లని. ఎన్నో పెద్ద సిటీలలో ఎన్నో అంతస్తులతో బిల్డింగులను కడుతున్నారు. ఒక్కొక్కసారి అయితే ఒక బిల్డింగ్ లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అని లెక్క పెట్టడం కూడా కష్టం అవుతుంది. అంటే అన్ని ఎక్కువ ఫ్లోర్స్ తో భవనాలని నిర్మిస్తున్నారు అని అర్థం. కాలం మారిన కొద్దీ అభివృద్ధి చెందిన వాటిలో ముఖ్యమైనది హోటల్ సెక్టార్.
మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో లగ్జరీయస్ హోటల్స్ ఉన్నాయి. అయితే, మీరు ఎప్పుడైనా ఒకటి గమనించారా? కొన్ని హోటల్స్ లో పదమూడవ అంతస్తు ఉండదు. అంటే 12వ అంతస్తు ఉంటుంది దాని తర్వాత పద్నాలుగవ అంతస్తు ఉంటుంది. కానీ పదమూడవ అంతస్తు మాత్రం ఉండదు.
ఇది హోటల్స్ లో మాత్రమే కాదు సాధారణంగా వేరే ఏదైనా సంస్థకు సంబంధించిన లిఫ్ట్ లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా పదమూడవ అంతస్తు ఉండకపోవడం అనేది ఎక్కువగా విదేశాలలో ఉంటుంది. పదమూడవ అంతస్తుకి బదులుగా, 12 A, 12 B అని ఏదైనా పేరుతో ఉంటుంది. అలా 13వ అంతస్తు లేకపోవడానికి గల కారణం ఏంటంటే.
# ట్రిస్కైడెకాఫోబియా
అంటే పదమూడు అనే నంబర్ చూస్తే కొంతమందికి అసౌకర్యంగా, దానివల్ల ఏమైనా చెడు జరుగుతుందేమో అని అనిపిస్తుందట. ఆన్గ్జైటీ లాంటివి అవుతూ ఉంటాయట. అందుకే చాలా సంస్థల్లో లిఫ్ట్ లో 13వ నంబర్ రాకుండా చూసుకుంటారు.
# నార్స్ పురాణాల ప్రకారం లోకి అనే ఒక దేవుడు 13వ అతిథిగా వల్హల్లా లోని ఒక సమావేశానికి ప్రవేశించిన తర్వాత, అప్పటికే అక్కడ ఉన్న 12 మంది దేవతల మధ్య గందరగోళానికి దారితీసింది అని అంటారు.
# అలాగే, క్రిస్టియానిటీలో జుడాస్ అనే అతను జీసస్ లాస్ట్ సప్పర్ లో 13వ వ్యక్తి అని, అతనే జీసస్ ని మోసం చేశాడు అని అంటారు.
అందుకే పదమూడవ అంతస్తుని ముఖ్యంగా విదేశాల్లో వీలైనంత అవాయిడ్ చేస్తారు.