జబర్దస్త్ తో మనందరికీ పరిచయం అయ్యి బిగ్ బాస్ ద్వారా ఇంకా పాపులర్ అయ్యారు అవినాష్. అవినాష్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఒకసారి తన షోస్ అన్ని వదులుకొని వచ్చాను అని అన్నారు. ఈ విషయంపై చర్చ మొదలైంది. కానీ తర్వాత అలాంటిదేమీ లేదు అనే వార్త వచ్చింది. ఈ విషయంపై అవినాష్ ఇటీవల స్పందించారు.

అవినాష్ మాట్లాడుతూ ”నాకు బిగ్ బాస్ కి రమ్మని కాల్ వచ్చింది. షో యాజమాన్యాన్ని బిగ్ బాస్ కి వెళ్తాను అని అడిగాను. కానీ అగ్రిమెంట్ మధ్యలో వెళ్ళిపోతే పది లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పారు. నేను ఎనిమిది సంవత్సరాల నుండి వాళ్ల దగ్గర చేస్తున్నాను అని, సహాయం చేయమని అడిగాను వారి దగ్గర కూడా డబ్బులు లేవు అన్నారు. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని నేను బిగ్ బాస్ కి వెళ్తాను అంటే 10 లక్షలు కట్టమన్నారు.

jabardasth avinash bigg boss

నేను ఏదో 2 లక్షలు, 3 లక్షలు కట్టించుకుంటారు ఏమో అనుకున్నాను కానీ పది లక్షలు కట్టమన్నారు. నేను ఈ విషయంలో వాళ్ళని తప్పు పట్టడం లేదు. వాళ్ల అగ్రిమెంట్ వాళ్లు ఫాలో అవుతారు. ఆ 10 లక్షల కోసం చాలా మంది దగ్గర అప్పు చేశాను. చమ్మక్ చంద్ర, శ్రీముఖి వీళ్ళందరూ నాకు సహాయం చేశారు. అలా జబర్దస్త్ కి 10 లక్షల రూపాయలు కట్టి బిగ్ బాస్ కి వెళ్లాను.

jabardasth avinash twist to jabardasth

బిగ్ బాస్ తో వచ్చిన డబ్బుతో నా అప్పులన్నీ తీర్చాను”. అని అన్నారు. ఇప్పటికి కూడా తనకి జబర్దస్త్ కి వెళ్లాలని ఎక్కడో చిన్న ఆశ ఉందని కానీ వాళ్లు రావద్దు అని అన్నారని చెప్పారు. ఈ కారణంగా బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత నుండి అవినాష్ జబర్దస్త్ లో స్కిట్స్ లో  నటించట్లేదు. కానీ ఇటీవల స్టార్ మా లో మొదలైన కామెడీ స్టార్స్ అనే కామెడీ షో లో అవినాష్ వస్తున్నారు.

jabardasth avinash twist to jabardasth

వర్షిణి యాంకర్ గా ఉన్న ఈ షోకి శ్రీదేవి విజయ్ కుమార్, శేఖర్ మాస్టర్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ప్రతి ఆదివారం టెలికాస్ట్ అవుతుంది. చమ్మక్ చంద్ర, కార్తీకదీపం సీరియల్ ఫేమ్ శౌర్య, హిమ కూడా కామెడీ స్టార్స్ లో మనల్ని అలరిస్తున్నారు. మొదటి ఎపిసోడ్ తోనే కామెడీ స్టార్స్ హిట్ టాక్ సంపాదించుకుంది.

jabardasth avinash twist to jabardasth

ఇటీవల టెలికాస్ట్ అయిన మొదటి ఎపిసోడ్ కి 9.8 టీఆర్పీ వచ్చింది. ఈ విషయాన్ని అవినాష్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు. మామూలుగా అయితే జబర్దస్త్ షో కి 6-7 కంటే ఎక్కువ టీఆర్పీ రాదు. కానీ కామెడీ స్టార్స్ మొదటి ఎపిసోడ్ తోనే 9.8 టీఆర్పీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

jabardasth avinash twist to jabardasth

ఇందులో ఎక్కువ శాతం క్రెడిట్ అవినాష్ కే దక్కుతుంది అని అంటున్నారు ప్రేక్షకులు. అలాగే ఈ షో సక్సెస్ ద్వారా ఒకరకంగా జబర్దస్త్ పై అవినాష్ రివెంజ్ తీర్చుకున్నారు అని కూడా అంటున్నారు. అలా తన పెర్ఫార్మెన్స్ తో షో కి ఒక హైలెట్ గా నిలుస్తున్నారు అవినాష్. అంతే కాకుండా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన క్రాక్ సినిమాలో కూడా అవినాష్ నటించారు.

 


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE