రివ్యూ : మ్యూజిక్ షాప్ మూర్తి..! అజయ్ ఘోష్, చాందిని చౌదరి నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే..?

రివ్యూ : మ్యూజిక్ షాప్ మూర్తి..! అజయ్ ఘోష్, చాందిని చౌదరి నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే..?

by Harika

Ads

ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి, జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భానుచందర్, దయానంద్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమాని, హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. పవన్ సంగీతం అందించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మూర్తి (అజయ్ ఘోష్) ఒక మ్యూజిక్ షాప్ నడుపుతూ ఉంటాడు. టెక్నాలజీ పెరగడంతో, గతంలో ఎంతో బాగా నడిచిన మ్యూజిక్ షాప్ సరిగ్గా నడవదు. క్యాసెట్స్ ఎవరూ కొనరు. అయినా కూడా మ్యూజిక్ మీద తనకి ఉన్న ఇష్టంతో మూర్తి ఆ షాప్ ని నడిపిస్తూ ఉంటాడు.

Video Advertisement

music shop murthy review telugu

భార్య జయ (ఆమని) కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ, పిల్లలని పెంచుతుంది. మ్యూజిక్ షాప్ మూసేసి, మొబైల్ రిపేర్ చేసే షాప్ తెరవమని చెప్తూ ఉంటుంది. కానీ మూర్తి మాత్రం ఈ మాట వినడు. ఒక బ‌ర్త్‌డే పార్టీ తర్వాత మూర్తికి డీజే అవ్వాలి అనిపిస్తుంది. అంజన (చాందిని చౌదరి) అమెరికా నుండి ఇండియాకి డీజే కావాలి అని వస్తుంది. మూర్తికి, అంజనకి పరిచయం ఏర్పడిన తర్వాత, డీజే ప్లే చేయడం నేర్పించమని అడుగుతాడు. మొదట నిరాకరించినా కూడా, తర్వాత మూర్తికి ఉన్న ఆసక్తి గమనించి డీజే ప్లే చేయడం నేర్పిస్తాను అని అంజన చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇటీవల వచ్చే సినిమాలు ఒక స్పెషల్ సాంగ్ ఉండాలి, లేదా ఇంకా ఏదైనా పంచ్ డైలాగ్స్ ఉండాలి అన్నట్టు రాసుకుంటున్నారు.

కానీ ఈ సినిమా అలా లేదు. లక్ష్యం చేరుకోవడానికి వయసు అనేది అడ్డంకి కాదు అని చెప్పడానికి చాలా సినిమాలు ప్రయత్నించాయి. ఈ సినిమా కూడా అలాంటి ఒక సినిమానే. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా ఇది. ఇలాంటివి తెలుగులో ఈ మధ్య అయితే తక్కువగానే వస్తున్నాయి. ఎక్కువగా పాత్రల మీద నడిచే సినిమాలే వస్తున్నాయి. కానీ ఈ సినిమాలో కథ, పాత్ర సమానంగా నడుస్తూ ఉంటుంది. పాత్రలన్నీ కూడా కథలో ఒక భాగం అవుతాయి కానీ, పాత్రల వల్ల కథ ముందుకు వెళ్లలేదు. చాలా లైట్ హార్టెడ్ గా మంచి మెసేజ్ అందించారు. తెలిసిన కథ అయినా కూడా ఎమోషన్స్ తో నడిపించారు. ముఖ్యంగా అజయ్ ఘోష్ నటన అయితే సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. సినిమాలో మూర్తి పాత్ర బాధపడుతూ ఉంటే మనకి కూడా బాధగా అనిపిస్తుంది.

అంతగా ఆ పాత్రకి కనెక్ట్ అవుతాం. అందుకు ముఖ్య కారణం అజయ్ ఘోష్ నటన. చాందిని చౌదరి, ఆమని, భానుచందర్ తో పాటు మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్లందరూ కూడా చాలా బాగా నటించారు. కథ తెలిసిన కథ అయినా పర్వాలేదు. ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాని తప్పకుండా చూడండి. ప్రతి ఒక్క వయసు వారికి నచ్చే సినిమా ఇది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మంచి కాన్సెప్ట్ తో వచ్చిన మంచి సినిమాగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like