కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చినా కార్తీక దీపం సీరీయల్ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది.
ఈ సీరియల్ లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి దీప పాత్ర పోషిస్తున్న ప్రేమి విశ్వనాథ్ అలియాస్ “వంటలక్క”. ప్రేమి విశ్వనాథ్ కి తెలుగు లో ఇది మొదటి సీరియల్. అయినా కూడా తన పర్ఫార్మెన్స్ తో సీరియల్ ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ప్రేమి విశ్వనాథ్.
ప్రేమి విశ్వనాథ్ ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వరు. తన పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియా లేదా న్యూస్ మీడియా ద్వారా తెలుసుకున్నదే కానీ ప్రేమి విశ్వనాథ్ అయితే తన గురించి ఎక్కడా చెప్పలేదు. ఇటీవల దసరా సందర్బంగా సాక్షి టీవీ తో మాట్లాడారు ప్రేమి విశ్వనాథ్. అంతే కాకుండా మా టీవీలో ఒక ఈవెంట్ లో కూడా కనిపించారు.
దానితో పాటు ప్రేమి విశ్వనాథ్ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా కనిపిస్తున్నారు. తెనాలి డబల్ హార్స్ మినప గుళ్ళు అడ్వర్టైజ్మెంట్ కి సుమ వస్తారు అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సుమతో ప్రేమి విశ్వనాథ్ కూడా కలిశారు. తెనాలి డబల్ హార్స్ మినప గుళ్ళు కి సుమన్ తో పాటు ప్రేమి విశ్వనాథ్ కూడా బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. వీరిద్దరూ కలిసి నటించిన అడ్వటైజ్మెంట్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలైంది.
watch video :