అనాథ శవాన్ని మోస్తున్న మహిళా ఎస్సై అంటూ వైరల్ అవుతున్న ఫోటో వెనక ఒక పోరాటమే ఉంది.!

అనాథ శవాన్ని మోస్తున్న మహిళా ఎస్సై అంటూ వైరల్ అవుతున్న ఫోటో వెనక ఒక పోరాటమే ఉంది.!

by Mohana Priya

Ads

కొద్ది రోజుల క్రితం ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీస్ యూనిఫాం ధరించిన ఒక మహిళ ఒక అనాధ శవాన్ని మోస్తూ కిలోమీటర్ నడిచారు అనేది ఆ ఫోటో యొక్క సారాంశం. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు, అలాగే ప్రముఖులు అందరూ ఆ మహిళని ప్రశంసించారు. ఆవిడ పేరు శిరీష.

Video Advertisement

story of sub inspector sirisha

శిరీష శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నారు. సమయం కథనం ప్రకారం శిరీష తండ్రి కొత్తూరు అప్పారావు తాపీ మేస్త్రిగా చేసేవారు. తల్లి రమణమ్మ రోజువారీ ఉద్యోగిగా చేసేవారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా శిరీషకి 13 సంవత్సరాలకి పెళ్లి చేశారు. అవగాహన లేని వయసులో పెళ్లి చేసుకున్న శిరీష ఎలాగోలా అత్తవారింటి నుండి బయటపడి తిరిగి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూనే చదువుకోవడం ప్రారంభించారు.

story of sub inspector sirisha

శిరీష తండ్రి అప్పారావు గారికి పోలీస్ అంటే చాలా ఇష్టమట. కర్తవ్యం సినిమాలో విజయశాంతిలా శిరీషని చూడాలని అనుకునేవారట. ఫీజు రీయింబర్స్మెంట్ తో ఎం ఫార్మసీ పూర్తి చేసిన శిరీషకి 2014 లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. 2014 లో శిరీష ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఉన్న సమయంలో ఒక ఎస్పి “ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్” అని అన్నారట.

story of sub inspector sirisha

దాంతో శిరీష 8 నెలల పాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలవు పెట్టి తాను సంపాదించిన 1.50 లక్షలతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌ లో చేరి శిక్షణ తీసుకొని 2019లో ఎస్ఐగా ఎంపికయ్యారు. శిరీషని ఆఫ్ట్రాల్ అన్న ఎస్పి విశాఖపట్నంలో జిల్లా పరిషత్ లో తనకి సన్మానం చేశారు. శిరీషకి గ్రూప్ వన్ సాధించి డిఎస్పి కావాలి అనేది లక్ష్యం. అందుకోసం శిరీష ప్రయత్నాలు చేస్తున్నారు.

story of sub inspector sirisha

శిరీష చేసిన పనికి హోం మంత్రి సుచరిత, ఎంపీ విజయసాయి రెడ్డి, తెలంగాణ పోలీసులు, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ ప్రశంసించడం తోపాటు, మంత్రి సీదిరి అప్పలరాజు సన్మానించారు. ఇవన్నీ తాను జీవితంలో మర్చిపోలేను అని శిరీష అన్నారు. అంతేకాకుండా ఇంక ముందు కూడా తన తండ్రి చూపిన సేవా మార్గం లోనే వెళ్తాను అని అన్నారు.

watch video :

https://youtu.be/ZJTjCTY0qSA

 


End of Article

You may also like