తల్లికి వందనం స్టేటస్ చెక్ | ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం 2026

తల్లికి వందనం స్టేటస్ చెక్ | ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం 2026

తల్లికి వందనం స్టేటస్ చెక్ | ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం 2026

by Anudeep

Ads

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం 2026 :  ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో 13,000rs ప్రభుత్వం ఏటా ఆర్థిక సాయాన్ని జమ చేస్తుంది.

Video Advertisement

Thalliki Vandanam Status Check 2026

Thalliki Vandanam Status Check 2026

తల్లికి వందనం పథకం ముఖ్య వివరాలు (Key Highlights)

  • ఆర్థిక సాయం: ఏటా రూ. 15,000 (పాఠశాల నిర్వహణ మినహాయింపులు పోను నికరంగా రూ. 13,000 అకౌంట్లో జమ అవుతుంది).

  • ఎవరికి ఇస్తారు: 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్) చదువుతున్న విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు (Guardians).

  • లబ్ధిదారుల ఎంపిక: అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాకు నేరుగా DBT (Direct Benefit Transfer) ద్వారా డబ్బులు జమ చేయబడతాయి.

  • అధికారిక పోర్టల్: GSWS NBM Portal (Navasakam Beneficiary Management).

తల్లికి వందనం పథకం అర్హత ప్రమాణాలు (Eligibility Criteria)

ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక కావడానికి కింది అర్హతలుండాలి:

  1. నివాసం & చదువు: విద్యార్థి మరియు తల్లి/సంరక్షకులు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. పిల్లలు ఏపీలోని గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కూళ్లు/జూనియర్ కాలేజీలలో చదువుతుండాలి.

  2. హాజరు శాతం: విద్యార్థికి సంబంధిత విద్యా సంవత్సరంలో కనీసం 75% హాజరు (Attendance) తప్పనిసరి.

  3. ఆదాయ పరిమితి: కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 12,000 మించకూడదు.

  4. భూమి పరిమితి: కుటుంబానికి 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి (Wet Land) లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట భూమి (Dry Land) ఉండాలి.

  5. విద్యుత్ వినియోగం: గత 12 నెలల సగటు విద్యుత్ వినియోగం (Electricity Bill) 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి.

  6. ప్రభుత్వ ఉద్యోగం: కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా PSU ఉద్యోగి అయి ఉండకూడదు (ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు కాకూడదు).

  7. రైస్ కార్డ్: కుటుంబానికి వాలిడ్ రైస్ కార్డ్ (Rice Card) ఉండాలి.

 Thalliki Vandanam Status Check 2026

 Thalliki Vandanam Status Check 2026

Thalliki Vandanam Status Check 2026

  1. అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
  2. “Thalliki Vandanam Status Check 2026” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  3. Academic Year లో “2026-27” సెలెక్ట్ చేయండి.
  4. Scheme Type లో “Thalliki Vandanam” ఎంచుకోండి.
  5. తల్లి ఆధార్ నంబర్ నమోదు చేయండి.
  6. Captcha కోడ్ ఎంటర్ చేయండి.
  7. OTP Verify చేయండి.
  8. వెంటనే మీ Eligibility మరియు Validation Status కనిపిస్తుంది.
తల్లికి వందనం పథకం కావలసిన పత్రాలు (Required Documents)

వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయడానికి లేదా సచివాలయంలో వెరిఫికేషన్ కోసం కింది పత్రాలు అవసరం:

  • 🔹 తల్లి మరియు విద్యార్థి యొక్క ఆధార్ కార్డులు (Aadhaar Cards)

  • 🔹 వాలిడ్ రైస్ కార్డ్ / రేషన్ కార్డ్ (Rice Card)

  • 🔹 తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ (ఫోటో ఉన్న మొదటి పేజీ)

  • 🔹 విద్యార్థి చదువుతున్న స్కూల్/కాలేజీ ఐడీ కార్డ్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్

  • 🔹 కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)

  • 🔹 విద్యుత్ బిల్లు (Electricity Bill)సంఖ్య

  • 🔹 తల్లి ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరిగా e-KYC అయ్యి, బ్యాంక్ ఖాతాకు NPCI (Aadhaar Seeding) లింక్ అయి ఉండాలి.

తల్లికి వందనం పథకం దరఖాస్తు మరియు స్టేటస్ చెక్ చేసుకునే విధానం
  1. డేటా సేకరణ: పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM) విద్యార్థుల వివరాలను UDISE/చైల్డ్ ఇన్ఫో పోర్టల్‌లో నమోదు చేస్తారు.

  2. సచివాలయ వెరిఫికేషన్: ఆ డేటా ఆధారంగా గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా లబ్ధిదారుల అర్హతను పరిశీలిస్తారు.

  3. స్టేటస్ చెక్: అర్హులైన వారి జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అలాగే అధికారిక NBM పోర్టల్ లో తల్లి ఆధార్ నంబర్ మరియు OTP ఎంటర్ చేసి ఆన్‌లైన్‌లో ‘తల్లికి వందనం’ పేమెంట్ లేదా ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

తల్లికి వందనం పథకం డబ్బులు రాకపోవడానికి ప్రధాన కారణాలు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ. 13,000 జమ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, కొంతమందికి అర్హత ఉన్నప్పటికీ రకరకాల సాంకేతిక మరియు క్షేత్రస్థాయి కారణాల వల్ల డబ్బులు జమ కావడం లేదు. మీ ఖాతాలో కూడా డబ్బులు పడకపోతే, దానికి కింది కారణాలలో ఏదైనా ఒకటి కావచ్చు:

1. బ్యాంక్ ఖాతాకు ఆధార్ & NPCI లింక్ కాకపోవడం (ముఖ్యమైన కారణం)

ప్రభుత్వం ఈ పథకం డబ్బులను DBT (Direct Benefit Transfer) ద్వారా నేరుగా ఆధార్ ఆధారిత బ్యాంక్ ఖాతాల్లోకి పంపుతుంది.

  • సమస్య: తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అవ్వకపోయినా, లేదా బ్యాంకులో NPCI (National Payments Corporation of India) / Aadhaar Seeding మ్యాపింగ్ యాక్టివ్‌గా లేకపోయినా డబ్బులు క్రెడిట్ అవ్వవు.

2. బ్యాంక్ ఖాతా ఇన్‌యాక్టివ్ (Inactive) లో ఉండటం
  • సమస్య: లబ్ధిదారురాలైన తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ చాలా కాలంగా వాడకుండా ఉంటే, బ్యాంకులు దానిని ‘ఇన్‌యాక్టివ్’ లేదా ‘ఫ్రీజ్’ (Freeze) చేస్తాయి. అటువంటప్పుడు ప్రభుత్వం డబ్బులు పంపినా, అవి తిరిగి రివర్స్ అయిపోతాయి.

  • సమస్య 2: ఆన్‌లైన్ దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా IFSC కోడ్ తప్పుగా నమోదు కావడం.

3. కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటడం (Electricity Bill Limit)
  • సమస్య: కుటుంబం యొక్క గత 12 నెలల సగటు విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్‌గా సిస్టమ్ వారిని అనర్హులుగా (Ineligible) చూపిస్తుంది.

  • అద్దె ఇళ్ల సమస్య: ముఖ్యంగా పట్టణాల్లో ఒకే మీటర్ ఉన్న ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు అద్దెకు ఉంటున్నప్పుడు, అందరి బిల్లు కలిపి 300 యూనిట్లు దాటితే, ఆ ఇంట్లోని అర్హులకు కూడా ఈ పథకం నిలిచిపోతుంది.

4. 75% పాఠశాల హాజరు (Attendance) లేకపోవడం
  • సమస్య: ఈ పథకం యొక్క ప్రధాన నిబంధన ప్రకారం.. విద్యార్థికి సంబంధిత విద్యా సంవత్సరంలో కనీసం 75% హాజరు తప్పనిసరి. చైల్డ్ ఇన్ఫో (Child Info) లేదా పాఠశాల రికార్డుల ప్రకారం హాజరు శాతం తగ్గితే డబ్బులు రావు.

5. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ (Household Mapping) & e-KYC సమస్యలు
  • సమస్య: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సాధికారత సర్వే (State Household Database) లో తల్లి మరియు విద్యార్థి వివరాలు ఒకే కుటుంబంగా నమోదు కాకపోవడం. అలాగే తల్లి లేదా విద్యార్థి యొక్క ఆధార్ e-KYC పూర్తి కాకపోవడం.

6. భూమి, ఆదాయం లేదా ప్రభుత్వ ఉద్యోగం (Six Step Validation)
  • సమస్య: ప్రభుత్వ ‘సిక్స్ స్టెప్ వాలిడేషన్’ లో కింది పరిమితులు దాటినట్లు తేలితే పథకం రాదు:

    • కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉండటం (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంది).

    • కుటుంబ సభ్యులు ఇన్‌కమ్ టాక్స్ (Income Tax) చెల్లిస్తుండటం.

    • గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000, పట్టణాల్లో రూ.12,000 నెలసరి ఆదాయం మించడం.

    • కుటుంబానికి 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి కంటే ఎక్కువ ఉండటం.

7. వివరాలలో తప్పులు (Data Mismatch)
  • సమస్య: స్కూల్ రికార్డులలో ఉన్న విద్యార్థి పేరు/పుట్టిన తేదీ మరియు ఆధార్ కార్డులో ఉన్న వివరాలు వేరువేరుగా ఉండటం వల్ల డేటా మిస్‌మ్యాచ్ అయి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.

 డబ్బులు రానివారు ఏం చేయాలి? (పరిష్కారాలు)

  1. సచివాలయంలో స్టేటస్ చెక్: ముందుగా మీ గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి NBM (Navasakam Beneficiary Management) పోర్టల్ ద్వారా మీకు ఏ కారణం చేత డబ్బులు రాలేదో (రిజెక్షన్ కారణం) సిబ్బందిని అడిగి తెలుసుకోండి.

  2. బ్యాంక్ ఖాతా సరిచేసుకోవడం: మీ ఆధార్ నంబర్ ఏ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉందో ఆన్‌లైన్‌లో లేదా బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకోండి. ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉంటే చిన్న లావాదేవీ (డబ్బులు డిపాజిట్ లేదా విత్‌డ్రా) చేసి యాక్టివేట్ చేయండి. బ్యాంకులో DBT/NPCI ఎనేబుల్ చేయించండి.

  3. గ్రీవెన్స్ (Grievance) రైజ్ చేయడం: ఒకవేళ మీకు అన్ని అర్హతలు ఉండి, కేవలం సాంకేతిక లోపాల వల్ల (ఉదాహరణకు కరెంట్ బిల్లు తప్పుగా రావడం, భూమి వివరాలు తప్పుగా చూపడం) అమౌంట్ రాకపోతే, సచివాలయంలో తగిన డాక్యుమెంట్లతో గ్రీవెన్స్ (ఫిర్యాదు) అప్లై చేయవచ్చు. అధికారులు రీ-వెరిఫికేషన్ చేసి అర్హులని తేలితే తదుపరి విడతలో డబ్బులు జమ చేస్తారు.


End of Article

You may also like