ఏలూరులో ఒక వింత వ్యాధితో ఎంతో మంది ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ఏలూరులోని ప్రజలందరూ భయాందోళనలతో ఉన్నారు. ఈ వింత వ్యాధి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎప్పుడు ఎవరికి ఎలా ఈ వ్యాధి సోకుతుందో కూడా ఎవరికీ తెలియడం లేదు. అయితే ఈ వ్యాధికి గల కారణాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. టీవీ9 కథనం ప్రకారం, ఏలూరులో ప్రజలు అస్వస్థతకి గురవ్వడానికి కారణం లెడ్ హెవీ మెటల్ అని పరీక్షల వివరాలు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

మొదటి నుంచి అనుమానించినట్లుగానే పేషెంట్స్ యొక్క బ్లడ్ శాంపిల్స్ లో లెడ్ అనే హెవీ మెటల్, ఇంకా నికెల్ అనే మెటల్ ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీలోని ఎయిమ్స్ నిర్వహించిన పరీక్షల్లో తేలింది. న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపించడానికి గల కారణం లెడ్ అని వాళ్ళు వెల్లడించారు. లెడ్ అనేది బ్యాటరీస్ లో ఉండే పదార్థం. ఇది తాగే నీటి ద్వారా, లేదా పాల ద్వారా అస్వస్థతకు గురైన వారి శరీరంలోకి వెళ్లి ఉండొచ్చు అని వైద్యులు అనుమానిస్తున్నారు.

శాంపిల్స్ టెస్ట్ వివరాలను ఎయిమ్స్ మంగళగిరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. పేషెంట్స్ శరీరాల్లోకి ఎలా ప్రవేశించిందో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ స్థానికంగా తెలుసుకోవాలి. నీళ్ల శాంపిల్స్, అలాగే పాల శాంపిల్స్ పంపించమని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరింది. మెటల్స్ ని డిటెక్ట్ చేసే పరికరాలు ఢిల్లీలోని ఎయిమ్స్ లో మాత్రమే ఉన్నాయి. ఈ రిపోర్ట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించాల్సి ఉంది.

























#2
#3
#4
#5
#6
#7
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18









































కానీ అప్పుడప్పుడు వేరే వాళ్ల స్టేటస్ చెక్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు మనకి అంతకుముందు మెసేజ్ చేసి ఉంటే, మనం దానికి రిప్లై ఇవ్వకుండా ఉంటే, కానీ స్టేటస్ సీన్ లో మన పేరు ఉంటే. ఇంక అంతే సంగతులు. కానీ మనం ఎవరి స్టేటస్ అయినా చూస్తే, వాళ్ళకి మనం చూసిన సంగతి తెలియకుండా ఉండడానికి ఒక టెక్నిక్ ఉపయోగిస్తే చాలు. అదేంటంటే.

