హనుమాన్ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయారు. తన నాలుగవ సినిమాతోనే పాన్-ఇండియన్ హిట్ కొట్టారు.
ఇప్పుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నారు. 2011 లో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిలిమ్ తో కెరీర్ మొదలు పెట్టారు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత కొన్ని అడ్వటైజ్మెంట్స్ కూడా డైరెక్ట్ చేశారు. 2014 లో వచ్చిన ఎ సైలెంట్ మెలోడీ, 2017 లో వచ్చిన డైలాగ్ ఇన్ ద డార్క్ షార్ట్ ఫిలిమ్స్ ప్రశాంత్ వర్మకి పేరు తీసుకొచ్చాయి.
2015 లో బ్రియాన్ లారాతో నాట్ అవుట్ అనే ఒక సిరీస్ డైరెక్ట్ చేశారు. 5 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, యప్ టీవీలో స్ట్రీమ్ అయ్యింది. ఆ తర్వాత 2017 లో హీరో నానికి ప్రశాంత్ వర్మ అ! సినిమా స్టోరీ చెప్పారు. ఈ సినిమా స్టోరీ నచ్చడంతో నాని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. సమాజంలో జరిగే ఎన్నో విషయాల మీద ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాకి బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మేకప్ విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.
ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి సినిమా డైరెక్టర్ చేశారు. ఆ తర్వాత జాంబీ రెడ్డి సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ప్రశాంత్ వర్మ తండ్రి నారాయణ రాజు గారు ఒక సివిల్ కాంట్రాక్టర్. ప్రశాంత్ వర్మ తల్లి కనకదుర్గ గారు ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్. ప్రశాంత వర్మకి స్నేహ సమీర అనే ఒక చెల్లెలు కూడా ఉన్నారు.
ప్రశాంత్ వర్మ ఆంధ్ర ప్రదేశ్ లోని పాలకొల్లుకు చెందినవారు. 2020 లో ప్రశాంత్ వర్మ సుకన్య రాజుని పెళ్లి చేసుకున్నారు. సుకన్య రాజు ఒక ఫ్యాషన్ డిజైనర్. సచ్ బై సుకన్య రాజు చేకూరి పేరుతో సుకన్యకి ఒక ఫ్యాషన్ బ్రాండ్ కూడా ఉంది. ఇండో వెస్ట్రన్ దుస్తులని సుకన్య డిజైన్ చేస్తారు. ఇటీవల హనుమాన్ ఈవెంట్ లో కూడా సుకన్య కనిపించారు.
https://www.instagram.com/reel/CurvjKzgF9J/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ALSO READ : నేషనల్ అవార్డ్ విజేతని “బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్” చేశారుగా..? ఎవరంటే..?