అయోధ్యలోని రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. దేశం మొత్తం రామ నామ స్మరణతో నిండిపోయింది. ప్రాణప్రతిష్ట సమయంలో ఇళ్ళలో పూజలు చేసుకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.
నిన్నటి రోజు ఒక పండగ లాంటిదే. ఎన్నో దశాబ్దాల కష్టం ఫలితం ఇది. కాబట్టి ఆ రోజుని ఒక పండుగలాగానే జరుపుకున్నారు. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యలోని రామ మందిరంకి వెళ్లి రాముడి ప్రాణప్రతిష్ట వేడుకలో పాల్గొన్నారు.
అయితే, ఈ వేడుకకి హాజరు కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఆహ్వానాలు అందినా కూడా కొంత మంది కొన్ని కారణాల వల్ల ఈ వేడుకకి వెళ్లలేకపోయారు. అయోధ్యకి వెళ్లలేని వారిలో ఎల్కే అద్వానీ ఒకరు. చాలా మంది వస్తారు అని అనుకున్నారు. కానీ గత నెలలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు, “ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి ఈ వేడుకకి హాజరు అవ్వలేరు” అని చెప్పారు. అందుకు కారణం, “చలికాలం కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది” అని, “వారి వయసు వాతావరణంనికి సహకరించకపోవచ్చు” అని చెప్పారు.
మరొక పక్క విశ్వహిందూ పరిషత్ కి చెందిన ఒక వ్యక్తి మాత్రం, ఒక సమయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఎల్కే అద్వానీ వస్తారు” అని, “అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు” అని చెప్పారు. కానీ నిన్నటి వేడుకకి ఎల్కే అద్వానీ హాజరు కాలేదు. కొంత మంది, “వయసు వల్ల అవ్వచ్చు” అని అంటున్నా కూడా, మరి కొంతమంది మాత్రం, “ఆయన రాకపోవడానికి బలమైన కారణం ఉంది” అని అంటున్నారు. అసలు రామ మందిరం నిర్మాణానికి కృషి చేసిన వారిలో ఎల్కే అద్వానీ ఒకరు. 1990 ల్లో రామ్ జన్మభూమి ఉద్యమాన్ని మొదలు పెట్టింది ఎల్కే అద్వానీ.
1992 లో బాబ్రీ మసీదు గొడవ సమయంలో ఎల్కే అద్వానీ రామ మందిరానికి మద్దతుగా నిలబడి, “మందిర్ వహీ బనాయేంగే (అక్కడే గుడి కడతాం)”అనే ఒక నినాదంతో రామ మందిరం కోసం పోరాడారు. అలాంటి వ్యక్తి గురించి ఎక్కడా చెప్పట్లేదు. ఇప్పుడు ప్రాణప్రతిష్టకి ముందు మీడియాతో ఈ విషయం మీద ఎన్నో సార్లు మాట్లాడారు. వారిలో ఒక్కరు కూడా ఎల్కే అద్వానీ చేసిన కృషిని తలుచుకోలేదు. దాంతో ఈ విషయం మీద ఎల్కే అద్వానీ బాధపడి ఈ వేడుకకి హాజరు అవ్వలేదు అని అంటున్నారు. ఏదేమైనా సరే ఎల్కే అద్వానీ వస్తారు అనుకున్న వారు ఆయన రాకపోవడంతో కాస్త నిరాశ చెందారు.
ALSO READ : AYODHYA RAM MANDIR PRASADAM BOX: అయోధ్యలో VVIP లకి ఇచ్చిన ఆ స్పెషల్ బాక్స్ లో ఉన్న 8 ఐటమ్స్ ఇవే.!