ఒకవేళ ఆదిపురుష్ సినిమా హిట్ అయ్యి ఉంటే… ఇవాళ వారి స్థానంలో వీళ్ళు ఉండేవారు ఏమో కదా..? వీరికి కూడా ఇంతే గౌరవం అందేది కదా..?

ఒకవేళ ఆదిపురుష్ సినిమా హిట్ అయ్యి ఉంటే… ఇవాళ వారి స్థానంలో వీళ్ళు ఉండేవారు ఏమో కదా..? వీరికి కూడా ఇంతే గౌరవం అందేది కదా..?

by Mohana Priya

సాధారణంగా సినిమా తీయడం అనేది చాలా సాహసమైన విషయం. అయితే, ఈ సినిమాలో ఎలాంటి జోనర్ ఎంచుకున్నాం అనేది కూడా ముఖ్యమైన విషయమే. పురాణాల మీద, ఇతిహాసాల మీద సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి.

Video Advertisement

భారతదేశ ప్రజలు అంటేనే గుర్తొచ్చేది వారి సాంప్రదాయాలు, భక్తి. కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా సినిమా తీయాలి. కాస్త అటు ఇటు అయినా కూడా సినిమా తీసిన వాళ్ల మీద భారం పడే అవకాశం ఉంది. ఇటీవల అలా జరిగిన సినిమా ఏదో అందరికీ తెలిసిపోయే ఉంటుంది.

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి ఆ అంచనాలని అందుకోలేకపోయింది. ఇందులో రామాయణాన్ని వేరే విధంగా చూపించారు అంటూ కామెంట్స్ వచ్చాయి. అలా చూపించడం చాలా మంది ప్రేక్షకులని కూడా ఈ సినిమా గురించి తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచేలాగా చేసింది. సినిమాలో రావణాసురుడు వేషధారణ మీద చాలా కామెంట్స్ వచ్చాయి.

ఇంకా ఈ సినిమాలో అలా కామెంట్స్ వచ్చిన విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకటి, రెండు తప్ప ఈ సినిమాలో పెద్దగా ప్లస్ పాయింట్స్ కూడా లేవు. అయితే, ఇప్పుడు ఈ సినిమా మళ్లీ చర్చల్లోకి వచ్చింది. సినిమా హిట్ అయ్యి ఉంటే ఇవాళ పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటున్నారు. అందుకు కారణం, అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పలు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

these people are respected in ayodhya

చారిత్రాత్మకమైన రామాయణం సీరియల్ లో నటించిన నటులు కూడా అయోధ్య రామ మందిర వేడుకలు పాల్గొన్నారు. ఇటీవల అయోధ్యకి వెళ్లి అక్కడ అందరిని పలకరించి వచ్చారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఆదిపురుష్ సినిమా హిట్ అయ్యి ఉంటే, బహుశా, ప్రభాస్, కృతి సనన్, లక్ష్మణుడి పాత్ర పోషించిన సన్నీ సింగ్ కూడా ఇలాగే వెళ్లే వాళ్ళు ఏమో అని అంటున్నారు. ప్రభాస్ కి ఆహ్వానం అందింది. అయితే ఈ సీరియల్ లో నటించిన వారిని ఇప్పటికి కూడా ఎంతో భక్తితో చూస్తారు.

Adipurush

ఒకవేళ ఈ సినిమా హిట్ అయ్యి ఉంటే ఇవాళ వాళ్లు కూడా అలాగే వెళ్లేవారు ఏమో, ప్రేక్షకులు కూడా వారిని అంతే ఆదరించే వారు ఏమో అని కామెంట్స్ వస్తున్నాయి. రామాయణం మీద ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే అవన్నీ కేవలం ప్రాంతీయ చిత్రాలు మాత్రమే. ఈ సినిమా మాత్రం పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది. కాబట్టి హిట్ అయ్యి ఉంటే మాత్రం దేశవ్యాప్తంగా ఈ సినిమాకి, ఇందులో నటించిన వారికి ఆదరణ పెరిగేది. అంతే కాకుండా దర్శకుడుని కూడా ఎంతో గౌరవప్రదంగా చూసేవారు. ఇవన్నీ మాత్రమే కాకుండా పురాణాల మీద తీసిన మరొక మంచి సినిమా అయ్యి ఉండేది.


You may also like

Leave a Comment