తెలుగుతరపై ఎందరో మంది హీరోయిన్లు మెరుస్తూ ఉంటారు. చాలామంది అసలు పేరు కంటే కొసరి పేరు పెట్టుకుని ఫేమస్ అవుతూ ఉంటారు. అసలు పేరు ఇంకా ఏదో ఉన్నా స్వీట్ గా షార్ట్ గా జనానికి గుర్తుండిపోయే పేరు పెట్టుకుని క్రేజ్ తెచ్చుకుంటారు.
అయితే ఇప్పుడు సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తన ఇంటి పేరును మార్చేసుకుంది. ఇంతకీ ఎందుకు మార్చుకుంది అనే విషయంలోకి వెళ్తే..

లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.వీరి పెళ్లి ఇటలీలో ఘనంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. హైదరాబాదులో కూడా వీరి రిసెప్షన్ భారీగా ఏర్పాటు చేశారు. పెళ్లి అనంతరం లావణ్య వరుణ్ తేజ్ తో కలిసి హైదరాబాదులోనే నివసిస్తుంది.
వరుణ్ తేజ్ యధావిధిగా తన షూటింగ్లకు హాజరైపోతున్నాడు అయితే లావణ్య మాత్రం సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది మెగా ఇంటి కోడలు అయిన తర్వాత ఆ ఇంటి పద్ధతులను పాటిస్తూ అందరిని పొందుతుంది అయితే ఇప్పుడు లావణ్య సోషల్ మీడియాలో తన పేరు చివర్న కొణిదల అని ఇంటిపేరును చేర్చుకుంది. సాధారణంగా తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లయిన తర్వాత భర్త ఇంటి పేరు వచ్చి చేరుతుంది. అదే పద్ధతిని ఇప్పుడు లావణ్య కూడా పాటించింది.ఇది చూసి అందరూ కొణిదల వారి కోడలు అంటూ కామెంట్లు పెడుతున్నారు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సలార్ రిలీజ్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఈ మూవీలో జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, బాబీ సింహా, దేవరాజ్ వంటివారు నటించారు.
బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ కి హిట్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీ చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ విశ్వరూపాన్ని చూపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించాడని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో కూడా యాక్షన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. హీరో ప్రభాస్ ఒక సన్నివేశంలో ఇనుప కడ్డీ పట్టుకుంటే, ఆ రాడ్ పైన ఫింగర్స్ ప్రింట్ పడుతాయి. మరో సన్నివేశంలో ఒక గుద్దు గుద్దితే షాక్ కొట్టిన వాడు బ్రతుకుతడం ఏంటని, కరెంట్ వైర్ సీన్ అవసరమా అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.









