ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న ఒకే ఒక టాపిక్ బడ్జెట్. ఇప్పుడే కాదు. ఎప్పుడైనా సరే బడ్జెట్ గురించే చర్చలు అవుతూనే ఉంటాయి. అది దేశానికి, ఇంకా దేశంలో ఉన్న ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి అందరూ బడ్జెట్ గురించి ఆసక్తిగానే తెలుసుకుంటారు. కేవలం ప్రభుత్వం విషయంలోనే కాదు సాధారణంగా కూడా రోజువారీ జీవితంలో బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైనది.
ఏదైనా పని చేయాలి అన్నా, ఇల్లు నడపాలి అన్నా కూడా తీసుకునే ప్రతి నిర్ణయం బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు. దాని ప్రకారమే ప్లాన్ చేసుకుంటారు. బడ్జెట్ అనేది ఒక మనిషి పొదుపు, ఖర్చులకి సంబంధించినవి అయి ఉండొచ్చు, ఒక గ్రూప్ కి సంబంధించినది, ప్రభుత్వానికి సంబంధించినది, బిజినెస్ కి సంబంధించినది కూడా అయి ఉండొచ్చు.
ఈ పదాన్ని మనం ఎక్కువగానే వాడతాము. అయితే, అసలు బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో మీకు తెలుసా? బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ భాషలోని బుజెట్ అనే పదం నుంచి వచ్చింది. బుజెట్ అంటే లెదర్ తో తయారుచేసిన బ్యాగ్ అని అర్థం. 1733 లో సర్ రాబర్ట్ వాల్పోల్ అనే బ్రిటన్ కి చెందిన మంత్రి ఆదాయానికి, ఖర్చులకి సంబంధించి తయారుచేసిన ఫైనాన్షియల్ రిపోర్ట్ ని ఒక బుజెట్ లో పెట్టుకొని తీసుకెళ్లారు.
దాన్ని సమావేశంలో ప్రెజెంట్ చేశారు. అయితే, రాబర్ట్ వాల్పోల్ బుజెట్ ప్రజెంట్ చేశారు అనే వార్త మెల్లగా పాకడం మొదలైంది. తర్వాత అది వార్త బ్రిటన్ దేశమంతటా తెలిసింది. దాంతో మెల్లగా బడ్జెట్ అన్న పదం అర్థమే మారిపోయింది. అంతేకాకుండా “ద బడ్జెట్ ఓపెన్డ్” అని రాబర్ట్ వాల్పోల్ కార్టూన్ కూడా ప్రచురించబడింది. భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ 1860 జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి జారీచేశారు. తర్వాత 1947 లో ఆర్కె షణ్ముఖం చెట్టి బడ్జెట్ ని ప్రెజెంట్ చేశారు.