పెళ్లంటే పందిళ్లు,సందళ్లు,తప్పట్లు,తాళాల,తళంబ్రాలు మూడే ముళ్లు,ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు అంటూ ఒక ఫేమస్ పాట ఉంది గుర్తుందా? ఇవన్నీ జరగాలంటే ముందు పెళ్లి కార్డు కావాలి కదండీ.ఇంతకీ మీరు పెళ్లి కార్డులో ఏం రాయిస్తారు? శ్రీరస్తు,శుభమస్తూ,ఆవిగ్నమస్తూ అంటూ మొదలుపెట్టి పెళ్లికొడుకు,పెళ్లి కూతురు పేర్లు,వివాహ వేడుక తదితర వివరాలు, చివరన బంధుమిత్రుల అభినందనలతో అంటూ ముగిస్తుంది. అవునా?కాదా? కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిందండోయి. కరోనా దెబ్బకు మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇకపై పెళ్లిళ్లు జరగాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి. ఈ క్రమంలో కరోనా పెళ్లి పత్రిక అంటూ వాట్సాప్ లో ఓ మెసేజ్ వైరల్ అవుతుంది. అది ఓ లుక్ వేయండి.

Video Advertisement

representative image

కరోనా పెళ్ళిపత్రిక
ఇవాళ నాకు ఒక పెళ్ళిపత్రిక వచ్చింది. అది చూసిన నాకు మైండ్ బ్లాక్ అయ్యింది.
నియమాలు-షరతులు
1. దయచేసి మీరు సకుటుంబంగా రావద్దు.కేవలం మీరొక్కరే రండి.
2.స్వచ్చతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎట్టిపరిస్థితుల్లో మీమాస్క్ ను తొలగించవద్దు.
3.అనవసరంగా ఏ వస్తువులను తాకవద్దు.
4.వధూవరులను దూరంనుండే ఆశీర్వదించండి.
5.దగ్గరగా వచ్చి ఫోటోలు తీయడానికి ప్రయత్నించవద్దు.
6.ప్రతిచోట కనీసం ఆరడుగుల సామాజికదూరాన్ని పాటించండి.

7. కౌంటర్ నం-1-క్యాష్ కానుకలు
కౌంటర్ నం -2- వస్తురూపకానుకలు
కౌంటర్-3 ఆన్ లయన్ పేమెంట్ స్క్రీన్ షాట్ చూపించి మీల్స్ కూపన్ పొందండి.
కౌంటర్-4- పుష్పగుచ్ఛాలు,పూలదండలు తీసుకురావడం నిషిద్ధం కనుక ఆడబ్బులు చెల్లించడానికి
కౌంటర్-5 – ఆన్ లయన్ పేమెంట్

నోట్– మిమ్మల్ని తప్పనిసరిగా పిలవాల్సివచ్చింది.ఎందుకంటే ఇంతకుముందు మేం మీఇంటికి వచ్చి కవరు ఇచ్చాం కాబట్టి.
గమనిక– మాస్కులు,సేనటైజర్స్ మీవి మీరే తెచ్చుకోవాలి.

Also read: 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక.

ప్రజలు అందరు భౌతిక దూరాన్ని పాటిస్తూ , అవసరమైతేనే తప్ప బయటకి రావద్దు అంటూ హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం. మనం బయటకి వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి. వీలైనంత వరకు కన్ను ముక్కు తాకకుండా ఉండాలి. ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఒకవేళ బయట ఏదైనా ముట్టుకున్నా వెంటనే శానిటైజర్ తో చేతిని శుభ్రపరుచుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే కరోనాని కొంత వరకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయచ్చు. ఈ క్రమంలో పెళ్లి జరపడం కష్టమే. ఒకవేళ జరిగినా మునపటిలాగా ఆర్భాటాలు ఉండవు.