అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్. ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. వాసు వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కాలేజీ గొడవలు నేపథ్యంలో ఉంటుంది. 2009లో అప్పటికి ఉన్న పరిస్థితులు నేపథ్యంలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ జోష్ సినిమా వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ మూవీలో ఒకటిగా నిలుస్తుంది.

ఈ సినిమాలో ఒక సోషల్ పాయింట్ ను తీసుకుని, యూత్ కి, రాజకీయాలకి ముడిపెట్టి మంచి కథను చెప్పారు. అయితే ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది. అన్నయ్య వచ్చినాడు అంటూ సాగే ఈ పాటను పాడింది ఎవరో తెలుసా. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు. ఏంటి షాక్ అయ్యారా…? ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాఘవేంద్రరావు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇది జరిగి చాలా రోజులు అవుతున్న కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. దిల్ రాజ్ కి పాటల పాడడం అంటే చాలా ఇష్టమట. మంచి అభిరుచి కూడా ఉందంట.
ఈ సినిమా డైరెక్టర్ వాసు వర్మ పట్టు పట్టడంతో ఈ పాటని దిల్ రాజునే పాడారు. పాటలో వాయిస్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. సరిగ్గా వింటే తప్ప అది దిల్ రాజు వాయిస్ అని ఎవరు గుర్తుపట్టలేరు. ఈ న్యూస్ తెలుసుకున్న చాలామంది మళ్లీ యూట్యూబ్ లోకి వెళ్లి ఆ పాటను వింటున్నారు.










తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కీలక ఆఫీసర్ల మార్పులు జరుగుతున్నాయి. పలువురు ఆఫీసర్లను ఇప్పటికే బదిలీ చేస్తూ, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో సీఎంపేషీలో కొత్త ఆఫీసర్లు వచ్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఆమ్రపాలి కాట 1982లో ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలో వెంకట్ రెడ్డి కాటా, పద్మావతి దంపతులకు నవంబరు 4న జన్మించారు. ఆమెకు ఒక తోబుట్టువు ఉన్నారు. విశాఖపట్నంలో సాయి సత్య మందిర్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె జేఈఈ లో ఉత్తీర్ణత సాధించి, చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ఎంబీఏ పూర్తి చేసింది. ఆమ్రపాలి 2010 లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో 39 వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్ అధికారిణి అయింది. ఐఏఎస్ కు ఎంపికయిన అతి తక్కువ వయస్కులలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు.
2013లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా నియమితులైన ఆమె, 2014లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. మరుసటి ఏడాది తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా పనిచేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2016లో ఆమ్రపాలి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన తొలి మహిళ ఐఏఎస్ ఆఫీసర్. “యంగ్ డైనమిక్ ఆఫీసర్” గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో పీఎం కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమ్రపాలి తెలంగాణలో సీఎంఓలోకి రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.