హీరోయిన్ ఎంగేజ్మెంట్ సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ తండ్రి ఫ్రెండ్ కొడుకైన మన హీరో కూడా హీరోయిన్ ఇంటికి వస్తాడు. అక్కడ అవుట్ హౌస్ లో ఉంటూ కామెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఉద్యోగం వస్తుంది. ఇలా సాగుతుండగా అనుకోకుండా హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ తండ్రికి ఇచ్చిన మాటకోసం ఆ అమ్మాయిని ప్రేమించాలా? వద్దా? అనే కన్ఫ్యూషన్ లో పడతాడు మన హీరో.
ఈపాటికే మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఇంతసేపు మాట్లాడింది ఏ సినిమా గురించని. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా ఎవర్ గ్రీన్ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాని ఎన్ని సార్లు చూసినా ఏ మాత్రం బోర్ అనిపించదు. పైగా సినిమా మొత్తం మంచి కామెడీతో ఉంటుంది. విక్టరీ వెంకటేష్ యాక్షన్ తో పాటు కామెడీ కూడా చేసే కొద్ది మంది హీరోలలో ఒకరు. సరైన పాత్ర వచ్చిందంటే కామెడీ టైమింగ్ ని ఎవరు ఆపలేరు. వెంకటేష్ నటించిన సినిమాల్లో ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి.

వాటిలో నువ్వు నాకు నచ్చావ్ కూడా ఒకటి. విజయ భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో త్రివిక్రమ్ రచన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కోటి అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. మూడు గంటల సినిమా అయినా సరే ఎంతో హాయిగా చూసేయొచ్చు. ఇదిలా ఉంటే సినిమాల్లో తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ అవి కనుక బయట పడ్డాయి అంటే ప్రేక్షకులు ఒక ఆట ఆడేసుకుంటారు. తాజాగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఒక సీన్ లో జరిగిన తప్పు బయటపడింది. మరి నువ్వు నాకు నచ్చిన సినిమా లో జరిగిన తప్పు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

మొదట ఆర్తి అగర్వాల్, వెంకటేష్ పక్క పక్కన ఉంటారు. ఆర్తి అగర్వాల్ వెనక్కి తిరిగి వుంటారు. అప్పుడు చూస్తే ఆర్తి అగర్వాల్ జడలో పువ్వు ఉండదు. తర్వాత మళ్ళీ పూర్తిగా వెనక్కి తిరిగి వెళ్ళి పోతున్నప్పుడు జడలో పువ్వు కనబడుతుంది. సడన్ గా సీన్లోకి పువ్వు వస్తుంది. అందుకే చిన్నచిన్న వాటిని కూడ చూసుకుంటూ ఉండాలి. లేదంటే ఆడియన్స్ ఇలానే ఆడేసుకుంటారు.











































ఓ సారి సత్రాజిత్తు వద్ద ఉన్న శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు చూస్తాడు. అది బాగుందని.. తనకు ఇవ్వమని అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. దీనితో.. కృష్ణుడు దాని గురించి మరిచిపోతాడు. ఓ రోజు సత్రాజిత్తు కు తెలియకుండా.. అతని తమ్ముడు ఆ మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. కానీ తిరిగి రాలేకపోతాడు. ఈ క్రమం లో మణి కోసమే శ్రీ కృష్ణుడు తన తమ్ముడిని హత్య చేయించి ఉంటాడు అని సత్రాజిత్తు భావిస్తాడు. ఇది క్రమం గా ప్రచారం అయ్యి కృష్ణుడి చెవిన పడుతుంది. వినాయక చవితి రోజున చంద్రుని చూడడం వల్లనే తనపై ఇటువంటి నీలాపనింద వచ్చిందని కృష్ణుడు తలుస్తాడు.























