Ads
ప్రతీ వారం గురు శుక్రవారాల్లో ప్రేక్షకులు అందరూ, రాత్రి 9:30 అయ్యింది అంటే చాలు ఈటీవీ చానెల్ కి అతుక్కుపోతారు. కారణం అందరినీ కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ షో. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కళాకారులను మల్లెమాల పరిచయం చేసింది.
Video Advertisement
ఇప్పుడు అలా వచ్చిన ఆర్టిస్టులు ఎందరో వెండి తెరలో సందడి చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇక అందులో నటిస్తున్న వారిలో ఎవరికి పెళ్ళిళ్ళు అవుతున్నా ప్రేక్షకులకు అదొక గుడ్ న్యూస్ లాగా, తమ ఇంట్లో ఫంక్షన్ లాగానే భావిస్తారు.
అందులో మరీ ముఖ్యంగా, రష్మీ, సుధీర్ ల పెళ్లిళ్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో జబర్దస్త్ నటి వివాహం గురించిన కబుర్లు నెట్టింట కొనసాగుతున్నాయి. తొలుత నా పేరు మీనాక్షి, అత్తారింటికి దారేదీ, కస్తూరీ సీరియల్స్ లో నటించిన షబీనా షేక్ తరువాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టింది. ఈ షో తో ఎంతో మంచి పేరును కూడా సంపాదించుకుంది. అయితే ఇటీవల తనకు పెళ్లి కూడా నిశ్చయం అయ్యింది.
ఈ మేరకు జూలై 17 న నిశ్చితార్థం జరిగింది. దీని తాలూకు ఫోటోలను షబీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ…తన జీవితంలో ఇది ఎంతో మెమరెబుల్ డే అంటూ కోట్ చేసింది. అంతే దెబ్బతో ఫోటోలు నెట్టింట చకచకా వైరల్ అయిపోతున్నాయి. అంతే కాకుండా సుధీర్, రాష్మీల పెళ్ళిళ్ళు కూడా ఎప్పుడూ అవుతాయో అంటూ కొందరు అభిమానులు కామెంట్లు కూడా చేస్తున్నారు.
End of Article